ఆర్థిక మంత్రిత్వ శాఖ

విద్యుత్ నిల్వ కోసం పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి విధానం


యూనియన్ బడ్జెట్ సోలార్ సెల్స్, పేనెల్స్ తయారీలో ఉపయోగించే కాపిటల్ గూడ్స్ ను మినహాయించబడిన వస్తువుల జాబితా లో చేర్చినట్టు ప్రకటించింది

ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్ మధ్య సంయుక్త భాగస్వామ్య సంస్థ ద్వారా 800 మెగావాట్ల వాణిజ్య ప్లాంట్ ను ఆస్క్ టెక్నాలజీతో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేసింది

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు, 14 లక్షల అప్లికేషన్లు నమోదు అయ్యాయి

Posted On: 23 JUL 2024 12:52PM by PIB Hyderabad

ఉపాధి, వృద్ధి , పర్యావరణ సుస్థిరత్వం అవసరాలను సమతుల్యం చేసే తగిన విద్యుత్ శక్తి పరివర్తన మార్గాలపై విధాన పత్రాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి. నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

 



ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024-2025ను సమర్పించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, లభ్యత, అందుబాటు, సరసమైన ధర లో ఇంధన భద్రతతో పాటు అధిక వృద్ధి, మరింత సమర్థవంతమైన  వనరుల వినియోగం తో సుస్థిర ఆర్థిక వృద్ధిని కొనసాగించాలానే ప్రభుత్వ వ్యూహానికి ఇది కొనసాగింపు అని ఆమె అన్నారు.


కేంద్ర మంత్రి గారు ఈ సందర్భంలో క్రింది చర్యలను ప్రకటించారు:

విద్యుత్  శక్తి సంరక్షణ కోసం పంప్ స్టోరేజ్ విధానం

ఆర్థిక మంత్రి విద్యుత్ నిల్వ కోసం పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఒక విధానాన్ని తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ఇది  మొత్తం శక్తి మిశ్రమంలో పెరుగుతున్న అస్థిరమైన పునరుత్పాదక శక్తి వాటాను సున్నితంగాఅనుసంధానం చేయడానికి సహాయపడుతుంది.

విద్యుత్  శక్తి పరివర్తన వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా పోరాటంలో అత్యంత కీలకమైనదిగా ఆర్థిక మంత్రి గారు పేర్కొన్నారు. దేశంలో సోలార్ సెల్స్, పేనెల్స్ తయారీలో ఉపయోగించే కాపిటల్ గూడ్స్ ను మినహాయించబడిన వస్తువుల జాబితా లో చేర్చినట్టు ప్రకటించారు. అంతేకాకుండా, దేశంలో సౌర గ్లాస్, టిన్నెడ్ కాపర్ ఇంటర్ కనెక్ట్ తయారీ సామర్థ్యం సరిపోయినందున, బడ్జెట్ 2024-25 లో వాటికి సంబంధించిన కస్టమ్స్ డ్యూటీల రాయితీని పొడిగించడానికి ప్రతిపాదించలేదు.

లఘు మాడ్యులర్ అణు రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి

వికసిత భారత్ కోసం విద్యుత్ శక్తి మిశ్రమంలో అణు శక్తి చాలా ముఖ్యమైన భాగంగా ఉంటుందని ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు. ఆ లక్ష్యం కోసం, ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి (1) భారత్ లఘు రియాక్టర్లను ఏర్పాటు చేయడానికి, (2) భారత్ లఘు మాడ్యులర్ అణు రియాక్టర్ పరిశోధన, అభివృద్ధి,  (3) అణు శక్తి కోసం నూతన సాంకేతికతల పరిశోధన, అభివృద్ధి కోసం ప్రభుత్వం భాగస్వామ్యం వహిస్తుంది. మధ్యంతర బడ్జెట్ లో ప్రకటించిన పరిశోధన నిధులు ఈ రంగం కోసం అందుబాటులో ఉంటాయి.

అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్లు

ఆర్థిక మంత్రి అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ (ఏ యూ ఎస్ సి) థర్మల్ పవర్ ప్లాంట్ల కోసం స్వదేశీ సాంకేతికత అభివృద్ధిని పూర్తి చేసినట్లు ప్రకటించారు. శ్రీమతి సీతారామన్ ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్ మధ్య సంయుక్త భాగస్వామ్య సంస్థ ద్వారా 800 మెగావాట్ల వాణిజ్య ప్లాంట్ ను ఏ యూ ఎస్ సి సాంకేతికతతో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేసింది. ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్లాంట్ల కోసం ఉన్నత స్థాయి ఉక్కు, ఇతర 15 అధునాతన మెటలర్జీ వస్తూత్పత్తుల  ఉత్పత్తి కోసం స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనాలు చేకూరుతాయని ప్రకటించారు.

‘తగ్గించడం కష్టమైన - హార్డ్ టు అబేట్’ పరిశ్రమల కోసం రోడ్ మేప్

‘తగ్గించడం కష్టమైన హార్డ్ టు అబేట్’ పరిశ్రమలను ‘విద్యుత్  శక్తి సామర్థ్యం’ లక్ష్యాల నుండి ‘ఉద్గార లక్ష్యాలు’ కు మార్చడానికి ఒక రోడ్ మేప్ ను రూపొందిస్తారని ఆమె ప్రకటించారు, ఈ పరిశ్రమలను ప్రస్తుత ‘పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్’ మోడ్ నుండి ‘ఇండియన్ కార్బన్ మార్కెట్’ మోడ్ కు మార్చడానికి అనువైన నియమాలను రూపొందిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.

సాంప్రదాయిక సూక్ష్మ, లఘు పరిశ్రమలకు సహాయం

60 క్లస్టర్లలో వెండి, సిరామిక్ పరిశ్రమలతో సహా అన్ని సాంప్రదాయిక సూక్ష్మ, లఘు పరిశ్రమలకు ఇన్వెస్ట్మెంట్ -గ్రేడ్ శక్తి ఆడిట్ ను అందిస్తారు.వాటిని పరిశుభ్రమైన విద్యుత్  శక్తి కి మారడానికి  విద్యుత్శక్తి సామర్థ్యం చర్యలను అమలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తారని మంత్రి చెప్పారు, ఈ పథకాన్ని తదుపరి దశలో మరో 100 క్లస్టర్లలో పునరావృతం చేయబడుతుంది ఆర్థిక మంత్రి తెలిపారు.

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన

మధ్యంతర బడ్జెట్ లో ప్రకటించినట్లు, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ను ప్రారంభించారు. ఇది 1 కోటి కుటుంబాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తుంది. ఈ పథకానికి అద్భుతమైన స్పందన వచ్చింది. 1.28 కోటి నమోదులు,14 లక్షల అప్లికేషన్లు వచ్చాయని ప్రభుత్వం దీనిని ఇంకా ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి  చెప్పారు.

 

***



(Release ID: 2035809) Visitor Counter : 17