హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆసియా విపత్తు సన్నద్ధత కేంద్రం(ఏడీపీసీ) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో, విపత్తు ప్రమాద తగ్గింపు(డిసాస్టర్ రిస్క్ రిడక్షన్-డీఆర్ఆర్) విషయంలో ప్రపంచ, ప్రాంతీయ నాయకత్వ పాత్రను పోషిస్తోన్న భారత్


డీఆర్‌ఆర్‌లో అనేక అంతర్జాతీయ కార్యక్రమాలు ప్రారంభించిన భారత్.. ముఖ్యంగా అంతర్జాతీయ విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ఏర్పాటు.

Posted On: 26 JUL 2024 3:10PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో విపత్తు ప్రమాద తగ్గింపు (డీఆర్ఆర్ ) విషయంలో భారతదేశం ప్ర పంచ , ప్రాంతీయ నాయకత్వ పాత్ర పోషిస్తోంది. ఈ దిశలో భారతదేశం అనేక అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రారంభించింది. అంతర్జాతీయ విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ఏర్పాటుచేయటం ఇందులో ముఖ్యమైనది.

2024-25 సంవత్సరానికి ఆసియా విపత్తు సన్నద్ధత కేంద్రం(ఏడీపీసీ) అధ్యక్ష బాధ్యతలను 25 జులై 2024 నాడు చైనా నుంచి భారత ప్రభుత్వ ప్రతినిధిగా, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) విభాగాధిపతి(హెచ్ఓడీ), సభ్యులు  శ్రీ రాజేంద్ర సింగ్ స్వీకరించారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో విపత్తు ప్రమాద తగ్గింపు, వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించడంలో సహకారం, అమలు కోసం స్వయంప్రతిపత్తి కలిగిన అంతర్జాతీయ సంస్థ ఈ ఏడీపీసీ. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, కంబోడియా, చైనా, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పైన్స్, శ్రీలంక, థాయిలాండ్ వంటి ఎనిమిది పొరుగు దేశాలు ఏడీపీసీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి.

థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో 2024 జూలై 25న జరిగిన ఏడీపీసీ 5వ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (బీవోటీ) సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది.

***


(Release ID: 2037865) Visitor Counter : 63