హోం మంత్రిత్వ శాఖ
నేడు దిల్లీలో ఎన్‌డీఆర్ఎఫ్ కు చెందిన రెండవ పర్వతారోహణ యాత్ర 'విజయ్' విజయవంతంగా తిరిగి రావడాన్ని స్వాగతించిన కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఆపరేషన్లలో వినియోగించే అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ పరికరాలు, ఛాయా చిత్ర ప్రదర్శనను సందర్శించిన హోంమంత్రి
అచంచల ధైర్యాన్ని ప్రదర్శించే మన జవాన్లు చేసే ఇటువంటి కఠినమైన ఆపరేషన్లు వ్యక్తిగతంగా, దళానికి సామర్థ్యాన్ని పెంచుతాయి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, విపత్తు నిర్వహణ కొరకు ఉపశమన కేంద్రీకృత విధానం కాకుండా ప్రాణ నష్టం లేని విధానాన్ని అవలంబిస్తున్నారు.
డయల్ 112, మౌసం, దామిని, మేఘదూత్ వంటి మొబైల్ అప్లికేషన్లు లేదా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఏవైనా మోదీ ప్రభుత్వం ఎన్‌డీఆర్ఎఫ్ కు అన్ని విధాలుగా శాస్త్రీయ విశ్వాసాన్ని అందిస్తోంది.
విజయం సాధించే అలవాటే వ్యక్తిని, దళాన్ని గొప్పవారిగా చేస్తుంది.
దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా విపత్తు వస్తే అందరూ ఎన్‌డీఆర్ఎఫ్ వైపే చూస్తారు.
పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా.., ఎన్‌డీఆర్ఎఫ్ దుస్తులు ధరించిన జవాను అక్కడ నిలబడి ఉంటే విపత్తులో చిక్కుకున్న ప్రజల మనోధైర్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది.
ఇప్పుడు 16,000 మంది ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందికి 40 శాతం చొప్పున అపాయ, కష
Posted On:
29 JUN 2024 4:07PM by PIB Hyderabad
21,625 అడుగుల ఎత్తైన మణిరంగ్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి తిరిగి వచ్చిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) 'విజయ్' యొక్క రెండవ పర్వతారోహణ యాత్రను కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా నేడు దిల్లీలో స్వాగతించారు.
హోం మంత్రి ఫోటో-విపత్తు నిర్వహణ పరికరాల గ్యాలరీని కూడా వీక్షించారు. ఎన్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది వినియోగించే అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. భారత్, టర్కీ దేశాల్లో జరిగిన వివిధ విపత్తు ప్రతిస్పందన ఘటనల్లో పాల్గొన్న టీమ్ లీడర్లు వివరణ ఇచ్చారు. వరదనీటి రెస్క్యూ, కొండచరియలు విరిగిపడటం, కూలిన నిర్మాణల వద్ద శోధన, రెస్క్యూ, కెమికల్ బయోలాజికల్ రేడియాలజికల్ న్యూక్లియర్ ప్రతిస్పందన యంత్రాంగం (సీబీఆర్ఎన్), శిఖరాల వద్ద రెస్క్యూ, బోరుబావి రెస్క్యూ, తుఫాన్ రెస్పాన్స్ తదితర అంశాల్లో ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన వివిధ ఆపరేషన్ లను తెలుసుకునేందుకు కేంద్ర హోంమంత్రి ఆసక్తి కనబరిచారు. మెరుగైన వినియోగం కోసం ఎన్డీఆర్ఎఫ్ పరికరాలను మెరుగుపర్చడంలో తీసుకున్న పలు చొరవను కూడా ఆయనకు చూపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
21,625 ఎత్తైన మణిరంగ్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన ఎన్డీఆర్ఎఫ్ జవాన్లను శ్రీ అమిత్ షా అభినందించారు. అంతటి ఎత్తైన శిఖరాలను అధిరోహించేందుకు, తిరుగులేని ధైర్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్న మన జవాన్లు చేస్తున్న ఇటువంటి కఠినమైన ఆపరేషన్లు వ్యక్తిగతంగా, దళం యొక్క సామర్థ్యాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. ఇలాంటి ప్రయాసతో కూడిన కార్యక్రమాలు లక్ష్యాలను సాధించడం, ఊహించలేని కష్టాలను జయించడం, లక్ష్యాన్ని చేరుకోవడం అలవాటు చేస్తాయని హోం మంత్రి అన్నారు. విజయపు అలవాటే ఒక వ్యక్తిని, దళాన్ని గొప్పగా మారుస్తుందని మంత్రి అన్నారు. ఒక వ్యక్తి జీవితంలో సన్మార్గంలో నడవడానికి, విజయం సాధించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఇది అతిపెద్ద వనరు అని శ్రీ అమిత్ షా అన్నారు.
నేటి ఈ ఆపరేషన్ లో కొందరు జవాన్లు విజయం సాధించారని, కానీ వాస్తవిక దృష్టిలో ఈ విజయం మొత్తం ఎన్‌డీఆర్ఎఫ్ దే అని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ జవాన్లు మణిరంగ్ పర్వత శిఖరాలను అధిరోహించడమే కాకుండా మొత్తం దళంలో మనోధైర్యాన్ని పెంపొందించడానికి కృషి చేశారని ఆయన అన్నారు. పర్వతారోహణ అనేది కేవలం ఒక నైపుణ్యం మాత్రమే కాదని, జీవించే కళ అని, ఈ కళలో ప్రావీణ్యం సంపాదించడం జీవితాంతం ఒక విద్య అని ఆయన అన్నారు. ఆపరేషన్ విజయ్‌లో విజయం సాధించిన 35 మంది సిబ్బందిని, దళానికి చిహ్నంగా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ను కేంద్ర హోంమంత్రి అభినందించారు. ఈ జవాన్లు 21,600 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం యావత్ సైన్యానికి గొప్ప విజయంగా కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా కోనియాడారు. మనం విజయ శిఖరాన్ని చేరుకోవాలంటే జీవితాంతం స్థిరమైన లక్ష్యాన్ని చేరుకోవాలని, అప్పుడే విజయం సాధించగలమని ఆయన అన్నారు.
ఒకప్పుడు భారతదేశంలో విపత్తుల పట్ల మా విధానం కేవలం ఉపశమనమే ప్రధానంగా ఉండేదని, కానీ ప్రస్తుతం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో విపత్తు నిర్వహణకు ఎలాంటి ప్రాణనష్టంలేని విధానాన్ని అవలంబిస్తున్నామని, ఉపశమన కేంద్రీకృత విధానం కాదని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
విపత్తు నిర్వహణ విధానం పరంగా ఇది తమ గొప్ప ప్రయాణమని కేంద్రమంత్రి పేర్కొన్నారు. గత పదేళ్ల ప్రధానమంత్రి మోదీ పాలనలో విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను భారత్‌లో అమలు చేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. బలమైన ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏల కూటమిని ఏర్పాటు చేయడం, బలగాల మనోధైర్యాన్ని పెంచడం, బలగాల ఏర్పాటు, తగినంత సంఖ్యలో బలగాలను సమకూర్చడం, ఇంత పెద్ద దేశంలో ప్రతిచోటా బలగాల సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడటం, విపత్తు అంచనాకు ముందస్తు సమాచారం అందించడం వంటి పనులు మోదీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో జరిగాయని మంత్రి ప్రస్తావించారు. నేడు దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఏదైనా విపత్తు సంభవిస్తే అందరూ ఎన్డీఆర్ఎఫ్ వైపు చూస్తున్నారని చెప్పారు.
విపత్తులో చిక్కుకున్న ప్రజలకు ఆ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూడటం ద్వారా వారి మనోధైర్యాన్ని అనేక రెట్లు పెంచుతుందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ పర్వతారోహణ యాత్రలో విజయం సాధించడానికి మన 35 మంది జవాన్లు కూలంకష అవగాహనతో లక్ష్యాన్ని చేరుకున్నట్లే, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా లక్ష్యానికి అనుగుణంగా మన దళం తనను తాను సమీకరించుకోవాలని ఆయన అన్నారు. సాధించడం ఎప్పుడూ సంతృప్తికి కారణం కాకూడదని..., అది మరింత క్లిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఒక కారణంగా మారాలని ఆయన అన్నారు. టర్కీ, సిరియా, బిపోర్జాయ్, మిచాంగ్, రోప్ వే సంఘటన లేదా పర్వతారోహకులను రక్షించడం, టన్నెల్ సంఘటన లేదా జపాన్ లో ట్రిపుల్ డిజాస్టర్ లేదా నేపాల్ లో భూకంపం, ఇలా..., ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడికి వెళ్లినా వారు మంచి ఫలితాలతో తిరిగి వచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని శ్రీ అమిత్ షా అన్నారు.
భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా హిమపాతాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు, తుఫాన్ వంటి ప్రమాదాలు ప్రతిచోటా పెరుగుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని సైన్స్ ద్వారా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూస్తూ, దృఢంగా ముందుకు సాగాలని కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి అన్నారు. ఇంకా అనేక రంగాల్లో మన సామర్థ్యాన్ని పెంచుకుని అటవీ కార్చిచ్చు వంటి ప్రమాదాల్లో ఉత్తమ ఫలితాలను తీసుకురావాల్సి ఉందన్నారు. అడవుల్లో మంటలు చెలరేగిన సమయంలో మనుషుల ప్రాణాలను కాపాడటం మాత్రమే తమ లక్ష్యం కాదని, అడవులను ఎలా కాపాడుకోవాలో, భూమిపై మంటలు చెలరేగకుండా ఏం చేయాలనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మేఘ విస్ఫోటనాల వల్ల వచ్చే వరదలకు మనల్ని మనం మరింత సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్ అభివృద్ధి, శిక్షణ, ఆధునిక వనరులను సమకూర్చడం కోసం మోదీ ప్రభుత్వం ఎప్పుడూ నిధుల వైపు కన్నెత్తి చూడలేదని అమిత్ షా అన్నారు. విపత్తు నిర్వహణలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచే దళాన్ని భారత్‌లో రూపొందించాలని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా విపత్తు నిర్వహణ గురించి చాలా ఆందోళన చెందుతున్నారని, అవగాహన కలిగి ఉన్నారని, ఈ రంగంలో భారతదేశం సాధించిన విజయమే దీని ఫలితమని శ్రీ అమిత్ షా అన్నారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లలో విపత్తు సహాయార్థం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ లకు రూ.66 వేల కోట్లు కేటాయించగా, 2014 నుంచి 2024 వరకు పదేళ్ల కాలానికి అది రూ.2 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. విపత్తును ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం ఎంత సన్నద్ధంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. డయల్ 112, మౌసం, దామిని, మేఘదూత్ వంటి మొబైల్ అప్లికేషన్లు లేదా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు వంటి ఎన్డీఆర్ఎఫ్ కు మోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా శాస్త్రీయ మద్దతును అందిస్తోందని కేంద్రమంత్రి అన్నారు.
ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి అపాయ, కష్ట భత్యం ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఈ డిమాండ్ ను నిన్ననే అంగీకరించినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 16,000 మంది సిబ్బందికి 40 శాతం చొప్పున అపాయ, కష్ట భత్యం లభిస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో అన్ని అవుట్డోర్, ఇండోర్ గేమ్స్ లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) బృందం పాల్గొనాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. దీనికి సంబంధించిన మొత్తం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశామని, త్వరలోనే దీని అమలుకు భారత ప్రభుత్వం ఒక నమూనాను తీసుకువస్తుందని ఆయన చెప్పారు. సీఏపీఎఫ్‌లలో క్రీడలను ఒక సంస్కృతిగా ప్రవేశపెట్టి స్థిరీకరించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
***
(Release ID: 2029615)
Visitor Counter : 80
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada