ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

100 మిలియన్ మార్కు ను దాటిన ప్రధాన మంత్రి ‘ఎక్స్’ ఖాతా ఫాలోవర్ల సంఖ్య

Posted On: 14 JUL 2024 10:38PM by PIB Hyderabad

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య 100 మిలియన్ (పది కోట్ల)ను మించిపోయింది.  ఈ సామాజిక మాధ్యమంలో ప్రపంచ నేతలందరి లోకి ఆయననే ఎక్కువ మంది ఫాలోవర్లు నిరంతరంగా అనుసరిస్తున్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు: 

‘‘ఎక్స్ మాధ్యమంలో 100 మిలియన్.

ఈ చైతన్యభరితమైన మాధ్యమం లోకి అడుగుపెట్టినందుకు సంతోషిస్తున్నాను; ఈ మాధ్యమం లో జరుగుతున్న చర్చ, వాదనలు, సూక్ష్మ దృష్టి, ప్రజల ఆశీర్వాదం, నిర్మాణాత్మక విమర్శల వంటి అనేక అంశాల నుంచి లభిస్తున్న ఆనందాన్ని మదిలో పదిల పరచుకొంటున్నాను. 

ఇక ముందు కూడా ఇదే తరహా బంధం కొనసాగుతుందని ఆశిస్తున్నాను.’’

 

 

***

DS/TS



(Release ID: 2033537) Visitor Counter : 53