ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత వృద్ధిలో గణనీయంగా కొనసాగుతున్న సేవల రంగం వాటా, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో ఇది 55 శాతం


తాత్కాలిక అంచనాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం వృద్ధి 7.6 శాతం: ఆర్థిక సర్వే 2024

2024 మార్చిలో 61.2కు పెరిగిన పీఎంఐ సేవలు; దాదాపు 14 సంవత్సరాలలో ఈ రంగంలో అత్యంత ప్రధానమైన విక్రయాలు, వ్యాపార కార్యకలాపాల విస్తరణలలో ఇది ఒకటి

Posted On: 22 JUL 2024 2:30PM by PIB Hyderabad

ఒడుదుడుకులు ఉన్నప్పటికీ, గత మూడు దశాబ్దాల్లో సేవల రంగం భారత ఆర్థిక వృద్ధికి రక్షణ కవచంగా నిలిచింది. విధానం, విధానపరమైన సంస్కరణలపై దృష్టి పెట్టడం ద్వారా, కోవిడ్ విపత్తు సమయం నుంచి భౌతిక మౌలిక సదుపాయాలు, రవాణా, అన్ని ముఖ్యమైన వ్యాపార, వ్యక్తిగత, ఆర్థిక, మౌలిక సదుపాయాల ఆధారిత సేవలు బలంగా ఉద్భవించాయి... అయితే, ఆన్‌లైన్ చెల్లింపులు, ఇ-కామర్స్, వినోద వేదికల వంటి డిజిటల్ సేవల వైపు వేగంగా మళ్లడం, అలాగే ఇతర ఉత్పాదక కార్యకలాపాలలో ఉత్పాదకాలుగా హైటెక్ సేవలకు డిమాండ్ పెరగడం ద్వారా పరివర్తన జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-2024 ఆర్థిక సర్వేలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

 

2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో 55శాతం వాటాతో, భారత వృద్ధికి సేవల రంగం గణనీయంగా దోహదపడుతున్నదని ఆర్థిక సర్వే పేర్కొన్నది. గణనీయమైన దేశీయ డిమాండ్, వేగవంతమైన పట్టణీకరణ, ఇ-కామర్స్ వేదికల విస్తరణ అధిక రవాణా ఆవశ్యకాలను సృష్టించడం, డిజిటల్ సంబంధిత అంశాలు సేవల దేశీయ డిమాండ్ ను నిర్ణయించే ముఖ్యమైన అంశాలు. అనువైన వాతావరణాన్ని సృష్టించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, నైపుణ్యాలను పెంపొందించడం, మార్కెట్ ప్రాప్యతను సులభతరం చేయడం ద్వారా భారతదేశ సేవల వృద్ధి, పోటీతత్వాన్ని పెంపొందించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ఆర్థిక సర్వే పేర్కొన్నది.

సేవల రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ)

గత దశాబ్దంలో మొత్తం జీవీఏలో సేవల రంగం వాటా గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయంగా భారత సేవల రంగం 6 శాతానికి పైగా వాస్తవిక వృద్ధిని సాధించింది. సేవల ఎగుమతులు 2022 లో ప్రపంచ వాణిజ్య సేవల ఎగుమతుల్లో 4.4 శాతంగా ఉన్నాయి.

 

కోవిడ్ కు ముందు దశాబ్ధం పాటు, సేవల రంగం వాస్తవ వృద్ధి రేటు మొత్తం ఆర్థిక వృద్ధిని స్థిరంగా అధిగమించింది. కోవిడ్ తర్వాత, మౌఖిక రహిత సేవల ద్వారా; ప్రధానంగా ఆర్థిక, సమాచార సాంకేతికత, వృత్తిపరమైన సేవల ద్వారా ప్రేరితమైన సేవల రంగం వృద్ధి 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం జీవీఏను అధిగమించింది. ఆర్థిక వ్యవస్థను ఉన్నత పథంలో నడిపించడంలో దాని పాత్రను తిరిగి పొందింది.

తాత్కాలిక అంచనాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం 7.6 శాతం వృద్ధిని సాధించిందని సర్వే పేర్కొంది. స్థూల జీఎస్టీ వసూళ్లు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .20.18 లక్షల కోట్లకు చేరుకున్నాయి, ఇది గత సంవత్సరం కంటే 11.7 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

కొనుగోలు నిర్వాహకుల సూచీ (పీఎంఐ)- సేవలు

దేశంలో సేవల రంగంలో వ్యాపార కార్యకలాపాలు కోవిడ్ విపత్తు, ప్రపంచవ్యాప్తంగా ఇతర అంతరాయాల అవరోధాలను అధిగమించాయి. 2024 మార్చిలో సేవల పీఎంఐ 61.2కు పెరిగింది. ఇది దాదాపు 14 సంవత్సరాలలో ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన అమ్మకాలు, వ్యాపార కార్యకలాపాల విస్తరణల్లో ఒకటి. చార్ట్ XI.6 (క్రింద)లో గమనించినట్టు, 2021 ఆగస్టు నుంచి సేవల పీఎంఐ 50 కన్నా ఎక్కువగా ఉంది; ఇది గత 35 నెలలుగా నిరంతర విస్తరణను సూచిస్తుంది.

 

సేవల రంగంలో వాణిజ్యం

విపత్తు తర్వాత, సేవల ఎగుమతులు స్థిరమైన వేగాన్ని కొనసాగించాయని, 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 44 శాతం వాటా వాటిదే అని సర్వే పేర్కొన్నది. సేవల ఎగుమతుల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఇతర దేశాలు - యూరోపియన్ యూనియన్ (ఈయూ అంతర వాణిజ్యం మినహా), యూఎస్, యూకే, చైనా.

బహుళజాతి సంస్థల ద్వారా అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీలు) గమ్యస్థానంగా భారత్ కు పెరుగుతున్న కీర్తి సాఫ్ట్‌వేర్, వ్యాపార సేవల ఎగుమతులను గణనీయంగా పెంచింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ డెలివరీ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా 2019లో 4.4 శాతం నుంచి 2023 నాటికి 6.0 శాతానికి పెరిగింది. సేవల ఎగుమతుల్లో ఈ పెరుగుదలతో పాటు దిగుమతులు తగ్గడంతో 2024 ఆర్థిక సంవత్సరంలో క్రితం ఏడాదితో పోలిస్తే నికర సేవల రాబడులు పెరగడానికి కారణమైంది. ఇది భారతదేశ కరెంట్ ఖాతా లోటును తగ్గించడంలో దోహదపడింది.

సేవా రంగ కార్యకలాపాలకు ఆర్థిక వనరులు

సేవల రంగం దేశీయంగా తన ఆర్థిక అవసరాలను వీటి ద్వారా తీరుస్తుంది -

  1. దేశీయ బ్యాంకులు, క్యాపిటల్ మార్కెట్ల నుంచి రుణాలు: 2024 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగంలో రుణ ప్రవాహం పెరుగుతున్న ధోరణిని గమనించవచ్చు. క్రితం ఏడాదితో పోలిస్తే 2023 ఏప్రిల్ నుంచి ప్రతి నెలా వృద్ధి రేటు 20 శాతం దాటింది.
  1. అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బాహ్య వాణిజ్య రుణాల ద్వారా: 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విదేశీ వాణిజ్య రుణాల ప్రవాహంలో సేవల రంగం వాటా 53 శాతంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి 14.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా గతేడాదితో పోలిస్తే 58.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 

***

 


(Release ID: 2035463) Visitor Counter : 442