ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 6.5-7 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా

Posted On: 22 JUL 2024 3:28PM by PIB Hyderabad

2024 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 8.2 శాతం వృద్ధి చెందింది. నాలుగు త్రైమాసికాల్లోని మూడింటిలో 8 శాతం కంటే ఎక్కువ

చాకచక్యమైన పరిపాలనా, ద్రవ్య విధానాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతానికి తగ్గింది.

8.2 శాతం ఆర్థిక వృద్ధికి మద్దతుగా 9.5 శాతం పారిశ్రామిక వృద్ధి రేటు 

29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ద్రవ్యోల్బణ రేటు 6 శాతం కంటే తక్కువ

భారత బ్యాంకింగ్, ఆర్థిక రంగం అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది.  స్థిరమైన పాలసీ రేటును నిర్వహించిన ఆర్ బి ఐ

బ్యాంకు రుణాల్లో రెండంకెల, విస్తృత ఆధారిత వృద్ధి

వ్యవసాయం , అనుబంధ రంగాల కార్యకలాపాల రుణాలలో రెండంకెల వృద్ధి 

2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పడిపోతుందని ఆర్ బి ఐ అంచనా

2023లో 120 బిలియన్ డాలర్లతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రెమిటెన్స్ గ్రహీత దేశంగా భారత్

అమృత్ కాల్ లో ఆరు కీలక రంగాలు - ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం; ఎంఎస్ ఎంఇ ల విస్తరణ; వృద్ధి  చోదకంగా వ్యవసాయం,

హరిత మార్పు (గ్రీన్ ట్రాన్సిషన్)  కు నిధులు సమకూర్చడం, విద్య-ఉపాధి అంతరాలను పూడ్చడం, రాష్ట్రాల సామర్థ్య పెంపు

వాతావరణ చర్య, ఇంధన సామర్థ్యంలో భారత్ పురోగతి ; శిలాజేతర వనరుల నుంచి 45.4 శాతం స్థాపిత విద్యుదుత్పత్తి

గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నుండి ఆర్థిక వృద్ధిని వేరు చేసిన భారత్; 2005-19 మధ్య  జి డి పి 7%,  ఉద్గారాలు 4% వద్ద ఉన్నాయి

క్షీణించిన జిని ఇండెక్స్; సామాజిక రంగ చొరవలతో అసమానతల తగ్గింపు 

34.7 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డుల సృష్టి; 7. 37 కోట్ల ఆస్పత్రి అడ్మిషన్లు

ఆయుష్మాన్ భారత్ పరిధి లోకి 22 మానసిక రుగ్మతలు

పరిశోధన - అభివృద్ధిలో వేగవంతమైన పురోగతి;  2024 ఆర్థిక సంవత్సరంలో లక్ష పేటెంట్లు మంజూరు; 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25,000 తక్కువ

2019 ఆర్థిక సంవత్సరంలో 61.1 లక్షలుగా ఉన్న ఇ పి ఎఫ్ ఒ నికర పేరోల్ చేర్పులు 2024 ఆర్థిక సంవత్సరంలో 131.5 లక్షలకు రెట్టింపు

2029-30 నాటికి గిగ్ వర్క్ ఫోర్స్ 2.35 కోట్లకు పెంపు

గత 5 సంవత్సరాలలో  వ్యవసాయం, అనుబంధ రంగాల సగటు వార్షిక వృద్ధి రేటు 4.18 శాతం 

వ్యవసాయ ఆదాయాలను మెరుగుపరచడానికి బలమైన వృద్ధి కేంద్రాలు , వనరులుగా అభివృద్ధి చెందుతున్న అనుబంధ వ్యవసాయ రంగాలు

వ్యవసాయ పరిశోధనలో పెట్టుబడులతో ఆహార భద్రతకు దోహదం; ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి, రూ.13.85 చెల్లింపు

50 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్ గా భారత ఫార్మా మార్కెట్ 

'ఆత్మనిర్భర్ భారత్' సాధనలో కీలకమైన పీఎల్ఐ పథకాలు రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.

2022లో ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో భారత్ సేవల ఎగుమతులు 4.4 శాతం

2023లో డిజిటల్ డెలివరీ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా 6 శాతం . భారత్ లో 1,580 గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు 

2023లో భారత్ కు  92 లక్షల మంది విదేశీ పర్యాటకుల రాక

2030 నాటికి 350 బిలియన్ డాలర్లను దాటనున్న భారత ఇ-కామర్స్ పరిశ్రమ

జాతీయ రహదారి నిర్మాణం సగటు వేగం 2014 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 11.7 కి.మీ నుండి 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రోజుకు 34 కి.మీ.

గత 5 సంవత్సరాలలో 77 శాతం పెరిగిన రైల్వేస్ కాపెక్స్ 

21 విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్ భవనాల ప్రారంభం 

బుద్ధిపూర్వక వినియోగాన్ని ప్రోత్సహించే మానవ-ప్రకృతి సామరస్యంపై దృష్టి పెట్టిన మిషన్ లైఫ్ 

ఆర్థిక సర్వే 2023-24 ముఖ్యాంశాలు

2023-24 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.           

చాప్టర్ 1: ఆర్థిక వ్యవస్థ స్థితి - వెళ్ళే కొద్దీ స్థిరంగా 

  • వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 6.5-7 శాతంగా ఉంటుందని, రిస్క్ లు సమానంగా సమతుల్యంగా ఉంటాయని, మార్కెట్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

  • భారత ఆర్థిక వ్యవస్థ అనేక బాహ్య సవాళ్లు ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో వేగాన్ని 2024 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించింది.

  • స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంపై దృష్టి సారించడం వల్ల బాహ్య సవాళ్లు భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావాన్ని చూపాయి.

  • 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాస్తవ జిడిపి 8.2 శాతం పెరిగింది, ఇది 2024 ఆర్థిక సంవత్సరం నాలుగు త్రైమాసికాలలోని మూడింటిలో 8 శాతం మార్కును దాటింది.

  • సరఫరా వైపు, స్థూల విలువ జోడింపు (జివిఎ) 2024 ఆర్థిక సంవత్సరంలో (2011-12 ధరల వద్ద) 7.2 శాతం పెరిగింది. స్థిర ధరల వద్ద నికర పన్నులు 2024 ఆర్థిక సంవత్సరంలో 19.1 శాతం పెరిగాయి.

  • పరిపాలనా, ద్రవ్య విధానాలను చాకచక్యంగా నిర్వహించడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతానికి తగ్గింది.

  • కరెంట్ ఖాతా లోటు (సిఎడి) 2024 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో 0.7 శాతంగా ఉంది, ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో 2.0 శాతం లోటు నుండి మెరుగుపడింది.

  • మహమ్మారి తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కోలుకొని క్రమపద్ధతిలో విస్తరించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జిడిపి 2020 ఆర్థిక సంవత్సరంలో దాని స్థాయి కంటే 20 శాతం ఎక్కువ, ఇది చాలా తక్కువ ప్రధాన ఆర్థిక వ్యవస్థలు మాత్రమే సాధించాయి. 

  • వసూలైన పన్నులో 55% ప్రత్యక్ష పన్నుల ద్వారా, మిగిలిన 45% పరోక్ష పన్నుల ద్వారా సమకూరింది.

  • ప్రభుత్వం 81.4 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించగలిగింది. మూలధన వ్యయానికి కేటాయించిన మొత్తం వ్యయం క్రమంగా పెరిగింది.

చాప్టర్ 2: ద్రవ్య నిర్వహణ , ఆర్థిక మధ్యవర్తిత్వం- స్థిరత్వం అనేది ముఖ్యమన మాట 

2024 ఆర్థిక సంవత్సరంలో భారత బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు అద్భుతమైన పనితీరును కనబరిచాయి.

  • మొత్తం ద్రవ్యోల్బణ రేటు నియంత్రణలో ఉండటంతో ఆర్ బి ఐ  ఏడాది పొడవునా స్థిరమైన పాలసీ రేటును కొనసాగించింది.

  • 2024 ఆర్థిక సంవత్సరంలో పాలసీ రెపో రేటును 6.5 శాతంగా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి ) యథాతథ స్థితిని కొనసాగించింది. వృద్ధికి ఊతమిస్తూనే ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా తయారైంది.

  • షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్ సి బి లు) రుణ పంపిణీ 2024 మార్చి చివరి నాటికి 20.2 శాతం వృద్ధితో రూ .164.3 లక్షల కోట్లకు చేరుకుంది.

  • హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో హెచ్ డి ఎఫ్ సి విలీనం ప్రభావాన్ని మినహాయించి బ్రాడ్ మనీ (ఎం 3) వృద్ధి 2024 మార్చి 22 నాటికి 11.2 శాతం(వైఒవై) గా ఉంది. ఏడాది క్రితం ఇది 9 శాతం మాత్రమే. 

  • బ్యాంకు రుణాలలో రెండు అంకెల , విస్తృత ఆధారిత వృద్ధి; బహుళ సంవత్సరాల కనిష్ఠ స్థాయికి స్థూల, నికర నిరర్థక ఆస్తులు; బ్యాంకు ఆస్తుల నాణ్యతలో మెరుగుదల ఆరోగ్యకరమైన, స్థిరమైన బ్యాంకింగ్ రంగం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.

  • ప్రధానంగా సేవలకు, , వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వడం ద్వారా రుణ వృద్ధి బలంగా ఉంది.

  • 2024 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు రెండంకెల వృద్ధిని సాధించాయి.

  • పారిశ్రామిక రుణ వృద్ధి ఏడాది క్రితం 5.2 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది.

  • ట్విన్ బ్యాలెన్స్ షీట్ సమస్యకు ఐబిసి ని సమర్థవంతమైన పరిష్కారంగా గుర్తించారు. గత ఎనిమిదేళ్లలో, మార్చి 2024 నాటికి రూ 13.9 లక్షల కోట్ల తో ముడిపడిన 31,394 కార్పొరేట్ రుణగ్రహీతల  బ్యాలెన్స్ షీట్ ను పరిష్కరించారు.

  • ప్రాథమిక మూలధన మార్కెట్లు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటును సులభతరం చేశాయి. (2023 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్, ప్రభుత్వ కార్పొరేట్ల స్థూల స్థిర మూలధన నిర్మాణంలో సుమారు 29 శాతం).

  • భారత స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పెరిగింది, మార్కెట్ క్యాపిటలైజేషన్ , జిడిపి నిష్పత్తి ప్రపంచంలో ఐదవ అతిపెద్దది.

  • ఆర్థిక సమ్మిళితం ఒక లక్ష్యం మాత్రమే కాదు, సుస్థిర ఆర్థిక వృద్ధికి, అసమానతల తగ్గింపుకు, పేదరిక నిర్మూలనకు దోహదపడుతుంది. తదుపరి అతిపెద్ద సవాలు డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ (డిఎఫ్ ఐ).

  • రుణాలకు బ్యాంకింగ్ మద్దతు క్రమంగా తగ్గి క్యాపిటల్ మార్కెట్ల పాత్ర పెరుగుతోంది. భారత ఆర్థిక రంగం కీలకమైన మార్పుకు లోనవుతున్నందున, అది ఎదురయ్యే అవకాశం ఉన్న బలహీనతలను ఎదుర్కోవలసి ఉంటుంది. 

  • రాబోయే దశాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీమా మార్కెట్లలో ఒకటిగా భారత్ అవతరించనుంది. 

  • చైనా తర్వాత భారత మైక్రోఫైనాన్స్ రంగం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రంగంగా అవతరించింది. 

చాప్టర్ 3: అదుపులో ధరలు, ద్రవ్యోల్బణం 

  • కేంద్ర ప్రభుత్వ సమయానుకూల విధాన జోక్యాలు , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధరల స్థిరత్వ చర్యలు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.4 శాతం వద్ద ఉంచడానికి సహాయపడ్డాయి.

  • ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో తక్కువగానే ఉంది. 

  • ఆగస్టు 2023 లో, దేశీయ ఎల్పిజి సిలిండర్ల ధర భారతదేశంలోని అన్ని మార్కెట్లలో సిలిండర్ కు రూ .200 తగ్గింది. అప్పటి నుండి, ఎల్పిజి ద్రవ్యోల్బణం తగ్గుదల జోన్ లో ఉంది.

  • పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం లీటరుకు రూ.2 తగ్గించింది. ఫలితంగా వాహనాల్లో వినియోగించే పెట్రోల్, డీజిల్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా తగ్గుదల జోన్ కు చేరింది.

  • భారత్ విధానాలు అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ ధరల స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. 

  • 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన సేవల ద్రవ్యోల్బణం తొమ్మిదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో ప్రధాన వస్తువుల ద్రవ్యోల్బణం కూడా నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.

  • 2024 ఆర్థిక సంవత్సరంలో, పరిశ్రమలకు కీలకమైన ముడి వస్తు సామగ్రి (ఇన్పుట్ మెటీరియల్ )మెరుగైన సరఫరా కారణంగా ముఖ్యమైన వినియోగ వస్తువుల (కోర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్) ద్రవ్యోల్బణం తగ్గింది.

  • ప్రతికూల వాతావరణ సంఘటనలు, క్షీణించిన జలాశయాలు , పంట నష్టం కారణంగా వ్యవసాయ రంగం సవాళ్లను ఎదుర్కొంది, ఇది వ్యవసాయ ఉత్పత్తి , ఆహార ధరలను ప్రభావితం చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి పెరిగింది.

  • డైనమిక్ స్టాక్ మేనేజ్ మెంట్, ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు, నిత్యావసర ఆహార పదార్థాలను సబ్సిడీపై అందించడం సహా ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య విధాన చర్యలు, పరిపాలనా చర్యలు ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయ పడుతున్నాయి. 

  • 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6 శాతం కంటే తక్కువగా నమోదైంది.

  • అంతేకాకుండా, అధిక మొత్తం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలు గ్రామీణ-పట్టణ ద్రవ్యోల్బణ అంతరాన్ని కలిగి ఉంటాయి, గ్రామీణ ద్రవ్యోల్బణం పట్టణ ద్రవ్యోల్బణాన్ని మించిపోతుంది.

  • సాధారణ వర్షపాతం, బాహ్య లేదా విధానపరమైన విఘాతాలు ఉండవనే ఆశాభావంతో 2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి , 2026 లో లో 4.1 శాతానికి తగ్గుతుందని ఆర్ బి ఐ అంచనా వేసింది.

  • భారత్ లో ద్రవ్యోల్బణం 2024లో 4.6 శాతం, 2025లో 4.2 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 

చాప్టర్ 4 : విదేశాంగ రంగం - సమృద్ధి మధ్య స్థిరత్వం

కొనసాగుతున్న భౌగోళిక ప్రతికూలతల మధ్య, ద్రవ్యోల్బణం మధ్య భారత విదేశీ రంగం బలంగా ఉంది.

  • ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో 139 దేశాల్లో 2018లో 44వ స్థానంలో ఉన్న భారత్ ర్యాంకు 2023 నాటికి 38వ స్థానానికి ఎగబాకింది.

  • సరుకుల దిగుమతులు మందగించడం, సేవల ఎగుమతులు పెరగడం వల్ల భారత్ కరెంట్ ఖాతా లోటు 2024 ఆర్థిక సంవత్సరంలో 0.7 శాతానికి తగ్గింది.

  • వస్తువులు, సేవల ప్రపంచ ఎగుమతుల్లో భారత్ మార్కెట్ వాటాను పొందుతోంది. ప్రపంచ వస్తువుల ఎగుమతుల్లో భారత్ వాటా 2016-2020 ఆర్థిక సంవత్సరంలో సగటున 1.7 శాతం ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతంగా ఉంది.

  • 2024 ఆర్థిక సంవత్సరంలో భారత సేవల ఎగుమతులు 4.9 శాతం పెరిగి 341.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఐటి /సాఫ్ట్‌వేర్ సేవలు , 'ఇతర' వ్యాపార సేవల ద్వారా వృద్ధి ఎక్కువగా జరిగింది.

  • 2023 నాటికి చెలింపులు 120 బిలియన్ డాలర్ల మైలురాయికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్ గ్రహీతల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.

  • భారత విదేశీ రుణం కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా ఉంది. 2024 మార్చి చివరి నాటికి జిడిపికి విదేశీ రుణం నిష్పత్తి 18.7 శాతంగా ఉంది.

చాప్టర్ 5: మీడియం టర్మ్ అవుట్ లుక్ - నవ భారత దేశం కోసం అభివృద్ధి వ్యూహం

 

  • స్వల్ప, మధ్యకాలికంగా పాలసీ దృష్టి సారించిన  కీలక రంగాలు - ఉద్యోగం ,  నైపుణ్యాల కల్పన, వ్యవసాయ రంగం పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం, ఎంఎస్ఎంఇ అడ్డంకులను పరిష్కరించడం, భారతదేశ హరిత మార్పు ను నిర్వహించడం, చైనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడం, కార్పొరేట్ బాండ్ మార్కెట్ ను బలోపేతం  చేయడం, అసమానతలను ఎదుర్కోవడం,  మన యువ జనాభా ఆరోగ్య నాణ్యతను మెరుగుపరచడం.

  • ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, ఎంఎస్ఎంఇ ల విస్తరణ, వృద్ధి చోచదకం గా వ్యవసాయం, హరిత పరివర్తనకు నిధులు సమకూర్చడం, విద్య-ఉపాధి అంతరాన్ని పూడ్చడం, రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంపొందించడం అనే ఆరు కీలక రంగాలపై అమృత్ కాల్ వృద్ధి వ్యూహం ఆధారపడి ఉంది.

  • భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి పైగా వృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం మధ్య త్రైపాక్షిక ఒప్పందం అవసరం.

చాప్టర్ 6: వాతావరణ మార్పు , ఇంధన పరివర్తన: ట్రేడ్-ఆఫ్‌లతో వ్యవహరించడం

  • నిబద్ధతతో కూడిన వాతావరణ చర్యలను సాధించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్  నివేదిక గుర్తించింది, 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వార్మింగ్ కు అనుగుణంగా జి 20 దేశం ఇది మాత్రమే అని ప్రముఖంగా పేర్కొంది. 

  • పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా వాతావరణ చర్యలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది.

  • 31 మే 2024 నాటికి, స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో శిలాజేతర వనరుల వాటా 45.4 శాతానికి చేరుకుంది.

  • అంతేకాకుండా, దేశం తన జిడిపి ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయిల నుండి 2019 లో 33 శాతం తగ్గించింది.

  • 2005-2019 మధ్య భారత జీడీపీ 7 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సి ఎ జిఆర్)తో వృద్ధి చెందగా, ఉద్గారాలు 4 శాతం సి ఎ జి ఆర్ తో పెరిగాయి.

  • కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ తో సహా అనేక స్వచ్ఛమైన బొగ్గు కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది.

  • మొత్తం వార్షిక ఇంధన పొదుపు 51 మిలియన్ టన్నుల చమురుతో సమానం అంటే మొత్తం వార్షిక పొదుపు వ్యయం రూ .1,94,320 కోట్లు , ఉద్గారాలు 306 మిలియన్ టన్నులు తగ్గుతాయి.

  • పునరుత్పాదక ఇంధనం,  స్వచ్ఛమైన ఇంధనాలను విస్తరించడం వల్ల భూమి,  నీటికి డిమాండ్ పెరుగుతుంది.

  • 2023 జనవరి-ఫిబ్రవరిలో రూ.16,000 కోట్లు, 2023 అక్టోబర్-డిసెంబర్ లో రూ.20,000 కోట్ల సావరిన్ గ్రీన్ బాండ్లను ప్రభుత్వం జారీ చేసింది.

చాప్టర్ 7: సామాజిక రంగం - సాధికారత కల్పించే ప్రయోజనాలు

  • కొత్త సంక్షేమ విధానం ఖర్చు చేసే రూపాయి ప్రభావాన్ని పెంచడంపై దృష్టి పెడుతుంది. సంక్షేమం కోసం వెచ్చించే ప్రతి రూపాయికి ఆరోగ్యం, విద్య, పాలన డిజిటైజేషన్ ఒక గుణక శక్తిగా మారింది.

  • 2018 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం మధ్య నామమాత్రపు జీడీపీ 9.5 శాతం సి ఎ జి ఆర్ వృద్ధి చెందగా, సంక్షేమ వ్యయం 12.8 శాతం సి ఎ జి ఆర్ తో  వృద్ధి చెందింది.

  • అసమానతల సూచిక అయిన జిని ఇండెక్స్  గ్రామీణ రంగంలో 0.283 నుంచి 0.266కు, పట్టణ రంగం లో 0.363 నుంచి 0.314కు తగ్గింది.

  • 34.7 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డుల ను సృష్టించారు. ఈ పథకం 7.37 కోట్ల ఆసుపత్రి ప్రవేశాలను కవర్ చేసింది.

  • మానసిక ఆరోగ్యాన్ని నిర్ధారించే సవాలు అంతర్గతంగా , ఆర్థికంగా విలువైనది. ఆయుష్మాన్ భారత్ - పి ఎం జె ఎం వై  హెల్త్ ఇన్సూరెన్స్ కింద 22 మానసిక రుగ్మతలు కవర్ అవుతాయి.

  • బాల్య విద్య కోసం 'పోషణ్ భీ పధాయ్ భీ' కార్యక్రమం అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద, సార్వత్రిక, అధిక-నాణ్యత గల ప్రీస్కూల్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

  • విద్యాంజలి చొరవ 1.44 కోట్లకు పైగా విద్యార్థుల విద్యా అనుభవాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.

  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి బడుగు బలహీన వర్గాలే ఉన్నత విద్యలో నమోదు పెరగడానికి కారణమని, అన్ని విభాగాల్లో మహిళల నమోదు వేగంగా పెరుగుతోందని, 2015 ఆర్థిక సంవత్సరం నుంచి 31.6 శాతం పెరిగిందని సర్వే తెలిపింది.

  • 2020 ఆర్థిక సంవత్సరంలో 25,000 కంటే తక్కువ పేటెంట్ గ్రాంట్లతో పోలిస్తే, 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్ష పేటెంట్లు మంజూరు చేయడంతో భారతదేశం పరిశోధన - అభివృద్ధిలో వేగంగా పురోగతి సాధిస్తోంది.

  • 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.3.10 లక్షల కోట్లు కేటాయించింది. 2014 ఆర్థిక సంవత్సరం(బిఇ)తో పోలిస్తే ఇది 218.8 శాతం అధికం.

  • పీఎం-ఆవాస్-గ్రామీణ్ కింద గత తొమ్మిదేళ్లలో (2024 జూలై 10 నాటికి) పేదల కోసం 2.63 కోట్ల ఇళ్లను నిర్మించారు.

  • 2014-15 నుంచి (2024 జూలై 10 నాటికి) గ్రామ సడక్ యోజన కింద 15.14 లక్షల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది.

చాప్టర్ 8: ఉపాధి, నైపుణ్యాభివృద్ధి: నాణ్యత దిశగా 

గత ఆరేళ్లలో భారత కార్మిక మార్కెట్ సూచికలు మెరుగుపడ్డాయి, నిరుద్యోగ రేటు 2022-23 లో 3.2 శాతానికి తగ్గింది.

  • 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 15 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రజల త్రైమాసిక పట్టణ నిరుద్యోగ రేటు 6.7 శాతానికి తగ్గింది.

  • పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం 45 శాతం మంది కార్మికులు వ్యవసాయంలో, 11.4 శాతం మంది తయారీ రంగంలో, 28.9 శాతం మంది సేవల్లో, 13.0 శాతం మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు.

  • పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం, యువత (వయస్సు 15-29 సంవత్సరాలు) నిరుద్యోగ రేటు 2017-18 లో 17.8 శాతం నుండి 2022-23 లో 10 శాతానికి తగ్గింది.

  • ఇ పి ఎఫ్ ఒ  పేరోల్ లోని కొత్త చందాదారుల్లో మూడింట రెండొంతుల మంది 18-28 ఏళ్ల గ్రూప్ కు చెందినవారే.

  • లింగ కోణంలో చూస్తే మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎఫ్ఎల్ఎఫ్ పిఆర్) ఆరేళ్లుగా పెరుగుతోంది.

  • ఎఎస్ఐ 2021-22 ప్రకారం, వ్యవస్థీకృత తయారీ రంగంలో ఉపాధి మహమ్మారికి ముందు స్థాయికి చేరుకుంది, ప్రతి కర్మాగారం లో ఉపాధి మహమ్మారికి ముందు పెరుగుదలను కొనసాగిస్తోంది.

  • 2015-22 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కార్మికుడి వేతనాలు 6.9 శాతం సీఏజీఆర్, పట్టణ ప్రాంతాల్లో 6.1 శాతం సీఏజీఆర్ పెరిగాయి.

  • 100 మంది కంటే ఎక్కువ మంది కార్మికులను నియమించే కర్మాగారాల సంఖ్య 2018 ఆర్థిక సంవత్సరం నుండి 2022 ఆర్థిక సంవత్సరం వరకు 11.8 శాతం వృద్ధిని సాధించింది.

  • చిన్న కర్మాగారాల కంటే పెద్ద కర్మాగారాల్లో (100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న) ఉపాధి పెరుగుతోంది, ఇది తయారీ యూనిట్ల పెరుగుదలను సూచిస్తుంది.

  • ఇ పి ఎఫ్ ఒ లో  వార్షిక నికర పేరోల్ చేర్పులు 2019 ఆర్థిక సంవత్సరంలో 61.1 లక్షల నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో 131.5 లక్షలకు రెట్టింపు అయ్యాయి.

  • 2015 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం మధ్య ఇ పి ఎఫ్ ఒ సభ్యత్వం  8.4 శాతం పెరిగింది.

  • పారిశ్రామిక రోబోలు కార్మికుల మాదిరి చురుకుగా లేదా ఖర్చుతో కూడుకున్నవి కానందున తయారీ రంగం కృత్రిమ మేధస్సుకు తక్కువ బహిర్గతం అవుతుంది.

  • గిగ్ వర్క్ ఫోర్స్ 2029-30 నాటికి 2.35 కోట్లకు పెరుగుతుందని అంచనా.

  • పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది.

  • 2022లో దేశంలో 50.7 కోట్ల మంది ఉంటే, 2050 నాటికి 64.7 కోట్ల మందిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.

  • జీడీపీలో 2 శాతానికి సమానమైన ప్రత్యక్ష ప్రభుత్వ పెట్టుబడులు 11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి, వీటిలో దాదాపు 70 శాతం మహిళలకు వెళుతుంది.

చాప్టర్ 9: వ్యవసాయం - ఆహార నిర్వహణ - సక్రమంగా ఉంటే సమృద్ధి 

 

  • వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో స్థిరమైన ధరల వద్ద సగటు వార్షిక వృద్ధి రేటు 4.18 శాతం నమోదు చేశాయి.

  • భారతీయ వ్యవసాయం అనుబంధ రంగాలు క్రమంగా బలమైన వృద్ధి కేంద్రాలుగా, వ్యవసాయ ఆదాయాలను మెరుగుపరచడానికి ఆశాజనక వనరులుగా ఎదుగుతున్నాయి.

  • 2024 జనవరి 31 నాటికి వ్యవసాయ రంగానికి అందించిన మొత్తం రుణాలు రూ.22.84 లక్షల కోట్లు.

  • జనవరి 31, 2024 నాటికి బ్యాంకులు రూ .9.4 లక్షల కోట్ల పరిమితితో 7.5 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు (కెసిసి) జారీ చేశాయి.

  • 2015-16 నుంచి 2023-24 వరకు పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) కింద దేశంలో 90.0 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం జరిగింది.

  • వ్యవసాయ పరిశోధనలో (విద్యతో సహా) పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రూ.13.85 ప్రతిఫలం లభిస్తుందని అంచనా.

చాప్టర్ 10: పరిశ్రమ - చిన్న, మధ్యతరహా విషయాలు

  • 2024 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం ఆర్థిక వృద్ధి రేటుకు 9.5 శాతం పారిశ్రామిక వృద్ధి రేటు మద్దతు ఇచ్చింది.

  • అనేక రంగాలలో అవాంతరాలు ఉన్నప్పటికీ, తయారీ రంగం గత దశాబ్దంలో సగటు వార్షిక వృద్ధి రేటును 5.2 శాతం సాధించింది, ప్రధాన వృద్ధి చోదకాలు రసాయనాలు, కలప ఉత్పత్తులు మరియు ఫర్నిచర్, రవాణా పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు మరియు పరికరాలు.

  • అనేక రంగాలలో అవాంతరాలు ఉన్నప్పటికీ, తయారీ రంగం గత దశాబ్దంలో సగటు వార్షిక వృద్ధి రేటును 5.2 శాతం సాధించింది, ప్రధాన వృద్ధి చోదకాలు రసాయనాలు, కలప ఉత్పత్తులు  ఫర్నిచర్, రవాణా పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు , పరికరాలు..

  • గత ఐదేళ్లలో బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయడం దిగుమతి పై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడింది.

  • భారత ఫార్మాస్యూటికల్ మార్కెట్ 50 బిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్ గా ఉంది.

  • ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వస్త్ర తయారీ పరిశ్రమగా టాప్ 5 ఎగుమతి దేశాల్లో భారత్ ఒకటి.

  • 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ మార్కెట్ వాటాలో భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వాటా 3.7 శాతంగా ఉంది.

  • పీఎల్ఐ పథకాలు మే 2024 వరకు రూ .1.28 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాయి, ఇది రూ .10.8 లక్షల కోట్ల ఉత్పత్తి / అమ్మకాలకు , రూ .8.5 లక్షలకు పైగా ఉపాధి కల్పనకు (ప్రత్యక్ష ,పరోక్ష) దారితీసింది.

  • విద్యారంగంతో క్రియాశీల సహకారాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఆర్ అండ్ డి,  ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడంలో , శ్రామిక శక్తి నైపుణ్య స్థాయిలను మెరుగుపరచడంలో పరిశ్రమ ముందడుగు వేయాలి.

చాప్టర్ 11: సేవలు - వృద్ధి అవకాశాలకు ఊతం

  • మొత్తం స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో సేవల రంగం వాటా ఇప్పుడు మహమ్మారికి ముందు స్థాయికి అంటే 55 శాతానికి చేరుకుంది.

  • సేవల రంగంలో అత్యధికంగా యాక్టివ్ కంపెనీలు (65 శాతం) ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 16,91,495 యాక్టివ్ కంపెనీలు ఉన్నాయి.

  • 2022లో ప్రపంచ వాణిజ్య సేవల ఎగుమతుల్లో భారత్ సేవల ఎగుమతులు 4.4 శాతంగా ఉన్నాయి.

  • భారత సేవల ఎగుమతుల్లో కంప్యూటర్ సేవలు, వ్యాపార సేవల ఎగుమతులు 73 శాతం ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం వృద్ధి నమోదైంది.

  • ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ డెలివరీ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా 2019లో 4.4 శాతం నుంచి 2023 నాటికి 6.0 శాతానికి పెరిగింది.

  • భారతదేశంలో విమానయాన రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది, 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ విమానాశ్రయాలలో నిర్వహించే మొత్తం విమాన ప్రయాణీకులలో 15 శాతం పెరుగుదల నమోదైంది. .

  • భారత విమానాశ్రయాల్లో నిర్వహించే ఎయిర్ కార్గో 2024 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగి 33.7 లక్షల టన్నులకు చేరుకుంది.

  • 2024 మార్చిలో 22.9 శాతం వృద్ధితో రూ.45.9 లక్షల కోట్ల సేవల రంగ రుణాలతో ఆర్థిక సంవత్సరం ముగిసింది.

  • గత ఏడాదితో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలో ప్రయాణీకుల రద్దీ 5.2 శాతం పెరిగింది.

  • 2024 ఆర్థిక సంవత్సరంలో (కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ మినహా) ఆదాయం ఆర్జించే సరుకు రవాణా అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతం పెరిగింది.

  • 2023 లో పర్యాటక పరిశ్రమ 92 లక్షలకు పైగా విదేశీ పర్యాటకులను చూసింది, ఇది 43.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

  • 2023 లో, భారతదేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు 2013 నుండి అత్యధికంగా ఉన్నాయి, 33 శాతం వృద్ధిని సాధించాయి, టాప్ 8 నగరాల్లో మొత్తం 4.1 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

  • భారతదేశంలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జిసిసిలు) గణనీయంగా పెరిగాయి, 2015 ఆర్థిక సంవత్సరంలో 1,000 కేంద్రాల నుండి 2023 ఆర్థిక సంవత్సరం నాటికి 1,580 కేంద్రాలకు చేరుకున్నాయి.

