ఉప రాష్ట్రపతి సచివాలయం
రాజ్య సభ యొక్క264 వ సమావేశం ఈ రోజు న ఆరంభం అయిన సందర్భం లో సభాధ్యక్షుడు శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ యొక్క ప్రారంభిక వ్యాఖ్యలు
Posted On:
27 JUN 2024 1:46PM by PIB Hyderabad
సభాధ్యక్షుడు: గౌరవనీయులైన సభ్యులారా, రాజ్య సభ యొక్క 264 వ సమావేశం ఆరంభం అవుతున్న సందర్భం లో మీకు అందరికీ నేను హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. లోక్ సభ కు సాధారణ ఎన్నికల తో పాటుగా నాలుగు రాష్ట్రాల విధాన సభల కు కూడాను ఎన్నికలు ఇటీవలే ముగిసిన తరువాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. భారతదేశం యొక్క ప్రజలు వోటు ను వేసేందుకు వారికి ఉన్నటువంటి హక్కు ను వినియోగించుకొని, ప్రపంచంలో అతి పెద్దదైన మన ప్రజాస్వామిక ప్రభుత్వ విధానం పట్ల మరియు మన గణతంత్రం లో పొందుపరచుకొన్నటువంటి విలువల పట్ల వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ‘ప్రజాస్వామ్యం యొక్క ఉత్సవం’ ఫలప్రదం గా ముగియడం మనకు అందరికీ అత్యంత గర్వకారణమైన విషయం, మరి ప్రశంసపాత్రమూను.
ఇటీవలి ద్వైవార్షిక ఎన్నికల అనంతరం ఈ సభ కూడా కొంత వరకు పునర్నిర్మాణానికి లోనైంది. సభ కు కొత్త గా ఎన్నికైన/సభ కు నామినేట్ అయిన 61 మంది సభ్యుల కు ఇవే అభినందన లు. సభ్యుల లో ప్రతి ఒక్కరు వారి వారి శక్తియుక్తుల ను పూర్తి స్థాయి లో ఉపయోగించి ప్రజల యొక్క ఆకాంక్షల ను నెరవేర్చే దిశ లో తోడ్పాటు ను తప్పక అందించగలరు.
రండి, ప్రజాస్వామ్యాన్ని సమృద్ధం గా చేయడానికి మనం అందరం కలసికట్టుగా పాటుపడుదాం. రండి, మనం సంభాషణ, చర్చ, వాదోపవాదాల తో కూడిన ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ కై మనమంతా తోడ్పాటు ను అందించుదాం, ప్రజాస్వామ్యం యొక్క సారం ఇదే కదా మరి.
***
(Release ID: 2029230)