ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో టెలిఫోన్ద్వారా మాట్లాడిన కజాకిస్తాన్ అధ్యక్షుడు
అధ్యక్షుడు శ్రీ టోకాయెవ్ కు ఆయన అందించిన హృదయపూర్వకశుభాకాంక్షల కు గాను ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసంఇరువురు నేతలు వారి యొక్క నిబద్ధత ను పునరుద్ఘాటించారు
కజాకిస్తాన్ లో త్వరలో జరుగనున్న ఎస్‌సిఒ శిఖర సమ్మేళనం సఫలం కావడం కోసం పూర్తి సమర్థన ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
25 JUN 2024 6:07PM by PIB Hyderabad
కజాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు శ్రీ కాసిమ్-జొమార్ట్ టోకాయెవ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
ప్రపంచం లో అతి పెద్దదైన ప్రజాస్వామిక ప్రక్రియ ను విజయవంతం గా నిర్వహించినందుకు మరియు చరిత్రాత్మకమైనటువంటి రీతి లో వరుసగా మూడో పదవీ కాలాని కి గాను తిరిగి ఎన్నిక అయినందుకు ప్రధాన మంత్రి కి హృదయ పూర్వక అభినందనల ను అధ్యక్షుడు శ్రీ టోకాయెవ్ తెలియ జేశారు. దీనికి గాను ప్రధాన మంత్రి ఆయన కు ధన్యవాదాల ను పలికారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు పోవడం కోసం కలసి పని చేయడాన్ని కొనసాగించుదాం అంటూ ఉభయ నేతలు వారి వచన బద్ధత ను పునరుద్ఘాటించారు.
అస్తానా లో త్వరలో జరుగనున్న ఎస్‌సిఒ శిఖర సమ్మేళనం విజయవంతం కావడం కోసం భారతదేశం పక్షాన పూర్తి సమర్థన ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ప్రాంతీయ సహకారాన్ని పెంపొందింప చేయడం లో కజాకిస్తాన్ యొక్క నాయకత్వం మహత్వపూర్ణమైనటువంటి తోడ్పాటు ను అందిస్తుందన్న విశ్వాసాన్ని కూడ ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
నేతలు ఇద్దరు పరస్పరం సంప్రదింపుల ను కొనసాగించే అంశం లో సమ్మతి ని వ్యక్తం చేశారు.
***
(Release ID: 2028924)
Visitor Counter : 49
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam