ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్ట్రియా ఛాన్సలర్ తో కలిసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉమ్మడి పత్రికా ప్రకటన
Posted On:
10 JUL 2024 5:27PM by PIB Hyderabad
యువర్ ఎక్స్ లెన్సీ, ఛాన్సలర్ కార్ల్ నెహమర్
ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులకు
నా శుభాభినందనలు
హృదయ పూర్వక స్వాగతాన్ని పలికి, ఆతిథ్యమందించినందుకు మొట్టమొదటగా ఛాన్సలర్ నెహమర్ కు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా వుంది. నా ఈ పర్యటన చారిత్రాత్మకమైనది, ప్రత్యేకమైనది. 41 సంవత్సరాల తర్వాత ఆస్ట్రియాలో పర్యటిస్తున్న భారతీయ ప్రధానిగా నాకు గుర్తింపు లభించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నేను పర్యటించడం కాకతాళీయం, సంతోషకరం.
స్నేహితులారా,
మన రెండు దేశాలు ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలనలాంటి విలువలపట్ల కలిగిన ఉమ్మడి పరస్పర నమ్మకం, ఉమ్మడి ప్రయోజనాలు మన దేశాల మధ్యన సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి. ఈ రోజున ఛాన్సలర్ నెహమర్ కు నాకు మధ్యన జరిగిన చర్చలు అర్థవంతంగా కొనసాగాయి. ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం నూతన అవకాశాలను గుర్తించాం. మన మధ్యనగల సంబంధానికి వ్యూహాత్మక మార్గాన్ని రూపొందించాలని మేం నిర్ణయించుకున్నాం. రాబోయే దశాబ్దాల్లో సహకారంకోసం బ్లూప్రింట్ తయారైంది. ఇది ఆర్థిక సహకారానికి, పెట్టుబడులకు మాత్రమే పరిమితమైంది కాదు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణ, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, నీరు, నీటి నిర్వహణ, కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికత మొదలైన రంగాలలో ఇరు దేశాలు తమ బలాలను కలుపుకుంటూ పని చేయడం జరుగుతుతుంది. ఇరు దేశాలకు చెందిన యువతను, ఆలోచనల్ని కలపడానికిగాను స్టార్టప్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం జరుగుతుంది. ఇరు దేశాల ప్రజలు అటూ ఇటూ ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించడానికిగాను వలస భాగస్వామ్య ఒప్పందాన్ని ఇప్పటికే చేసుకోవడం జరిగింది. దీనివల్ల చట్టబద్దమైన వలసలు జరుగుతాయి. నైపుణ్య మానవ వనరులను ఇరు దేశాలు పంచుకోవడం జరుగుతుంది. సాంస్కృతిక, విద్యాసంస్థల మధ్యన ఇచ్చిపుచ్చుకునే విధానానికి ప్రోత్సహం లభిస్తుంది.
స్నేహితులారా,
మనం సమావేశమైన ఈ హాలు చారిత్రాత్మకమైంది. 19వ శతాబ్దంలో ఇక్కడే చారిత్రాత్మక వియన్నా కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం యూరప్ శాంతి, సుస్థిరతలకు మార్గనిర్దేశనం చేసింది. ఛాన్సలర్ నెహమర్, నేను కలిసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణల గురించి వివరంగా చర్చించడం జరిగింది. అది ఉక్రెయిన్ లో తలెత్తిన సంఘర్ణణకావచ్చు లేదా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కావచ్చు అన్నిటి గురించి మేం చర్చించాం. ఇది యుద్ధానికి సమయం కాదు అని గతంలో నేను చెప్పాను యుద్ధరంగంలో సమస్యలు పరిష్కారం కావు. ఎక్కడైనా సరే అమాయకులు ప్రాణాలు కోల్పోవడం సమ్మతించదగ్గ విషయం కాదు. తొందరగా శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరగాలంటే చర్చలు, దౌత్యమార్గాలద్వారానే సాధ్యమని భారత్, ఇండియా స్పష్టం చేస్తున్నాయి. దీన్ని సాధించడానికిగాను మా రెండు దేశాలు అన్ని రకాల సహకారాలు అందించడానికి సిద్ధంగా వున్నాయి.
స్నేహితులారా,
ఈ రోజున మేం మానవాళి ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, ఉగ్రవాదంలాంటి సవాళ్ల గురించి కూడా మా ఆలోచనల్ని పంచుకున్నాం. వాతావరణానికి సంబంధించి భారతదేశం ప్రారంభించిన అంతర్జాతీయ సౌర వేదిక, విపత్తులను తట్టుకొనే మౌలిక సదుపాయాల కూటమి , జీవ ఇంధనాల వేదికలాంటి కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రియాకు మేం స్వాగతం పలకడం జరిగింది. మా రెండు దేశాలు కలిసి ఉగ్రవాదాన్ని గట్టిగా ఖండిస్తున్నాం. అది ఏ రూపంలో వున్నా సమ్మతించదగినదికాదు. ఏ విధంగా చూసినా దానికి చట్టబద్దత లేదు. ఐక్యరాజ్యసమితిగానీ, ఇతర అంతర్జాతీయ సంస్థలుగానీ అవి వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా , సమర్థవంతంగా పని చేయాలంటే వాటిలో సంస్కరణల అవసరం వుందని రెండు దేశాలు అంగీకరించాయి.
స్నేహితులారా,
రాబోయే నెలల్లో ఆస్ట్రియాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి , ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తరఫునుంచి , భారతీయుల తరఫునుంచి ఛాన్సలర్ నెహమర్ కు, ఆస్ట్రియా ప్రజలకు నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రెండు దేశాలకు చెందిన సీఇవోలతో మరికాసేపట్లో మాకు సమావేశముంది. ఆస్ట్రియా గౌరవ అధ్యక్షులను కలుసుకునే గౌరవం నాకు దక్కింది. ఛాన్సలర్ నెహమర్ స్నేహానికి మరొకమారు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతదేశాన్ని సందర్శించాలని ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
గమనిక: ఇది ప్రధాని ప్రకటనకు అందాసుగా చేసిన అనువాదం. ఆయన మూల ప్రకటనను హిందీలో చేశారు.
***
(Release ID: 2032324)
Visitor Counter : 73
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam