యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన మనుబాకర్, సరబ్జోత్ సింగ్. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం

Posted On: 30 JUL 2024 4:10PM by PIB Hyderabad

భారత షూటర్లు మను భాకర్, సరబ్జోత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించడంతో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది. మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్ రౌండ్ లో ఈ జోడీ 13 షాట్ల తర్వాత 16-10 స్కోరుతో  కొరియన్ రిపబ్లిక్ పై విజయం సాధించారు.

ఫైనల్ రౌండ్ లో వారి అద్భుత ప్రదర్శన, వారి పేర్ల వెనకాల, భారత్ పతకాల పట్టికకు మరో ఘనతను జోడించడం ద్వారా పతకాల వేటకు తెర తీసింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో మనుభాకర్ కు ఇది రెండో కాంస్య పతకం కావడం విశేషం.

సరబ్జోత్ సింగ్ 2019 నుండి ‘ఖేలో ఇండియా’ అథ్లెట్ గా ఉండి 4 ‘ఖేలో ఇండియా గేమ్స్’ లో పాల్గొన్నాడు మరియు అతను ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ అథ్లెట్ కూడా. మనుభాకర్ కూడా ‘ఖేలో ఇండియా గేమ్స్’ మాజీ పోటీదారు, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అథ్లెట్.

క్వాలిఫికేషన్  రౌండ్:

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ క్వాలిఫికేషన్ రౌండ్ లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ లు తమ ఖచ్చితత్వాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి  సంయుక్తంగా 580 పాయింట్లు సాధించారు. ఈ ఆకట్టుకునే ప్రదర్శన వారిని టాప్ పోటీదారులలో ఒకటిగా నిలిపింది, కాంస్య పతక షూట్ ఆఫ్ లో వారికి స్థానం సంపాదించింది.

కీలక ప్రభుత్వ మద్దతు:

సరబ్జోత్ సింగ్

పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా సరబ్జోత్ సింగ్ కోసం భారత ప్రభుత్వం చేసిన కీలక చర్యలు:

 

*శిక్షణ మరియు పొటీకై మద్దతు: 2023 జనవరి 17 నుంచి ఫిబ్రవరి 18, 2023 వరకు శిక్షణ, అంతర్జాతీయ పోటీల్లో కోచ్ తో కలిసి పాల్గొనేందుకు సహాయం అందించారు.

*వ్యక్తిగత శిక్షకుడి మద్దతు: జూలై 10 నుంచి ఆగస్టు 1, 2024 వరకు చాటోరోక్స్ లో జరిగిన వోల్మెరెంజ్ ఓటీసీ, ప్యారిస్ ఓజీ 2024కు హాజరయ్యేందుకు తన వ్యక్తిగత శిక్షకుడు శ్రీ అభిషేక్ రాణా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం కేటాయించారు.

అందుకున్న ఆర్థిక సహాయం:

*టిఓపిఎస్ కింద: రూ.20,24,928

*శిక్షణ, పోటీల వార్షిక క్యాలెండర్ (ఏసీటీసీ) కింద: రూ.1,26,20,970

ప్రధాన విజయాలు:

*ఆసియా క్రీడలు (2022): టీమ్ ఈవెంట్లో స్వర్ణం, మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో రజతం.

*ఆసియా ఛాంపియన్షిప్, కొరియా (2023): 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం, తద్వారా ఒలింపిక్స్ 2024 కోటాలో భారత్ కు స్థానం.

*ప్రపంచ కప్, భోపాల్ (2023): వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం.

*ప్రపంచ కప్, బాకు (2023): మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో స్వర్ణ పతకం.

*జూనియర్ వరల్డ్ కప్, సుహల్ (2022): టీమ్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత, మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లలో రెండు రజత పతకాలు.

*జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్, లిమా (2021): టీమ్, మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు.

మను భాకర్

పారిస్ ఒలింపిక్స్ సందర్భంలో మను భాకర్ కోసం భారత ప్రభుత్వం చేసిన కీలక చర్యలు:

*మందుగుండు సామగ్రి మరియు ఆయుధ సర్వీసింగ్: మందుగుండు సామగ్రి మరియు ఆయుధ సర్వీసింగ్, పెల్లెట్ మరియు మందుగుండు సామగ్రి పరీక్ష మరియు బ్యారెల్ ఎంపిక కోసం సహాయం అందించారు.

*శిక్షణ మద్దతు: ఒలింపిక్స్ సన్నద్ధత కోసం లక్సెంబర్గ్ లో వ్యక్తిగత కోచ్ జస్పాల్ రాణాతో శిక్షణ తీసుకునేందుకు సహాయం అందించారు.

అందుకున్న ఆర్థిక సహాయం:

*టిఓపిఎస్ కింద: రూ.28,78,634/-

*ఏసీటీసీ కింద: రూ.1,35,36,155/-

ప్రధాన విజయాలు:

*ఆసియా క్రీడలు (2022) లో 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో బంగారు పతకం

*ప్రపంచ ఛాంపియన్షిప్, బాకు (2023) లో 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో బంగారు పతకం

*ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్, చాంగ్వాన్ (2023) లో పారిస్ గేమ్స్ 2024 కోసం కోటా స్థానం

*ప్రపంచ కప్, భోపాల్ (2023) లో 25 మీటర్ల పిస్టల్ లో కాంస్య పతకం

* ప్రపంచ ఛాంపియన్షిప్, కైరో (2022)లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం

*చెంగ్డూలోని ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు (వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్) (2021) లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత మరియు మహిళల టీమ్ ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు

***



(Release ID: 2039538) Visitor Counter : 27