హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు విపత్తు ఉపశమన-సామర్థ్య వికాస ప్రాజెక్టులకు కేంద్ర హోమ్-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతనగల ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం


విపత్తు ప్రతిరోధక భార‌త్‌పై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దృక్కోణానికి
అనువుగా దేశంలో విపత్తుల సమర్థ నిర్వహణ దిశగా హోమ్ శాఖ
మంత్రి శ్రీ అమిత్ షా నేతృత్వాన పలు కార్యక్రమాల అమలు;

హైదరాబాద్.. ముంబై.. కోల్‌కతా.. బెంగళూరు.. అహ్మదాబాద్.. పుణె నగరాల్లో
రూ.2514.36కోట్ల విలువైన 6 పట్టణ వరద నిర్వహణ ప్రాజెక్టులకు హెచ్ఎల్‌సి ఆమోదం;

అస్సాం.. కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాల్లో రూ.810.64 కోట్లతో చేపట్టే మూడు ‘‘అగ్నిమాపక సర్వీసుల విస్తరణ-ఆధునికీకరణ’’ ప్రాజెక్టులకూ కమిటీ సమ్మతి;

హిమాచల్.. అరుణాచల్.. సిక్కిం.. ఉత్తరాఖండ్ రాష్ట్రాలో రూ.150 కోట్లతో చేపట్టే ‘జిఎల్ఒఎఫ్’ విప‌త్తు ఉప‌శ‌మ‌న‌ ప్రాజెక్ట్ ప్రతిపాదనకు హెచ్ఎల్‌సి ఆమోద ముద్ర;

అత్యంత విపత్తు ముప్పున్న 315 జిల్లాల్లో ‘యువ ఆపద మిత్ర పథకం’ (వైఎఎంఎస్) కింద రూ.470.50 కోట్లతో 1300 మందికి ‘బోధక ఆపద మిత్ర శిక్షకులుగా.. మరో 2.37 లక్షల మందికి కార్యకర్తలుగా శిక్షణనిచ్చే కార్యక్రమానికి హెచ్ఎల్‌సి ఆమోదం;

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘‘రాష్ట్ర విపత్తుల
ప్రతిస్పందన నిధి’’ (ఎస్‌డిఆర్ఎఫ్‌) కింద 14 రాష్ట్రాలకు రూ.6,348 కోట్లు.. ‘‘రాష

Posted On: 25 JUL 2024 8:13PM by PIB Hyderabad

   దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక విపత్తు ఉపశమన, సామర్థ్య వికాస ప్రాజెక్టులకు కేంద్ర హోమ్-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతనగల ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సి) ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక, వ్యవసాయ శాఖల మంత్రులు, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సభ్యులుగాగల ‘హెచ్‌ఎల్‌సి’ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మొత్తం తొమ్మిది ప్రాజెక్టులకు జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‌డిఎంఎఫ్‌), జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్ఎఫ్‌) నుంచి నిధులిచ్చే ప్రతిపాదనలను కమిటీ పరిశీలించింది. వీటిలో దేశంలోని 6 మహా  నగరాల్లో పట్టణ వరద నిర్వహణ ప్రాజెక్టులు, 4 పర్వత ప్రాంత రాష్ట్రాల్లో హిమానీనద విస్ఫోటన వరద (జిఎల్ఒఎఫ్) నిర్వహణ ప్రాజెక్టులు, 3 రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవలను బలోపేతం చేసే ప్రాజెక్టులు ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాల్లో ‘యువ ఆపద మిత్ర పథకం’ అమలు ప్రతిపాదనను కూడా కమిటీ పరిశీలించింది.

    విపత్తు ప్రతిరోధక భార‌తదేశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృక్కోణానికి అనువుగా దేశంలో విపత్తుల సమర్థ నిర్వహణ దిశగా హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నేతృత్వాన పలు కార్యక్రమాల అమలవుతున్నాయి. ఇందులో భాగంగా విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించే దిశగా విపత్తు ముప్పు తగ్గింపు వ్యవస్థల బలోపేతానికి అనేక చర్యలు చేపట్టారు.

   ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రూ.2,514.36 కోట్ల విలువైన 6 ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించింది. తదనుగుణంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో పట్టణ వరద నిర్వహణ ప్రాజెక్టులు చేపడతారు. కాగా, తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో రూ.561.29 కోట్లతో సమగ్ర వరద నిర్వహణ ప్రాజెక్టు చేపట్టే ప్రతిపాదనకు 2023 నవంబరు 27న ‘హెచ్‌ఎల్‌సి’ ఆమోదముద్ర వేసింది.

   అస్సాం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రూ.810.64 కోట్లతో చేపట్టే మూడు ‘‘అగ్నిమాపక సర్వీసుల విస్తరణ-ఆధునికీకరణ’’ ప్రాజెక్టులకూ కమిటీ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్ఎఫ్‌) నుంచి రూ.5,000 కోట్లు కేటాయించింది. తదనుగుణంగా రూ.1,691.43 కోట్ల అంచనా వ్యయంతో 11 రాష్ట్రాల నుంచి అందిన వివిధ ప్రాజెక్టులను ఇప్పటికే ఆమోదించింది.

   పర్వత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో రూ.150 కోట్లతో చేపట్టే హిమానీనద విస్ఫోటన వరద (జిఎల్ఒఎఫ్) నిర్వహణ ప్రాజెక్టులకు కమిటీ ఆమోదం ప్రకటించింది. తద్వారా ‘జిఎల్ఒఎఫ్’ విపత్తు సమయంలో తక్షణ ఉపశమన చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది.

   దేశంలో అత్యంత విపత్తు ముప్పున్న 315 జిల్లాల్లో రూ.470.50 కోట్ల మేర ‘ఎన్‌డిఆర్ఎఫ్‌’ నిధులతో ‘యువ ఆపద మిత్ర పథకం’ (వైఎఎంఎస్) అమలుకు కమిటీ ఆమోదం తెలిపింది. దీనికింద 1300 మందికి ‘బోధక ఆపద మిత్ర శిక్షకులు’గా, మరో 2.37 లక్షల మందికి స్వచ్ఛంద కార్యకర్తలుగా శిక్షణ ఇస్తారు. విపత్తుల సంసిద్ధత, ప్రతిస్పందన లక్ష్యంగా ఈ స్వచ్ఛంద కార్యకర్తలను ప్రధానంగా ‘‘ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్‌, ఎన్‌వైకెఎస్‌, భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌’’ నుంచి ఎంపిక చేస్తారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సమాజాన్ని ప్రథమ ప్రతిస్పందనదారుగా రూపొందించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా స్వచ్ఛంగా కార్యకర్తల ఎంపిక ఉంటుంది. కాగా, ప్రభుత్వం ‘ఆపద మిత్ర’ పథకం కింద ఇప్పటికే అత్యంత విపత్తు ముప్పుగల 350 జిల్లాల్లో లక్షమంది సామాజిక స్వచ్ఛంద కార్యకర్తలకు నైపుణ్య శిక్షణ ఇప్పించింది. ఆయా ప్రాంతాల్లో విపత్తులు సంభవించినపుడు ఇలా సుశిక్షితులైన ‘ఆపద మిత్ర, ఆపద సఖి’ కార్యకర్తలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో స్థానిక అధికార యంత్రాంగానికి తమవంతు సహకారం అందిస్తారు.

   ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘‘రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధి’’ (ఎస్‌డిఆర్ఎఫ్‌) కింద 14 రాష్ట్రాలకు రూ.6,348 కోట్లు, ‘‘రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధి’’ (ఎస్‌డిఎంఎఫ్‌) కింద 6 రాష్ట్రాలకు రూ.672 కోట్లు వంతున నిధులు విడుదలయ్యాయి. అలాగే మరో 10 రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) కింద రూ.4265 కోట్లు విడుదలయ్యాయి.

***


(Release ID: 2037389) Visitor Counter : 64