ఆర్థిక మంత్రిత్వ శాఖ
యూనియన్ బడ్జెట్ 2024-25 లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు ₹ 1.52 లక్ష కోట్ల కేటాయింపు
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ఆధారంగా 400 జిల్లాల్లో ఖరీఫ్ పంటల డిజిటల్ సర్వే
నూనె గింజల సాగులో “ఆత్మనిర్భర్తా” సాధించడానికి వ్యూహం
ప్రధాన వినియోగ కేంద్రాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తికి భారీ స్థాయి క్లస్టర్లను అభివృద్ధి చేయాలి
రొయ్యల సాగు కోసం న్యూక్లియస్ పెంపకం కేంద్రాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక మద్దతును ప్రకటించారు
Posted On:
23 JUL 2024 12:59PM by PIB Hyderabad
యూనియన్ బడ్జెట్ 2024-25 లో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, తట్టుకుని నిలిచే స్థితి ని సాధించడానికి పలు చర్యలు ప్రకటించారు. వాటిలో డిజిటల్ ప్రజామౌలిక సదుపాయాలు, నూనె గింజల కోసం ‘ఆత్మనిర్భరత ’, కూరగాయల ఉత్పత్తికి భారీ స్థాయి క్లస్టర్ల అభివృద్ధి రొయ్యల సాగు కోసం న్యూక్లియస్ పెంపకం కేంద్రాల నెట్‌వర్క్‌కు ఆర్థిక మద్దతు వంటివి ప్రధానమైనవి.
వ్యవసాయ రంగంలో డిజిటల్ ప్రజామౌలిక సదుపాయాలు
పైలట్ ప్రాజెక్ట్ విజయంపై ప్రేరణ పొందిన కేంద్రప్రభుత్వం రాష్ట్రాలతో భాగస్వామ్యంగా 3 సంవత్సరాల వ్యవధిలో రైతులు, వారి భూకమతాల కోసం వ్యవసాయ రంగంలో డిజిటల్ ప్రజామౌలిక సదుపాయాలను (డి పీ ఐ ) అమలు చేయనుంది. ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్, 2024-25 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవశపెట్టే సమయంలో, ఈ సంవత్సరంలో, డి పీ ఐ ఉపయోగించి ఖరీఫ్ క్షేత్ర పరిశీలన 400 జిల్లాల్లో చేపట్టబడుతుందని చెప్పారు. 6 కోట్ల రైతుల మరియు వారి భూముల వివరాలను రైతు మరియు భూమి రిజిస్ట్రీలకు తీసుకురానున్నట్లు చెప్పారు. జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులను 5 రాష్ట్రాలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీమతి సీతారామన్ చెప్పారు.
పప్పుధాన్యాల, నూనెగింజల మిషన్లు
పప్పుధాన్యాల, నూనెగింజలలో స్వయం సమృద్ధి సాధించడానికి, ప్రభుత్వం వాటి ఉత్పత్తి, నిల్వ మరియు మార్కెటింగ్‌ను బలోపేతం చేయనుంది.ఈరోజు కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పిస్తూ కేంద్ర మంత్రి శ్రీమతి. నిర్మలా సీతారామన్ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల కోసం 'ఆత్మనిర్భర్త' సాధించేందుకు మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా వ్యూహాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
కూరగాయల ఉత్పత్తి , సరఫరా చైన్‌లు
కూరగాయల సాగుకు ప్రధాన వినియోగ కేంద్రాలకు సమీపంలో భారీ స్థాయిలో క్లస్టర్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు. సేకరణ, నిల్వ మరియు మార్కెటింగ్‌తో సహా కూరగాయల సరఫరా గొలుసుల కోసం రైతు-ఉత్పాదక సంస్థలు, సహకార సంస్థలు మరియు స్టార్టప్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆమె చెప్పారు.
రొయ్యల సాగు, ఎగుమతి
యూనియన్ ఆర్ధిక మంత్రి, రొయ్యల సాగు కోసం న్యూక్లియస్ పెంపకం కేంద్రాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక మద్దతు అందిస్తుందని చెప్పారు. నాబార్డ్ ద్వారా రొయ్యల సాగు, ప్రాసెసింగ్, ఎగుమతికి ఆర్థిక మద్దతు అందిస్తుందని తెలిపారు.
యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించిన తొమ్మిది ప్రాముఖ్యత గల రంగాలలో ఉత్పాదకత, తట్టుకుని నిలబడే స్థితి సాధించాల్సిన వ్యవసాయ రంగం మొదటిది. యూనియన్ బడ్జెట్ 2024-25 వ్యవసాయ అనుబంధ రంగానికి ₹ 1.52 లక్ష కోట్ల కేటాయింపు చేసింది. నాలుగు ప్రధాన కులాల్లో 'అన్నదాత' (రైతు) ఒకటని పేర్కొన్న మంత్రి, ప్రభుత్వం అన్ని ప్రధాన పంటలకు నెల రోజుల క్రితం అధిక కనీస మద్దతు ధరలను ప్రకటించిందని, వ్యయాలపై కనీసం 50 శాతం మార్జిన్ అదనంగా ఇస్తామన్న వాగ్దానం నెరవేర్చిందని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను 5 సంవత్సరాలకు పొడిగించబడిందని చెప్పారు, ఇది 80 కోట్ల మందికి లాభం చేకూరుస్తుంది.
***
(Release ID: 2035769)
Visitor Counter : 305
Read this release in:
Odia
,
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil