ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాశీ విశ్వనాథాలయ పూర్వ మహంత్ డాక్టర్ కులపతి తివారీ మృతిపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 26 JUN 2024 8:45PM by PIB Hyderabad

   కాశీ విశ్వనాథ ఆలయ పూర్వ మహంత్ డాక్టర్ కులపతి తివారీ కన్నమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘కాశీ విశ్వనాథ ఆలయ పూర్వ మహంత్ డాక్టర్ కులపతి తివారీ శివసాయుజ్యం పొందారనే విషాదకర వార్త నన్నెంతో కలతపెట్టింది. చిరకాలం విశ్వనాథ స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూ వచ్చిన డాక్టర్ కులపతి ఇవాళ ఆ మహదేవుని సాన్నిధ్యంలో శివైక్యం చెందారు. ఆయన శాశ్వత కైలాస యాత్ర కాశీకి తీరని నష్టం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(Release ID: 2028947) Visitor Counter : 76