ఆర్థిక మంత్రిత్వ శాఖ
2024-25లో భారతదేశ వాస్తవ జీడీపీలో 6.5-7 శాతం వృద్ధి పెరుగుతుందని అంచనా
ఆటుపోట్లను తట్టుకుంటూ 24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం వృద్ధి సాధించిన భారత వాస్తవ జీడీపీ. 24 ఆర్థిక సంవత్సరంలోని నాలుగు త్రైమాసికాల్లో మూడుసార్లు 8 శాతానికి పైగా నమోదు
24 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తు ధర ప్రకారం మొత్తం జీవీఏలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వాటా 17.7 శాతం, 27.6 శాతం, 54.7 శాతంగా ఉంది
24 ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతం వృద్ధిని నమోదు చేసిన తయారీ రంగం; నిర్మాణ రంగంలోనూ 9.9 శాతం వృద్ధి నమోదు
23 ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉన్న రీటైల్ ద్రవ్యోల్బణం 24 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతానికి తగ్గింది.
వృద్ధిలో కీలకమైన అంశమైన ప్రైవేటు ఆర్థికేతర కార్పొరేషన్ల నుంచి వచ్చే గ్రాస్ ఫిక్డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్(జీఎఫ్‌సీఎఫ్) 23 ఆర్థిక సంవత్సరంలో 19.8 శాతం పెరిగింది.
2023లో దేశంలోని మొదటి ఎనిమిది నగరాల్లో 4.1 లక్షల గృహాల విక్రయంతో 33 శాతం వార్షిక వృద్ధి నమోదు. ఇది 2023 తర్వాత అత్యధికం.
కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.4 శాతం ఉండగా 24 ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతానికి తగ్గింది.
24 ఆర్థిక సంవత్స
Posted On:
22 JUL 2024 3:33PM by PIB Hyderabad
2024-25లో భారతదేశ వాస్తవ జీడీపీలో 6.5-7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా. కొవిడ్ మహమ్మారి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది. కొవిడ్‌కు ముందు నాటి 20 ఆర్థిక సంవత్సరం కంటే 24 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవ జీడీపీ 20 శాతం పెరిగిది. పార్లమెంటులో సోమవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వేలో ఈ విషయం ప్రకటించారు.
అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో అనిశ్చిత ఉన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకశక్తులు 24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయని ఆర్థిక సర్వే పేర్కొన్నది. 20 ఆర్థిక సంవత్సరంతో ముగిసిన దశాబ్దంలో భారతదేశం సగటున 6.6 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధిని ప్రతిబింబించింది.
2024 సంవత్సరంలో ఏవైనా భౌగోళిక రాజకీయ సంఘర్షణలు తలెత్తితే సరఫరాలో ఆటంకాలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పునరావృతం కావడం, మూలధన విధానం నిలిచిపోవడం వంటి అంశాలకు దారి తీయవచ్చని ఆర్థిక సర్వే హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) ఆర్థిక విధానంపైనా ఇది ప్రభావం చూపవచ్చని పేర్కొన్నది. 2023లో పెరుగుదల నమోదైన కారణంగా 2024లోనూ ప్రపంచ వాణిజ్యం సానుకూలంగా ఉండనుందని అంచనా వేసింది.
వ్యాపార ఎగుమతు, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల విస్తరణ వంటి వృద్ధి చెందుతున్న మార్కెట్లలో అవకాశాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సర్వే ప్రస్తావించింది. ప్రధాన ద్రవ్యోల్బణ రేటు 3 శాతంగా ఉన్నప్పటికీ ద్రవ్య సరఫరాను తగ్గించడం, అమెరికా ఫెడరల్‌పై దృష్టిసారించి కొంతకాలంగా వడ్డీరేట్లను మార్చడం లేదు. ఆశించిన సడలింపు కూడా ఆలస్యమైంది.
అంతర్జాతీయ, విదేశీ సవాళ్లను తట్టుకుంటూ 24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి రేటును సాధించిందని, 24 ఆర్థిక సంవత్సరంలోని నాలుగు త్రైమాసికాల్లో మూడింటిలో 8 శాతానికి పైగా సాధించిందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. స్థిరమైన వినియోగ డిమాండ్‌తో పాటు పెట్టుబడులు క్రమంగా పెరగడం వల్ల ఇది సాధ్యమైంది.
ప్రస్తుత ధరల ప్రకారం మొత్తం జీవీఏలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల వాటా 24 ఆర్థిక సంవత్సరంలో 17.7 శాతం, 27.6 శాతం, 54.7 శాతంగా ఉన్నాయి. 2023లో అస్థరమైన వాతావరణ పరిస్థితులు, రుతుపవనాలు అన్ని ప్రాంతాలకు సరిగ్గా చేరకపోవడం వంటి అంశాల కారణంగా వ్యవసాయ రంగంలో జీవీఏ వృద్ధి నెమ్మదిగా పెరుగుతున్నది.
23 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగంలో జీవీఏ నిరాశపరిచియన్పపటికీ 24 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 9.9 శాతం వృద్ధి నమోదైంది. ముడి సరుకుల ధరలు తగ్గడం, దేశీయంగా డిమాండ్ స్థిరంగా ఉండటం ద్వారా తయారీ కార్యకలాపాలు లాభపడ్డాయి. ఇదే రకంగా నిర్మాణ రంగంలోనూ 24 ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతం వృద్ధి నమోదైంది. మౌలిక సదుపాయాల నిర్మాణం, వాణిజ్య, గృహ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం.
సేవారంగంలో వృద్ధి పలు అంశాలు ప్రతిబింబిస్తున్నాయి. హోల్‌సేల్, రీటైల్ వాణిజ్యాన్ని సూచించే ఇ-వే బిల్లుల జారీ, జీఎస్టీ వసూళ్లు పెరగడం ద్వారా 24 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి నమోదైంది. కొవిడ్ మహ్మారి తర్వాత ఆర్థిక, నైపుణ్య సేవలు ఈ వృద్ధికి ప్రధానంగా ఉపయోగపడ్డట్టు సర్వే పేర్కొన్నది.
ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో గ్రాస్ ఫిక్డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్(జీఎఫ్‌సీఎఫ్) కీలకమైన చోదకశక్తిగా అవతరించింది. ప్రైవేటు నాన్-ఫైనాన్షియల్ కార్పొరేషన్ల జీఎఫ్‌సీఎఫ్ 19.8 శాతం వృద్ధి సాధించింది. 24 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు మూలధన వ్యయం సుస్థిరంగా ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ అధ్యయనం ప్రకారం.. 24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3,200 వరకు ఉన్న అన్ని లిస్టెడ్, అన్‌లిస్టెడ్ నాన్ ఫైనాన్షియల్ సంస్థల్లో కలిపి 19.8 శాతం వృద్ధి నమోదైంది.
మూలధన వ్యయంలో ప్రైవేటు సంస్థలే కాకుండా గృహాలు కూడా ముందువరుసలో ఉన్నాయి. 2023లో భారత్‌లో గృహ రియల్ ఎస్టేట్ విక్రయాలు 2013 నుంచి అత్యధికంగా నమోదయ్యాయి. మొదటి ఎనిమిది నగరాల్లో 4.1 లక్షల యూనిట్లు విక్రయమవడం ద్వారా 33 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.
పెట్టుబడుల కోసం పెరుగుతున్న ఆర్థిక అవసరాలను తీర్చేలా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు స్పష్టమైన బ్యాలెన్స్ షీట్‌లు, సరిపడా మూలధన నిల్వలతో మంచి స్థానంలో ఉన్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ)లకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల0(ఎస్‌సీబీ) ఇచ్చే రుణాలు రెండంకెల వృద్ధి రేటును సాధించాయి. ఇదే విధంగా పెరుగుతున్న గృహ డిమాండ్‌తో ఇళ్ల కోసం తీసుకునే వ్యక్తిగత రుణాలు కూడా పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఆటంకాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ 24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గాయి. 23 ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉన్న రీటైల్ ద్రవ్యోల్బణం 24 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతానికి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యల ద్వారా ఇది సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం బహిరంగ మార్కెట్ విక్రయాలు, ప్రత్యేక కేంద్రాల ద్వారా విక్రయాలు జరపడం, సమయానుగునంగా దిగుమతులు చేసుకోవడం, ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు తగ్గించడం, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం వంటి కీలకమైన చర్యలు తీసుకుంది. మరోవైపు ఆర్బీఐ 2022 మే నెల నుంచి 2023 ఫిబ్రవరి మధ్య 250 బీపీఎస్ పాలసీ రేట్లను పెంచింది.
అంతర్జాతీయంగా ద్రవ్యలోటు, రుణాభారం పెరుగుతున్నప్పటికీ, భారత్ మాత్రం ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తోంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(సీజీఏ) కార్యాలయం విడుదల చేసిన ప్రొవిజనల్ ఆక్చువల్స్ సమాచారం ప్రకారం... కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 23 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం ఉండగా, 24 ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతానికి తగ్గింది.
24 ఆర్థిక సంవత్సరంలో స్థూల పన్ను ఆదాయం(జీటీఆర్) 13.4 వృద్ధిని సాధిస్తుందని అంచనా. 23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల్లో 15.8 శాతం, పరోక్ష పన్నుల్లో 10.6 శాతం వృద్ధి నమోదైంది.
మొత్తంగా స్థూల పన్ను ఆదాయం(జీటీఆర్)లో 55 శాతం ప్రత్యక్ష పన్నుల నుంచి, 45 శాతం పరోక్ష పన్నుల నుంచి వస్తుందని సర్వే పేర్కొన్నది. 24 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నులు పెరగడమే జీఎస్టీ వసూళ్లు 12.7 శాతం పెరగడానికి ప్రధాన కారణం. జీఎస్టీ వసూలు, ఈ-వే బిల్లులు పెరగడం అనేవి కాలక్రమంగా వృద్ధిని చాటుతున్నాయి.
24 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం 28.2 శాతం వార్షిక పెరుగుదల రూ.9.5 లక్షల కోట్లుగా ఉంది. 20 ఆర్థిక సంవత్సరంతో చూసుకుంటే ఇది 2.8 రెట్లు ఎక్కువ. అంతర్జాతీయంగా అస్థిరమైన, సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం మూలధన్య వ్యయాన్ని పెంచుతుండటా దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా నిలుస్తోంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, హైవేలు, రక్షణ సేవలు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలపై వెచ్చిస్తున్న నిధులు సరఫరా అడ్డంకులను పరిష్కరించడంలో, ఉత్పాదక సామర్థ్యాలను విస్తరించడానికి ఉపయగపడుతోంది.
మూలధన వ్యయంలో ఈ వృద్ధిని ముందుకుతీసుకెళ్లే అంశం ప్రైవేటు రంగంపై సైతం ఆధారపడి ఉంటుంది. ప్రైవేటు రంగం సొంతంగా, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇది జరగాలి. 22 ఆర్థిక సంవత్సరం నుంచి యంత్రాలు, పరికరాల వంటి మూలధన నిల్వల్లో ప్రైవేటు రంగం వాటా వేగంగా పెరుగుతున్నది. మంచి ఉద్యోగాల సృష్టి, క్షేత్రస్థాయిలో బలపడటం, బ్యాలెన్స్ షీట్లను మెరుగుపర్చడంలో ఇది ఆధారపడి ఉంటుంది.
24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవడం కొనసాగింది. ఇంకా ఆడిట్ చేయని కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. 23 రాష్ట్రాల ద్రవ్యలోటు రూ.9.1 లక్షల కోట్ల బడ్జెట్ లెక్కల కన్నా 8.6 శాతం తక్కువగా ఉంది. తద్వారా జీడీపీలో ఈ రాష్ట్రాల ద్రవ్యలోటు 3.1 శాతం ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేయగా 2.8 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మూలధన వ్యయంపై ప్రధానంగా దృష్టాసారించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న నిధుల నాణ్యత కూడా పెరిగింది.
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల్లోనూ చాలా పురోగతి ఉంది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్(జీఎస్‌డీపీ) పర్ క్యాపిటా తక్కువ ఉన్న రాష్ట్రాలకు వాటి జీఎస్‌డీపీ కంటే ఎక్కువ నిధులు అందుకున్నాయి.
బ్యాంకింగ్, ఫైనాన్స్ వ్యవస్థలపై ఆర్బీఐ జాగరణ కొనసాగుతోంది. ఏవైనా సూక్ష్మ ఆర్థిక లేదా వ్యవస్థీకృత సమస్యలు వచ్చినా తట్టుకునేలా ఆర్బీఐ చర్యలు ఉన్నాయి. ఆర్బీఐ 2024 జూన్ ఆర్థిక సుస్థిరత నివేదిక ప్రకారం.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల(ఎస్‌సీబీ) ఆస్తుల నాణ్యత పెరిగింది. 2024 మార్చిలో గ్రాస్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్(జీఎన్‌పీఏ) నిష్పత్తి 2.8 శాతంతో 12 ఏళ్ల దిగువకు చేరుకుంది.
ఎస్‌సీబీల లాభాలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్చి 2024 నాటికి రాబడిపై ఈక్విటీ 13.8 శాతం ఉండగా, ఆస్తులపై ఈక్విటీ 1.3 శాతం పొందాయి. కఠినమైన ఒత్తిళ్లు ఉన్న పరిస్థితులు వచ్చినప్పటికీ ఎస్‌సీబీలు కనీస మూలధన అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయని మాక్రో స్ట్రెస్ పరీక్షల ద్వారా వెల్లడైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో దృఢత్వం ఉత్పత్తి అవకాశాలకు ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు ఆర్థిక చట్రాన్ని పెంచుతోంది. సుస్థిర ఆర్థిక వృద్ధికి ఇవి రెండూ చాలా అవసరం.
అంతర్జాతీయంగా డిమాండ్ తక్కువగా ఉండటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సరుకుల ఎగుమతులు 24 ఆర్థిక సంవత్సరంలో మితంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ భారత్ నుంచి సేవల ఎగుమతులు మాత్రం భారీగా పెరిగాయి. 24 వార్షిక సంవత్సరంలో 341.1 బిలియన్ యూఎస్ డాలర్లతో కొత్త స్థాయికి చేరుకున్నాయి. సరుకులు, సేవల ఎగుమతులు కలుపుకొని 24 ఆర్థిక సంవత్సరంలో 0.15 వృద్ధిని సాధించగా, దిగుమతులు మాత్రం 4.9 శాతం తగ్గినట్టు సర్వే వెల్లడించింది.
విదేశాల నుంచి వచ్చే చెల్లింపులు ప్రధానంగా ఉండే నికర ప్రైవేటు లావాదేవీలు 24 ఆర్థిక సంవత్సరంలో 106.6 బిలియన్ యూఎస్ డాలర్లకు పెరిగాయి. దీని ఫలితంగా 23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 2.0 శాతంగా ఉన్న కరంట్ అకౌంట్ డెఫిసిట్(సీఏడీ) ఇప్పుడు 0.7 శాతానికి తగ్గింది. గత రెండేళ్ల నికర ఔట్‌ఫ్లోతో పోలిస్తే నికర ఎఫ్‌పీఐ ఇన్‌ఫ్లో 44.1 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది.
మొత్తంగా, సరిపడా విదేశీ మారక నిల్వలు, స్థిరమైన మారక రేటుతో భారత విదేశీ రంగాన్ని నేర్పుగా నిర్వహిస్తున్నారు. 2024 మార్చి చివరి నాటికి విదేశీ మారక నిల్వలు 11 నెలల దిగుమతుల అంచనాకు సరిపోయేంత ఉన్నాయి.
24 ఆర్థిక సంవత్సరంలో భారత రూపాయి.. అస్థిరత్వం తక్కువగా ఉండే కరెన్సీల్లో ఒకటిగా ఉంది. భారతదేశ విదేశీ అప్పులకు సంబంధించిన సూచికలు కూడా బాగున్నాయి. 2024 మార్చి చివరి నాటికి జీడీపీలో విదేశీ అప్పుల నిష్పత్తి 18.7 శాతంతో కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం.. 2024 మార్చి నాటికి మొత్తం అప్పులో విదేశీ మారక నిల్వలు 97.4 శాతంగా ఉన్నాయి.
భారతదేశ సామాజిక సంక్షేమ విధానం ఇన్‌పుట్ ఆధారితం నుంచి ఔట్‌పుట్ ఆధారిత సాధికారతగా మారిపోయింది. పీఎం ఉజ్వళ యోజన కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరవడం, పీఎం-ఆవాజ్ యోజన కింద పక్కా గృహాల నిర్మాణ వంటి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల వెనుకబడిన వర్గాల్లో సామర్థ్యాలు పెంచడంతో పాటు అవకాశాలను పెంపొందించింది. ఏ వ్యక్తినీ వదిలేయకుండా ఉండాలనే ఆలోచనతో సంస్కరణలను నిర్దిష్టంగా అమలు చేయడం ద్వారా అట్టడుగు స్థాయికి సేవలు అందేలా ప్రభుత్వ విధానం ఉన్నట్టు సర్వే పేర్కొన్నది.
లబ్ధిదారులకు నేరుగా బదిలీ(డీబీటీ) విధానం, జన్‌ధన్ యోజన-ఆధార్-మొబైల్ త్రయంతో వృధాను అరికట్టడంతో పాటు ఆర్థిక సమర్థను పెంచుకోవడం జరిగింది. 2013లో డీబీటీ విధానాన్ని అమలు చేసిన నాటి నుంచి దాదాపు రూ.36.9 లక్షల కోట్ల నిధులను నేరుగా బదిలీ చేసింది.
దేశంలో వార్షిక నిరుద్యోగ రేటు(15 ఏళ్ల వయస్సు, అంతకంటే పైబడిన వారు) కొవిడ్ తర్వాత క్రమంగా తగ్గుతోందని, ఇదే సమయంలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు, కార్మిక-జనాభా నిష్పత్తి పెరుగుతున్నదని సర్వే పేర్కొన్నది. గ్రామీణ మహిళ భాగస్వామ్యం పెరుగుతండటంతో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు కూడా పెరుగుతోంది. 2017-18లో 23.3 శాతంగా ఉన్న మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 2022-23 నాటికి 37 శాతానికి పెరిగింది.
ప్రపంచలో అనిశ్చితులు, అస్థిరతలు మొదలైనప్పటికీ 2023లో ప్రపంచం ఆర్థికంగా మంచి సుస్థిరతను సాధించినట్టు సర్వే తెలిపారు. ప్రతికూల భౌగోళిక రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ అనూహ్యంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మాత్రం బలోపేతం అవుతున్నది.
వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్(డబ్ల్యూఈఓ), అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఏప్రిల్ 2024 ప్రకారం 2023లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.
(Release ID: 2035774)
Visitor Counter : 1440
Read this release in:
Marathi
,
Kannada
,
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam