ప్రధాన మంత్రి కార్యాలయం

తొలిసారి కేంద్ర సహాయ మంత్రులుగా నియమితులైన వారితో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 28 JUN 2024 10:46PM by PIB Hyderabad

   కేంద్ర మంత్రిమండలిలో తొలిసారి సహాయ మంత్రులుగా నియమితులైన వారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

దీనిపై సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా పంపిన సందేశంలో:

   "కేంద్ర మంత్రిమండలిలో తొలిసారి సహాయ మంత్రులుగా నియమితులైన వారితో సమావేశమయ్యాను. ఇప్పుడిప్పుడే పదవీ బాధ్యతలలో కుదురుకుంటున్న వారి అనుభవాలను,  అభిప్రాయాలను ఈ సందర్భంగా తెలుసుకున్నాను. అలాగే క్షేత్రస్థాయిలో పరిపాలనను మరింత బలోపేతం చేసే మార్గాలపై వారితో చర్చించాను" అని ప్రధానమంత్రి వెల్లడించారు.



(Release ID: 2029469) Visitor Counter : 9