ప్రధాన మంత్రి కార్యాలయం
టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
29 JUN 2024 11:56PM by PIB Hyderabad
భారత క్రికెట్ జట్టు ఇవాళ టి20 ప్రపంచ కప్ విజేతగా నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మన జట్టు సాధించిన అపూర్వ విజయంతో యావద్దేశం గర్విస్తున్నదని పేర్కొంటూ ఒక వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ టోర్నమెంటులో ప్రతి మ్యాచ్ నీ సొంతం చేసుకుంటూ తనకు తిరుగే లేదని చాటిందన్నారు. ఆద్యంతం అప్రతిహత విజయాలతో మన జట్టు అద్భుత ప్రతిభను ప్రదర్శించిందని కొనియాడారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“చాంపియన్లు!
మన జట్టు తనదైన శైలిలో తిరుగులేని విజయాలతో టి20 ప్రపంచ కప్ ను దేశానికి కానుకగా తెస్తోంది! భారత క్రికెట్ జట్టును చూసి మేమంతా గర్విస్తున్నాం. ముఖ్యంగా విజేతను నిర్ణయించే తుది పోరు చరిత్రాత్మకం” అని ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు.
***
DS/RT
(रिलीज़ आईडी: 2029607)
आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam