ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశ మాజీ క్రికెటర్, కోచ్ శ్రీ అంశుమాన్ గాయక్ వాడ్ మృతికి ప్రధాన మంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
31 JUL 2024 11:59PM by PIB Hyderabad
భారతదేశ పూర్వ క్రికెటర్ మరియు కోచ్ శ్రీ అంశుమాన్ గాయక్ వాడ్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ అంశుమాన్ గాయక్ వాడ్ గారిని క్రికెట్ కు ఆయన అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని స్మరించుకోవడం జరుగుతుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ అంశుమాన్ గాయక్ వాడ్ ఒక ప్రతిభావంతుడైన ఆటగాడు, అంతేకాదు ఆయన ఒక అసాధారణ శిక్షకుడు కూడా అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్రీ అంశుమాన్ గాయక్ వాడ్ జీని క్రికెట్ కు ఆయన అందించిన తోడ్పాటును దృష్టిలో ఉంచుకొని, స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన ఒక ప్రతిభాశాలి ఆటగాడు, ఒక అసాధారణ కోచ్ కూడాను. ఆయన మరణించారని తెలిసి, బాధపడ్డాను. ఆయన కుటుంబానికి, ఆయనను అభిమానించే వారికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’
(रिलीज़ आईडी: 2040623)
आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam