మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు


పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌లో
మెరుగుదల,ఎన్టీఏ నిర్మాణం, పనితీరుపై సిఫార్సులు చేయడానికి కమిటీ

కమిటీ తన నివేదికను 2 నెలల్లో మంత్రిత్వ శాఖకు సమర్పించాలి

Posted On: 22 JUN 2024 3:04PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ కు చెందిన  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా పరీక్షల నిర్వహణ చేయడానికి  ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం: 

కమిటీ పరిశీలించే అంశాలు: 
* పరీక్షా విధానంలో సంస్కరణ,
* డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌లో మెరుగుదల.

* నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణం మరియు పనితీరు

కింది వారు ఉన్నత స్థాయి కమిటీకి ఛైర్మన్ మరియు సభ్యులుగా ఉంటారు.

1

డాక్టర్ కే. రాధాకృష్ణన్,

ఇస్రో మాజీ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బిఓజి చైర్మన్. 

చైర్మన్ 

2

డా. రణ్‌దీప్ గులేరియా,
మాజీ డైరెక్టర్, ఎయిమ్స్ ఢిల్లీ.

సభ్యుడు 

3

ప్రొఫెసర్ బి జె రావు,
వైస్ ఛాన్సలర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.

  సభ్యుడు  

4

ప్రొఫెసర్ రామమూర్తి కె,

ప్రొఫెసర్ ఎమెరిటస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్, ఐఐటి  మద్రాస్.

  సభ్యుడు  

5

శ్రీ పంకజ్ బన్సల్,

సహ వ్యవస్థాపకుడు, పీపుల్ స్ట్రాంగ్, 

బోర్డు సభ్యుడు- కర్మయోగి భారత్

  సభ్యుడు  

6

ప్రొ. ఆదిత్య మిట్టల్,
డీన్ స్టూడెంట్ అఫైర్స్, ఐఐటి, ఢిల్లీ

  సభ్యుడు  

7

శ్రీ గోవింద్ జైస్వాల్,
జాయింట్ సెక్రటరీ, విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 

 

సభ్య కార్యదర్శి 

 

కమిటీ ఉల్లేఖన నిబంధనలు: 

(i) పరీక్ష ప్రక్రియ యంత్రాంగంలో సంస్కరణ

(a) మొదటి నుండి చివరి వరకు (ఎండ్-టు-ఎండ్) పరీక్ష ప్రక్రియను విశ్లేషించి, వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అవకాశం ఉన్న ఎటువంటి ఉల్లంఘననైనా  నిరోధించడానికి చర్యల సూచన.

(b) ఎన్టీఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపిలు)/ప్రోటోకాల్‌లను క్షుణ్ణంగా సమీక్షించడానికి, ప్రతి స్థాయిలో సమ్మతిని నిర్ధారించడానికి పర్యవేక్షణ యంత్రాంగంతో పాటు ఈ విధానాలు/ప్రోటోకాల్‌లను బలోపేతం చేయడానికి చర్యలను సూచించడం. 

(ii) డేటా భద్రతా ప్రొటొకాల్స్ మెరుగుదల:

(a) ప్రస్తుతం ఉన్న డేటా భద్రతా ప్రక్రియలు, ఎన్టీఏ ప్రోటోకాల్‌లను మూల్యాంకనం చేయడం, దాని మెరుగుదలకు చర్యలను సిఫార్సు చేయడం.

(b) వివిధ పరీక్షల కోసం ప్రశ్నపత్రం కూర్పు, ఇతర ప్రక్రియలకు సంబంధించి ఇప్పటికే ఉన్న భద్రతా ప్రోటోకాల్‌లను పరిశీలించడానికి, సిస్టమ్ పటిష్టతను మెరుగుపరచడానికి సిఫార్సులను చేయడం.

 (iii) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణం మరియు పనితీరు : 

(a) పాయింట్ (i) మరియు (ii) కింద ఇచ్చిన సిఫార్సుల అమలు కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సంస్థాగత నిర్మాణం, పనితీరుపై సిఫార్సులు చేయడం, ప్రతి స్థాయిలో కార్యకర్తల పాత్ర, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించడం.

(b) ఎన్టీఏ ప్రస్తుత గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్‌ను అంచనా వేయడం, అభివృద్ధి చేయగల అంశాలను గుర్తించడం,  దాని సామర్థ్యాన్ని పెంచడానికి సిఫార్సులు చేయడం.   

ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి రెండు నెలల్లోగా కమిటీ తన నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించాలి.

కమిటీ తమకు సహాయం చేయడానికి ఏదైనా సబ్జెక్ట్ నిపుణుడిని కో-ఆప్ట్ చేయవచ్చు.

 

***



(Release ID: 2027972) Visitor Counter : 62