యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ యువజన అవార్డులు, జాతీయ సేవా పథకం అవార్డు విజేతలతో సంభాషించిన కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ.


మై భారత్ ప్లాట్ ఫాం యువతకు మరింత చేరువ చేయడంపై చర్చించిన మంత్రి.

భారతదేశ యువత, భవిష్యత్ విధాన నిర్ణేతలు : కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ

Posted On: 17 JUL 2024 2:12PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, బుధవారం కొత్తఢిల్లీలో జాతీయ యువజన అవార్డు విజేతలు, జాతీయ సేవా పథకం(ఎన్.ఎస్.ఎస్.) అవార్డు విజేతలతో సమావేశమయ్యారు. వారు సాధించిన విజయాలను అభినందించడంతోపాటు , మైభారత్ ప్లాట్ ఫాంను మరింత మెరుగుగా తీర్చిదిద్దేందుకు, భారతదేశ యువతకు ఇది మరింత ప్రయోజనకరంగాఉండేలా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగామంత్రి వారితో చర్చించారు. జాతీయ యువజన అవార్డు విజేతలు, ఎన్.ఎస్.ఎస్ అవార్డు విజేతల కృషిని కేంద్ర మంత్రి డాక్టర్ మాండవీయ అభినందించారు.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ విజేతలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్డిజి) సాధన, వాతావరణ మార్పులు, పట్టణ ప్రణాళిక, యువజన సాధికారత, మాదక ద్రవ్యాల నిరోధానికి వారు విశేషంగా కృషి చేశారని మంత్రి కొనియాడారు. దేశ ఉజ్వల భవిష్యత్ నిర్మాణానికి యువత ప్రతిభను ప్రోత్సహించి, తగిన గుర్తింపునిచ్చి వారిని ముందుకు తీసుకుపోవలసిన అవసరాన్ని మంత్రి నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా యువజన అవార్డు విజేతలనుద్దేశించి మాట్లాడుతూ మంత్రి డాక్టర్ మాండవీయ,“భారతదేశ యువత , దేశ భవిష్యత్ నిర్ణేతలు. వారికి సాధికారత కల్పించడంలో మన సమష్టి ప్రయాణం ఎంతో ఆనందాన్నిస్తోంది”అని మంత్రి అన్నారు.

 

 ఈ సందర్బంగా మంత్రి యువతతో, మై భారత్ ప్లాట్ ఫాం లో యువత క్రియాశీలంగా నిర్మాణాత్మకంగా పాల్గొనేలా చేయడంలో వినూత్న ఆలోచనల పై ప్రధానంగా దృష్టి పెట్టారు. మైభారత్ ప్లాట్ ఫాం ను యువత సంప్రదింపులకు మరింత వీలయ్యేలా మరింత సమాచారం అందించేదిగా, మరింతగా యువతకు ఉపయోగపడేదిగా ఉండేలా చేసేందుకు ఆయన వారి సలహాలు,సూచనలు కోరారు. మరిన్ని డిజిటల్ ఉపకరణాలను ఈ ప్లాట్ ఫాంలో చేర్చాలని వారు మంత్రికి సూచించారు. యువతకు సంబంధించిన విషయాలలో ఇది ,ఒకే చోట అన్ని పరిష్కారాలు లభ్యమయ్యే ప్లాట్ఫారంగా తీర్చిదిద్దడం గురించి మెంటార్ షిప్ ,ఇంటర్న్ షిప్ కార్యక్రమాల గురించి తెలియజేసి యువతకు మార్గనిర్దేశం కలిగించేలా చేయడం గురించి సూచనలు చేశారు. భారతీయ యువత ఆకాంక్షలు అవసరాలను తీర్చేవిధంగా యువతకు, మంత్రిత్వశాఖకు మధ్య నిరంతరం చర్చలు జరుగుతుండాలని డాక్టర్ మాండవీయ అన్నారు.

 

వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా యువతకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ మాండవీయ పునరుద్ఘాటించారు. మైభారత్ ప్లాట్ ఫాం ను యువత పాత్రను మరింత పెంచేవిధంగా, వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉమ్మడి దార్శనికతకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. భారతదేశాన్ని అభివృద్ధి,ఆవిష్కరణలదిశగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ,యువతకుగల పరివర్తనాత్మక శక్తిపై తనకు అపార విశ్వాసం, నమ్మకం ఉందని మంత్రి తెలిపారు..

 

***


(Release ID: 2034182) Visitor Counter : 111