ప్రధాన మంత్రి కార్యాలయం
హత్రాస్ దుర్ఘటనపై ప్రధాని సంతాపం.. బాధితులకు పరిహారం ప్రకటన
Posted On:
02 JUL 2024 8:20PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దుర్ఘటన ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి రూ.2 లక్షలు, రూ.50,000 వంతున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారం అందిస్తమని శ్రీ మోదీ ప్రకటించారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘హత్రాస్ దుర్ఘటనలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ @narendramodi Ji ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది’’ అని తెలిపింది.
ఈ దురదృష్టకర ఉదంతంపై ప్రధాని శ్రీ మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దుర్ఘటన బాధితులందరికీ సకాలంలో అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో సంభవించిన విషాద ఉదంతంపై ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం బాధితులందరికీ అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తోంది. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారంతా వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. @myogiadityanath’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/RT
(Release ID: 2030343)
Visitor Counter : 88
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam