ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అపోహలు- వాస్తవాలు

భారతదేశంలో 'జీరో డోస్ పిల్లలు' అధిక సంఖ్యలో ఉన్నారన్న మీడియా నివేదికలు దేశ రోగనిరోధక ప్రయత్నాలపై అసంపూర్తి చిత్రాన్ని చూపుతున్నాయి
భారత జనాభా, అధిక వ్యాక్సినేషన్ కవరేజీని పరిగణనలోకి తీసుకోకుండా దేశాలతో లోపభూయిష్టమైన పోలికను అందిస్తున్నాయి మీడియా నివేదికలు
జీరో డోస్ పిల్లలు దేశం లోని మొత్తం జనాభాలో 0.11% ఉన్నారు.
భారతదేశ అధిక జనాభా పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది అన్ని దేశాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో టీకాలు వేసిన పిల్లలను కలిగి ఉంది.
2023-24 ఆర్థిక సంవత్సరoలో దేశంలో పూర్తి రోగనిరోధక కవరేజ్ 93.23%గా ఉంది.
భారతదేశ వ్యాధి నిరోధక (ఇమ్యునైజేషన్) కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజారోగ్య చొరవ; ఇది ఏటా 1.2 కోట్ల వ్యాక్సినేషన్ సెషన్ల ద్వారా 2.6 కోట్ల మంది పిల్లలు, 2.9 కోట్ల మంది గర్భిణీ స్త్రీల భారీ సమూహాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
మిషన్ ఇంద్రధనుష్ కింద 2023 వరకు 5.46 కోట్ల మంది పిల్లలు, 1.32 కోట్ల మంది గర్భిణులకు టీకాలు వేశారు

Posted On: 18 JUL 2024 6:37PM by PIB Hyderabad

ధనుష్ కార్యక్రమం నిర్వహించారు. దీని కింద అన్ని దశల్లో 5.46 కోట్ల మంది చిన్నారులు, 1.32 కోట్ల మంది గర్భిణులకు టీకాలు వేశారు.

 

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ యూఐపీ కింద డబ్ల్యూ హెచ్ ఒ సిఫార్సు చేసిన వ్యాక్సిన్లను అత్యధికంగా అందిస్తోంది. భారతదేశ సగటు కవరేజీ 83.4%, ప్రపంచ కవరేజీలో 10 శాతం కంటే ఎక్కువ. ఒపివి, ఐపివి ల అధిక స్థాయి కవరేజీతో, భారతదేశం 2011 లో చివరి పోలియో కేసును గుర్తించినప్పటి నుండి 13 సంవత్సరాల పోలియో రహిత స్థితిని విజయవంతంగా నిర్వహించింది.

 

93% డిటిపి -1 (పెంటా -1) వ్యాక్సిన్ మొదటి మోతాదు కవరేజీ , 93% తట్టు (మీజిల్స్) , రుబెల్లా వ్యాక్సిన్ మొదటి మోతాదు కవరేజీతో, దేశంలో జీరో-డోస్ పిల్లలను తగ్గించడం , మీజిల్స్ , రుబెల్లా నిర్మూలన దిశగా దేశంలో డ్రైవ్ చేపట్టారు. 

 

మీజిల్స్ , రుబెల్లాను ఎదుర్కోవడంలో అవిశ్రాంత కృషికి గుర్తింపుగా భారత్ కు ప్రతిష్టాత్మక మీజిల్స్ , రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. ఈ అవార్డును మీజిల్స్ , రుబెల్లా పార్టనర్ షిప్ (అమెరికన్ రెడ్ క్రాస్, బి ఎం జిఎఫ్, జి ఎ వి ఐ, యుఎస్ సిడిసి, యుఎన్ఎఫ్, యునిసెఫ్ అండ్ డబ్ల్యూహెచ్ఓ) మార్చి 6, 2024 న అమెరికా వాషింగ్టన్ డి సి లోని అమెరికన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయంలో భారతదేశానికి ప్రదానం చేశారు.

 

****



(Release ID: 2034184) Visitor Counter : 11