సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కుటుంబ పెన్షనర్ల ఫిర్యాదుల ప్రభావవంతమైన పరిష్కారం కోసం 1 జూలై 2024నాడు నెల రోజుల ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్న కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్
46 మంత్రిత్వ శాఖలు/శాఖలు 1-31 జూలై 2024 వరకు ప్రత్యేక ప్రచారంలో పాల్గొనున్నాయి, 1891 కుటుంబ పెన్షన్ ఫిర్యాదులను ప్రత్యేక ప్రచారం కింద పరిష్కరించనున్నాయి
Posted On:
30 JUN 2024 10:33AM by PIB Hyderabad
కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్, 1 జూలై 2024న న్యూఢిల్లీలో కుటుంబ పెన్షనర్ల ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దానిలో భాగంగా పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఓపి పిడబ్ల్యూ), 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక జూలై 1-31, 2024 మధ్య కాలంలో కుటుంబ పెన్షనర్ల ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం ఒక నెల రోజుల ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. ఇందులో 46 మంత్రిత్వ శాఖలు/విభాగాలు పాల్గొంటాయి. ఈ ప్రత్యేక ప్రచారం కుటుంబ పెన్షన్ ఫిర్యాదుల పెండింగ్‌ను గణనీయంగా తగ్గించాలన్నది లక్ష్యం. పెన్షన్, పెన్షనర్స్ సంక్షేమ శాఖల కార్యదర్శులు, మాజీ సైనికుల సంక్షేమం, బిఎస్ఎఫ్ డీజీ , కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 46 మంత్రిత్వ శాఖలు/విభాగాల నోడల్ పబ్లిక్ గ్రీవెన్స్ ఆఫీసర్లు, అన్ని పెన్షన్ పంపిణీ బ్యాంకుల ప్రతినిధులు, ప్రతినిధులు, పెన్షనర్ల సంక్షేమ సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
ప్రస్తుతం, సెంట్రలైజ్డ్ పెన్షన్ గ్రీవెన్స్ అండ్ రిడ్రెస్ సిస్టమ్ (సిపిఈఎన్జిఆర్ఏఎంఎస్)పై ఏడాదిలో దాదాపు 90,000 కేసులు నమోదవుతున్నాయి. ఫిర్యాదులను దరఖాస్తుదారు నేరుగా పోర్టల్ (URL:www.pgportal.gov.in/PENSION/)లో లేదా ఇ-మెయిల్, పోస్ట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-11-1960 ద్వారా వివరాల రసీదుపై డిఓపిపిడబ్ల్యూ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మొత్తం ఫిర్యాదులలో, కుటుంబ పెన్షన్ ఫిర్యాదుల కేసులు దాదాపు 20-25 శాతం ఉన్నాయి. కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల ప్రధాన విభాగం మహిళా పెన్షనర్లచే ఏర్పాటు అయింది. ప్రత్యేక ప్రచారంలో పరిష్కరించాల్సిన కుటుంబ పెన్షన్ సంబంధిత ఫిర్యాదులు సిపిఈఎన్జిఆర్ఏఎంఎస్ పోర్టల్‌లో నమోదు అయ్యే ఫిర్యాదుల నుండి షార్ట్‌లిస్ట్ చేస్తారు. (15.06.2024 నాటికి) 46 మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలకు సంబంధించిన మొత్తం 1891 కుటుంబ పెన్షన్ సంబంధిత ఫిర్యాదులు ప్రచార వ్యవధిలో పరిష్కారం కోసం గుర్తించారు. డిఫెన్స్ పెన్షనర్లు, రైల్వే పెన్షనర్లు, హోంమంత్రిత్వ శాఖ కింద సిఏపిఎఫ్ల పెన్షనర్లకు సంబంధించిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం ఉన్నాయి. బ్యాంక్ సంబంధిత సమస్యలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి. డిఓపిపిబ్ల్యూ ఒక మిషన్ మోడ్ విధానంలో ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం సంబంధిత పరిపాలనా మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్/సంస్థకు అన్ని సహాయాలను పర్యవేక్షిస్తుంది. మంత్రిత్వ శాఖలు/విభాగాలు ట్వీట్లు, పిఐబి ప్రకటనల ద్వారా విజయగాథలను ప్రచారం చేస్తాయి. ప్రచార విజయం కోసం డిఓపిపిబ్ల్యూ హ్యాష్ ట్యాగ్ #SpecialCampaignFamilyPension అందుబాటులో ఉంటుంది.
***
(Release ID: 2029836)