ఆర్థిక మంత్రిత్వ శాఖ
గత కొన్ని సంవత్సరాలుగా సరసమైన రీతిలో అందరికీ అందుబాటులోకి వచ్చిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ
2020 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే ఆరోగ్య రంగం వ్యయం (జిహెచ్ఈ) లో
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యయం 55.9 శాతం పెరుగుదల
2020లో శిశు మరణాల సంఖ్య ప్రతి లక్ష జననాలలో 28 గా గణనీయమైన తగ్గుదల;
ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్షకు 97 కి తగ్గుదల
Posted On:
22 JUL 2024 2:45PM by PIB Hyderabad
గత కొన్ని సంవత్సరాలుగా, జాతీయ ఆరోగ్య ఖాతాల (ఎన్హెచ్ఏ) అంచనాల ప్రకారం, ఆరోగ్య సంరక్షణ సామాన్య ప్రజలకు మరింత సరసమైన రీతిలో అందుబాటులోకి వచ్చింది, పార్లమెంట్ కు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్థిక సర్వే 2023-2024 పేర్కొంది.
తాజా ఎన్హెచ్ఏ అంచనాలు (2020 ఆర్థిక సంవత్సరం కోసం) మొత్తం జీడీపీలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం (జిహెచ్ఈ), మొత్తం ఆరోగ్య వ్యయం (టిహెచ్ఈ)లో జిహెచ్ఈ వాటా పెరుగుదలను చూపుతుందని సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది. సంవత్సరాలుగా, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యయం 2015 ఆర్థిక సంవత్సరంలో జిహెచ్ఈలో 51.3 శాతం నుండి 2020 ఆర్థిక సంవత్సరంలో జిహెచ్ఈ లో 55.9 శాతానికి పెరిగింది. జిహెచ్ఏఈలో ప్రాథమిక, ద్వితీయ శ్రేణి సంరక్షణ వాటా 2015 ఆర్థిక సంవత్సరంలో 73.2 శాతం నుండి 2020 ఆర్థిక సంవత్సరంలో 85.5 శాతానికి పెరిగింది. మరోవైపు, ప్రైవేట్ ఆరోగ్య వ్యయంలో ప్రాథమిక, ద్వితీయ సంరక్షణ వాటా అదే కాలంలో 83.0 శాతం నుండి 73.7 శాతానికి తగ్గింది. తృతీయ వ్యాధుల భారం పెరగడం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించడం దీనికి కారణమని సర్వే పేర్కొంది.
గడచిన కొన్ని సంవత్సరాలు చూస్తే, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యయం 2015 ఆర్థిక సంవత్సరంలో జిహెచ్ఈలో 51.3 శాతం నుండి 2020లో జిహెచ్ఈలో 55.9 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. జిహెచ్ఈలో ప్రాథమిక, ద్వితీయ సంరక్షణ వాటా 2015 ఆర్థిక సంవత్సరంలో 73.2 శాతం నుండి ఆర్థిక సంవత్సరం 2020లో 85.5 శాతానికి పెరిగింది. మరోవైపు, ప్రైవేట్ ఆరోగ్య వ్యయంలో ప్రాథమిక, ద్వితీయ సంరక్షణ వాటా అదే కాలంలో 83.0 శాతం నుండి 73.7 శాతానికి తగ్గింది, తృతీయ వ్యాధుల భారం పెరగడం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించడం దీనికి కారణమని సర్వే పేర్కొంది.
ఆరోగ్యంపై సామాజిక భద్రతా వ్యయంలో గణనీయమైన పెరుగుదలను కూడా సర్వే పేర్కొంది. ఇది 2015 ఆర్థిక సంవత్సరంలో 5.7 శాతం నుండి 2020 ఆర్థిక సంవత్సరంలో 9.3 శాతానికి పెరిగింది.
ఈ పరిణామాల పర్యవసానంగా, శిశు మరణాల రేటు (ఐఎంఆర్), 2013లో ప్రతి 1000 సజీవ జననాలకు 39 నుండి 2020లో 1000 సజీవ జననాలకు 28కి తగ్గడం, ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) 2014లో ప్రతి లక్ష సజీవ జననాలకు 167 నుండి 2020 నాటికి ప్రతి లక్షకు 97కి తగ్గింది.
సమీప భవిష్యత్తులో దేశ ఆరోగ్యం, వ్యాధి ప్రొఫైల్ కోసం నిర్ణయాత్మకంగా ఉండే రెండు ధోరణులను సర్వే సిఫార్సు చేస్తుంది. మొదటిది, ఆరోగ్యకరమైన ఆహారం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సర్వే ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధానంగా సూచిస్తోంది. రెండవది, ప్రజారోగ్యం రాష్ట్ర అంశంగా ఉండటంతో, జాతీయ కార్యక్రమాలు 'కనీసం ప్రతికూల మార్గాన్ని' మించకుండా చివరి మైలు రాయి వరకు చేరుకోవడానికి రాష్ట్ర, స్థానిక పాలన వ్యవస్థల కీలక పాత్రను సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది.
***
(Release ID: 2035757)
Visitor Counter : 176
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam