మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎన్ సి ఇ ఆర్ టి పాఠ్య పుస్తకాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వార్తా కథనంపై వివరణ
జులై 2024లోనే ఆరో తరగతి పాఠ్యపుస్తకాలన్నిటిని అందుబాటులోకి తేనున్న ఎన్ సి ఇఆర్ టి
3, 6 తరగతులను మినహాయించి ప్రస్తుతమున్న పాఠ్యప్రణాలిక, పాఠ్యపుస్తకాల్లో ఎలాంటి మార్పు లేదు
Posted On:
10 JUL 2024 3:23PM by PIB Hyderabad
ఆరు, తొమ్మిది, 11 తరగతులకు సంబంధించి సవరించిన పాఠ్యపుస్తకాలపై కొనసాగుతున్న గందరగోళంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన అంటూ 9 జులై 2024 హిందూ దినపత్రికలో వచ్చిన వార్తా కథనం వాస్తవ విరుద్ధంగా వుంది.ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
వార్తా కథనంలో ప్రస్తావించిన విషయాలు:
ఎన్ సి ఆర్ టివారి ఆరో తరగతి పాఠ్యపుస్తకాలు విద్యార్థుల చేతుల్లోకి రావాలంటే మరో రెండు నెలల సమయం పడుతుంది. కేవలం 3, 6 తరగతుల పాఠ్యపుస్తకాలనే సవరిస్తారా , వీటికి తోడుగా 9, 11 తరగతుల పాఠ్యపుస్తకాలను కూడా సవరిస్తారా అనేదానిపై సిబిఎస్ ఇ సరిగా సమాచారం అందించలేదు. 9వ తరగతి ఇంగ్లీష్, భౌగోళికశాస్త్రం, 11వ తరగతి కంప్యూటర్ సైన్స్, రసాయనశాస్త్రం, చరిత్ర పాఠ్యపుస్తకాలు ప్రచురితం కాలేదు.
అనుమానాలను తొలగించడానికి, సంపూర్ణమైన స్పష్టత ఇవ్వడానికిగాను ఎన్ సి ఆర్ టి ఇచ్చిన వివరణ:
జులై 2024లోనో ఆరో తరగతి పాఠ్యపుస్తకాలన్నిటిని ఎన్ సి ఆర్ టి అందుబాటులోకి తేనున్నది. వార్తాకథనంలో ఇచ్చిన 2 నెలల సమయం పడుతుందనేది అవాస్తవం. ప్రయోగాత్మక బోధన భావనల కింద ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తగినంత సమయం ఇచ్చి వారిలో సొంత అనుభవాలు కలిగేలా ఎన్ సి ఇ ఆర్ టి ఒక నెలపాటు బ్రిడ్జి కార్యక్రమాన్ని 6వ తరగతి పది పాఠ్యపుస్తకాలన్నిటిలో నిర్వహించింది. అంతే కాకుండా ఉపాధ్యాయలు, విద్యార్థులు పాత పాఠ్యప్రణాలికనుంచి నూతన పాఠ్యప్రణాళికకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మారేందుకు ఈ బ్రిడ్జి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే కార్యక్రమాన్ని ప్రస్తుతం బోధనకు ఉపయోగించడం జరుగుతోంది.
మార్చి 22 , 2024 తేదీన వెలువడిన సిబిఎస్ ఇ సర్క్యులర్ నెంబర్ అకాడమిక్ 29 /2024 ప్రకారం 3, 6 తరగతులను మినహాస్తే ప్రస్తుతమున్న పాఠ్యప్రణాళికలోను, పాఠ్యపుస్తకాల్లోను ఎలాంటి మార్పు లేదని తెలియజేయడం జరిగింది. తప్పుదోవ పట్టించే సమాచారం వెలువడిన నేపథ్యంలో దాన్ని నమ్మవద్దని 3, 6 తరగతులను మినహాయిస్తే ఇతర తరగతులకు సంబంధించి గత విద్యాసంవత్సరం అంటే 2023-24లో ఉపయోగించిన పాఠ్యపుస్తకాలనే ఉపయోగించాలని ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది.
తమిళనాడుతో సహా అన్ని దక్షిణ భారతదేశాలకు ఆర్ పి డిసి బెంగళూరు సేవలందిస్తోంది. 9, 11 తరగతుల పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఆర్ పిడిసి బెంగళూరువారినుంచి వచ్చిన డిమాండ్ ప్రకారం ఎన్ సి ఆర్ టి ఆయా పాఠ్యపుస్తకాలను సరఫరా చేసింది. దీనికి సంబంధించి ఆర్ పి డిసి బెంగళూరు వారు ఎలాంటి కొరతను ప్రకటించలేదు.
***
(Release ID: 2032325)
Visitor Counter : 57