  • భారత ఈ-కామర్స్ పరిశ్రమ 2030 నాటికి 350 బిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా.

  • భారతదేశంలో మొత్తం టెలి-సాంద్రత (ప్రతి 100 జనాభాకు టెలిఫోన్ల సంఖ్య) మార్చి 2014 లో 75.2 శాతం నుండి మార్చి 2024 నాటికి 85.7 శాతానికి పెరిగింది. 2024 మార్చిలో ఇంటర్నెట్ సాంద్రత 68.2 శాతానికి పెరిగింది.

  • మార్చి 31, 2024 నాటికి, 6,83,175 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఒఎఫ్సి) వేయబడింది, ఇది భారత్ నెట్ ఫేజ్ 1 ,2 లో ఓ ఎఫ్ సి ద్వారా మొత్తం 2,06,709 గ్రామ పంచాయతీలను (జిపి) కలుపుతుంది.

  • దేశీయ సేవల పంపిణీ వేగవంతమైన సాంకేతిక-ఆధారిత మార్పు, భారతదేశ సేవల ఎగుమతుల వైవిధ్యం అనే రెండు ముఖ్యమైన మార్పులు భారతదేశ సేవల ముఖచిత్రాన్ని పునర్నిర్మిస్తున్నాయి: 

చాప్టర్ 12: మౌలిక సదుపాయాలు -  వృద్ధి అవ కాశాల పెంపు 

  • ఇటీవలి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు కీలక పాత్ర పోషించాయి.

  • ఎన్ హెచ్ నిర్మాణం సగటు వేగం 2014 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 11.7 కిలోమీటర్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రోజుకు 34 కిలోమీటర్లకు దాదాపు 3 రెట్లు పెరిగింది.

  • కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ కన్వర్షన్, డబ్లింగ్ వంటి అంశాల్లో గణనీయమైన పెట్టుబడులతో గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగింది.

  • భారతీయ రైల్వే 2025 ఆర్థిక సంవత్సరంలో వందే మెట్రో ట్రైన్ కోచ్ లను ప్రవేశపెట్టనుంది.

  • 2024 ఆర్థిక సంవత్సరంలో, 21 విమానాశ్రయాలలో కొత్త టెర్మినల్ భవనాలు ప్రారంభించారు. ఇది మొత్తం ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని సంవత్సరానికి సుమారు 62 మిలియన్ల మంది ప్రయాణీకుల నిర్వహణ సామర్ధ్యం పెరుగుదలకు దారితీసింది.

  • ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో అంతర్జాతీయ షిప్ మెంట్స్ విభాగంలో భారత్ ర్యాంక్ 2014లో 44వ స్థానం నుంచి 2023 నాటికి 22వ స్థానానికి మెరుగుపడింది.

  • భారతదేశంలో క్లీన్ ఎనర్జీ రంగంలో 2014-2023 మధ్య కాలంలో రూ .8.5 లక్షల కోట్ల (102.4 బిలియన్ డాలర్లు) కొత్త పెట్టుబడులు వచ్చాయి.

చాప్టర్ 13: క్లైమేట్ ఛేంజ్ అండ్ ఇండియా: సమస్యను మన లెన్స్ ద్వారా ఎందుకు చూడాలి

  • వాతావరణ మార్పుల కోసం ప్రస్తుత ప్రపంచ వ్యూహాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. అవి విశ్వవ్యాప్తంగా వర్తించవు.

  • పాశ్చాత్య విధానం సమస్య మూలాన్ని, అంటే మితిమీరిన వినియోగాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించదు, కానీ అధిక వినియోగాన్ని సాధించడానికి మార్గాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటుంది.

  • వన్-సైజ్-ఫిట్-ఆల్ విధానం పనిచేయదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు వారి స్వంత మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలి.

  • అభివృద్ధి చెందిన ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో మితిమీరిన వినియోగం సంస్కృతికి భిన్నంగా, భారతదేశ నైతికత ప్రకృతితో సామరస్యపూర్వక సంబంధాన్ని నొక్కి చెబుతుంది.

  • 'సంప్రదాయ బహుళ తరాల కుటుంబాలు' వైపు మళ్లడం సుస్థిర గృహనిర్మాణం దిశగా మార్గాన్ని సృష్టిస్తుంది.

  • "మిషన్ ఎల్ఐఎఫ్ఇ" ప్రపంచ వాతావరణ మార్పు సమస్యకు మూలమైన అధిక వినియోగం కంటే బుద్ధిపూర్వక వినియోగాన్ని ప్రోత్సహించే మానవ-ప్రకృతి సామరస్యంపై దృష్టి పెడుతుంది.

 

****


(Release ID: 2036019) Visitor Counter : 1809