ఆర్థిక మంత్రిత్వ శాఖ

పన్నును సరళీకృతం చేయడం, పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడం – ప్రభుత్వ స్థిరమైన ప్రయత్నం: కేంద్ర ఆర్థిక మంత్రి


ఆరు నెలల్లో ఆదాయపు పన్ను చట్టం, 1961 సమగ్ర సమీక్ష

జిఎస్టీ, కస్టమ్స్, ఆదాయపు పన్ను పరిధిలోని అన్ని సేవలు డిజిటలైజ్ , రెండేళ్లలో
కాగిత రహితం అవుతుందన్న ఆర్థిక మంత్రి

ఆదాయపు పన్ను వివాదంపై పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను
పరిష్కరించడానికి వివాద్ సే విశ్వాస్ పథకం, 2024

Posted On: 23 JUL 2024 1:09PM by PIB Hyderabad

తొమ్మిది గుర్తించిన ప్రాధాన్యతలపై దృష్టి సారించి వికసిత భారత్ లక్ష్యం వైపు ప్రయాణాన్ని ఈ బడ్జెట్ వేగవంతం చేస్తుందని పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024-2025ను సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. పన్నులను సరళీకృతం చేయడం, పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడం, వ్యాజ్యాలను తగ్గించడం, ప్రభుత్వం స్థిరమైన ప్రయత్నం అని చెప్పారు. ఈ చర్యను పన్ను చెల్లింపుదారులు ప్రశంసిస్తున్నారని ఆమె అన్నారు. 58 శాతం కార్పొరేట్ పన్ను 2022-23 ఆర్థిక సంవత్సరంలో సరళీకృత పన్ను విధానం నుండి వచ్చింది.  అందుబాటులో ఉన్న డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండు వంతుల మంది కొత్తగా వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని వినియోగించారని ఆమె తెలిపారు. 

పన్నులను సరళీకృతం చేసే అజెండాను అనుసరిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో అనేక చర్యలను వివరించారు. ఆదాయపు పన్ను చట్టం, 1961 సంక్షిప్తంగా, స్పష్టంగా ఉండేలా ఆరు నెలల్లో సమగ్ర సమీక్షను ప్రకటిస్తూ, వివాదాలు, వ్యాజ్యాలను తగ్గించే పన్ను చెల్లింపుదారులకు ఇది పన్ను ఖచ్చితత్వాన్ని అందిస్తుంది అని నిర్మలా సీతారామన్ అన్నారు.

పన్ను-అనిశ్చితి, వివాదాలను తగ్గించడానికి పునఃపరిశీలన చేసేలా సమగ్ర సరళీకరణ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను వివరిస్తూ, తప్పించుకున్న ఆదాయం రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే, అసెస్‌మెంట్ సంవత్సరం చివర, మూడు సంవత్సరాలకు మించి, గరిష్టంగా ఐదేళ్ల వ్యవధి వరకు తిరిగి తెరవవచ్చు. సెర్చ్ కేసులలో, ప్రస్తుత కాల పరిమితి పదేళ్లకు బదులు సెర్చ్ చేసిన సంవత్సరానికి ముందు ఆరేళ్ల కాల పరిమితిని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఆర్థిక బిల్లులో ఛారిటీలు, టీడీఎస్ కోసం పన్ను సరళీకరణ ప్రక్రియను ప్రారంభించడంతో పాటు, స్వచ్ఛంద సంస్థలకు రెండు పన్ను మినహాయింపు విధానాలను ఒకటిగా విలీనం చేయాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అనేక చెల్లింపులపై 5 శాతం టీడీఎస్ రేటు-  2 శాతం టీడీఎస్ రేటులో విలీనం చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లేదా యూటీఐ ద్వారా యూనిట్లను తిరిగి కొనుగోలు చేయడంపై 20 శాతం టీడీఎస్ ఉపహరిస్తారు. . ఈ-కామర్స్ ఆపరేటర్లపై టీడీఎస్ రేటును ఒకటి నుంచి 0.1 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. అంతేగాక, జీతంలో కోత పెట్టె టీడీఎస్ లో టీసీఎస్ క్రెడిట్ ఇవ్వాలని ప్రతిపాదించారు.

జిఎస్టీ కింద అన్ని ప్రధాన పన్ను చెల్లింపుదారుల సేవలను, కస్టమ్స్, ఆదాయపు పన్ను పరిధిలోని చాలా సేవలను డిజిటలైజేషన్‌ చేసే విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పీలేట్ ఆర్డర్‌లను సరిదిద్దడం, ఆర్డర్ ఇవ్వడంతో సహా మిగిలిన అన్ని సేవలను కూడా డిజిటలైజ్ చేస్తామని,  వచ్చే రెండేళ్లలో ఇది కాగిత రహితం అవుతుందని ఆమె తన బడ్జెట్ లో వెల్లడించారు. 

వివిధ అప్పీలేట్ ఫోరలలో కనిపించే మంచి ఫలితాలను గుర్తించిన కేంద్ర ఆర్థిక మంత్రి, వ్యాజ్యం, అప్పీళ్లపై ప్రభుత్వం అధికంగా దృష్టి సారించడం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని కొనసాగిస్తూ, అప్పీల్‌లో పెండింగ్‌లో ఉన్న కొన్ని ఆదాయపు పన్ను వివాదాల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాస్ పథకం, 2024 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అంతేకాకుండా, పన్ను ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీంకోర్టులలో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, సేవా పన్నులకు సంబంధించిన అప్పీళ్లను దాఖలు చేయడానికి ద్రవ్య పరిమితిని వరుసగా రూ. 60 లక్షలు, రూ.2 కోట్లు, రూ.5 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. వ్యాజ్యాన్ని తగ్గించడంపై దృష్టి సారించడం, అంతర్జాతీయ పన్నుల విషయంలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం, బదిలీ ధరల అంచనా విధానాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు పన్ను చెల్లింపుదారులు చెల్లింపులపై ఉన్న నియమాల పరిధిని విస్తరించడం జరుగుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.

టాక్స్ బేస్ ని మరింత లోతుగా మార్పులు చేస్తూ  రెండు కీలక చర్యలను ప్రకటించారు. మొదటిది, సెక్యూరిటీల ఫ్యూచర్స్, ఆప్షన్‌లపై భద్రతా లావాదేవీల పన్నును వరుసగా 0.02 శాతం, 0.1 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. రెండవది, షేర్ల బై బ్యాక్‌పై వచ్చే ఆదాయంపై పన్ను విధించడాన్ని ఈక్విటీ కొలమానంగా ప్రతిపాదించామని మంత్రి తెలిపారు.

ఈ ప్రతిపాదనల అంతరార్థాన్ని వివరిస్తూ, శ్రీమతి సీతారామన్, రూ.29,000 కోట్ల ప్రత్యక్ష పన్నులు, రూ.8,000 కోట్ల పరోక్ష పన్నులు కలిపి దాదాపు రూ.37,000 కోట్ల ఆదాయం - వదులుకోవలసి వస్తుందని, దాదాపు రూ. 30,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమీకరిస్తామని పేర్కొన్నారు. ఈ విధంగా, మొత్తం ఆదాయం సంవత్సరానికి రూ.7,000 కోట్లు వదులుకోవాల్సి ఉంటుందని ఆమె వివరించారు.

 

***



(Release ID: 2037058) Visitor Counter : 38