ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వియత్నాం ప్రధాన మంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా (ఆగస్టు 01, 2024) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

Posted On: 01 AUG 2024 2:14PM by PIB Hyderabad

గౌరవనీయులు , ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్ ,

ఇరు దేశాల ప్రతినిధులు ,

మీడియా మిత్రులు,

నమస్కారం!

సిన్ చాఉ!

భారతదేశానికి విచ్చేసిన ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్, ఆయన ప్రతినిధి  బృందానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

ముందుగా జనరల్ సెక్రటరీ , న్యువెన్ ఫూ చోంగ్ మృతి పట్ల భారతీయులందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

ఆయన భారత్ కు మంచి మిత్రుడు. ఆయన నాయకత్వంలో భారత్వియత్నాం సంబంధాలకు వ్యూహాత్మక దిశానిర్దేశం లభించింది.

మిత్రులారా,

గత దశాబ్దకాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు విస్తరించడంతో పాటు  స్థిరీకరించబడ్డాయి

గత 10 సంవత్సరాలలో, మా ఇరు దేశాల మధ్య సంబంధాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చేసాము.

మన ద్వైపాక్షిక వాణిజ్యం 85 శాతానికి పైగా పెరిగింది.

ఎనర్జీ , సాంకేతికత తో పాటు అభివృద్ధి భాగస్వామ్యాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కూడా పెరిగింది.

రక్షణభద్రతా రంగాల్లో పరస్పర సహకారం కొత్త ఊపును సంతరించుకుంది.

గత దశాబ్దంలోకనెక్టివిటీ పెరిగింది. నేడు మా మధ్య 50 కంటే ఎక్కువ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి.

వీటితో పాటు పర్యాటకంలో గణనీయ వృధ్ధి కొనసాగుతోంది ప్రజలకు ఈ-వీసా సదుపాయం కూడా కల్పించడం జరిగింది.

'మీ సోన్'లోని పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.

మిత్రులారా,

గత దశాబ్దపు విజయాల దృష్ట్యాఈ రోజు మా చర్చలలోఅన్ని రంగాలలో పరస్పర సహకారం గురించి మేము సమగ్రంగా చర్చించాం.

భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడానికి అనేక చర్యలు తీసుకున్నాం.

 వికసిత్ భారత్ 2047’ తో పాటు వియత్నాంవిజన్ 2045’ కారణంగా రెండు దేశాలలో అభివృద్ధి ఊపందుకున్నదని మేము విశ్వసిస్తున్నాము.

అనేక కొత్త రంగాలలో  పరస్పర సహకారానికి ఇది తెరతీస్తోంది.

అందువల్లమన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికిఈ రోజు మేము ఒక కొత్త కార్యాచరణ ప్రణాళికను స్వీకరించాము.

రక్షణభద్రతా రంగాల్లో సహకారం కోసం కొత్త చర్యలు చేపట్టడం జరిగింది.

నయా చాంగ్ లో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్ వేర్ పార్క్ ఈ రోజు ప్రారంభించబడింది.

300 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ఒప్పందం వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేస్తుంది.

ఉగ్రవాదంసైబర్ భద్రత వంటి అంశాల్లో సహకారానికి పెద్దపీట వేయాలని నిర్ణయించాం.

పరస్పర వాణిజ్య సామర్థ్యాన్ని సాధించేందుకు ఆసియాన్-భారత్ వర్తక ఒప్పందానికి సంబంధించిన సమీక్షను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం.

డిజిటల్ చెల్లింపుల కనెక్టివిటీ కోసం ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఒప్పందం కుదిరింది.

గ్రీన్ ఎకానమీ తో పాటు కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంపై దృష్టి పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం.

ఇంధనంఓడరేవుల అభివృద్ధిలో ఉన్న సామర్థ్యాలను పరస్పర ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటారు.

రెండు దేశాలకు చెందిన ప్రైవేటు రంగంచిన్నమధ్యతరహా పరిశ్రమలుస్టార్టప్ లను అనుసంధానం చేసే పనులు కూడా జరుగుతాయి.

మిత్రులారా,

వ్యవసాయంచేపల పెంపకం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు.

ఈ రంగాలు ప్రజల జీవనోపాధి, ఆహార భద్రతకు సంబంధించినవి.

ఈ రంగాల్లో జెర్మ్‌ప్లాజమ్ మార్పిడిఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించాలని నిర్ణయించాం.

మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికిప్రపంచ వారసత్వ ప్రదేశం "మీ సోన్" లో "బ్లాక్ ఎఫ్" దేవాలయాల పరిరక్షణకు భారతదేశం సహకరిస్తుంది.

 

బౌద్ధమతం అనేది మన ఉమ్మడి వారసత్వం అని మనందరికీ తెలుసుఇది రెండు దేశాల ప్రజలను ఆధ్యాత్మిక స్థాయిలో అనుసంధానించింది.

వియత్నాం ప్రజలను భారతదేశంలోని బౌద్ధ సర్క్యూట్ ని సందర్శించాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాము.

వియత్నాం యువత కూడా నలంద విశ్వవిద్యాలయం నుండి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను.

 

మిత్రులారా,

మా యాక్ట్ ఈస్ట్ విధానం, మా ఇండో-పసిఫిక్ విజన్‌లోవియత్నాం మా విలువైన భాగస్వామి.

ఇండో-పసిఫిక్ గురించి మా అభిప్రాయాలలో మంచి సమన్వయం ఉంది.

మేము అభివృద్ధికి మద్దతు ఇస్తున్నామువిస్తరణవాదానికి కాదు

 

స్వేచ్ఛాయుతబహిరంగనియమాల ఆధారితసుసంపన్నమైన ఇండో-పసిఫిక్ కోసం మా సహకారాన్ని కొనసాగిస్తాం.

సీడీఆర్ ఐలో చేరాలన్న వియత్నాం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

మిత్రులారా,

మరోసారినేను ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్ కు స్వాగతం పలుకుతున్నాను.

మీ ఈ పర్యటన మన సంబంధాలలో నూతన, సువర్ణ అధ్యాయాన్ని జోడిస్తుంది.

చాలా ధన్యవాదాలు.

***


(Release ID: 2040603) Visitor Counter : 63