ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్ శాసనసభ్యుడు శ్రీ అమృత్ లాల్ మీణా మృతికి ప్రధాన మంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
08 AUG 2024 9:46PM by PIB Hyderabad
రాజస్థాన్ లో సలూంబర్ విధాన సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు శ్రీ అమృత్ లాల్ మీణా ఈ రోజు మరణించారన్న సంగతి తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
నియోజకవర్గం అభివృద్ధి పట్ల శ్రీ అమృత్ లాల్ మీణా చాటిన నిబద్ధత ను, సంస్థ నిర్వహణ సంబంధ కార్యాల లో ఆయన చొరవను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో పొందుపరచిన ఒక సందేశంలో :
‘‘రాజస్థాన్ లోని సలూంబర్ నియోజకవర్గం లో బిజెపి ఎమ్మెల్యే శ్రీ అమృత్ లాల్ మీణా గారు ఇక మన మధ్య లేరన్న సంగతి తెలిసి చాలా దు:ఖం కలిగింది. ఆయన పార్టీ లో ఒక కర్మిష్టి కార్యకర్త గా నడుచుకొన్నారు. ఆయన నియోజకవర్గం అభివృద్ధిలో, సంస్థ ను బలపరచడంలో అమూల్యమైన తోడ్పాటును అందించారు. ఈ శోక ఘడియలో ఆయన కుటుంబ సభ్యులకు మరియు ఆయన మద్దతుదారులకు కలిగిన దు:ఖంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 2043531)
आगंतुक पटल : 73
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada