ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన బిమ్స్ టెక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు


విభిన్న రంగాలలో ప్రాంతీయ సహకారాన్ని మరింత బల పరచడాన్ని గురించి చర్చించిన ప్రధాన మంత్రి

బిమ్స్ టెక్ కు భారతదేశ నిబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి

త్వరలో జరగనున్న బిమ్స్ టెక్ శిఖరాగ్ర సమావేశానికి గాను థాయిలాండ్ కు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపిన ప్రధాన మంత్రి



Posted On: 12 JUL 2024 1:57PM by PIB Hyderabad

ది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్  ఫర్ మల్టీ-సెక్టరల్ టెక్నికల్ ఎండ్ ఇకనామిక్ కోఆపరేషన్ (బిఐఎమ్ఎస్‌టిఇసి- బిమ్స్ టెక్)  సభ్య దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజున సమావేశమయ్యారు.

 

సంధానంఇంధనంవాణిజ్యంఆరోగ్యంవ్యవసాయంవిజ్ఞాన శాస్త్రంభద్రతప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా వివిధ రంగాలలో ప్రాంతీయ సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడం అనే అంశంపై మంత్రుల బృందంతో ప్రధాన మంత్రి జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.  ఆర్థికసామాజిక వృద్ధికి బిమ్స్ టెక్ ఒక చోదక శక్తి పాత్ర ను పోషించవలసి ఉందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.

 

శాంతియుతమైనసౌభాగ్యవంతమైనఆటుపోటులకు తట్టుకొని నిలువగలిగినసురక్షితమైన బిమ్స్ టెక్ ఆవిష్కారానికి భారతదేశం కట్టుబడి ఉంటుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.  భారతదేశం అనుసరిస్తున్న ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’‘లుక్ ఈస్ట్ విధానా’లతో పాటు సెక్యూరిటీ ఎండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ (ఎస్ఎజిఎఆర్ - ‘సాగర్’ ) విజన్ లో బిమ్స్ టెక్ కు ఉన్న ప్రాధాన్యాన్ని గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

 

సెప్టెంబరు లో జరగనున్న బిమ్స్ టెక్ శిఖరాగ్ర సమావేశానికి గాను థాయిలాండ్ కు భారతదేశం పూర్తి మద్ధతు ను అందిస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు.

 

***


(Release ID: 2032790) Visitor Counter : 91