ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశ‌వ్యాప్తంగా ప్ర‌పంచ సికిల్ సెల్ వ్యాధి అవ‌గాహ‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాలు


సికిల్ సెల్ వ్యాధి నిర్ధార‌ణ కోసం 6, 15, 806 మందికి ప‌రీక్ష‌లు. 2, 59, 193మందికి సికిల్ సెల్ స్టాట‌స్ ఐడీ కార్డుల పంపిణీ

గ‌త ఏడాది సికిల్ సెల్ అనీమియా నివార‌ణ కార్య‌క్ర‌మం మొద‌లైన‌ప్ప‌టినుంచీ ఇంత‌వ‌ర‌కూ 3,39,77,877 మందికి వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌. 1,12,01,612 మందికి సికిల్ సెల్ స్టాట‌స్ ఐడీ కార్డుల పంపిణీ

జాతీయ సికిల్ సెల్ అనీమియా అవ‌గాహ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా 17 రాష్ట్రాల‌లోను, 343 జిల్లాల్లోను 44, 751 కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌.

Posted On: 20 JUN 2024 3:50PM by PIB Hyderabad

ప్ర‌పంచ సికిల్ సెల్ వ్యాధి (ఎస్ సి డి) అవ‌గాహ‌న దినోత్స‌వాన్ని జూన్ 19న దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించడంద్వారా ఈ వ్యాధిపైనా, సంక్ర‌మ‌ణ‌పైనా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రిగింది. 
 గ‌త ఏడాది సికిల్ సెల్ అనీమియా నివార‌ణ కార్య‌క్ర‌మం (ఎన్ ఎస్ సి ఏఇఎం) మొద‌లైన‌ప్ప‌టినుంచీ ఇంత‌వ‌ర‌కూ 3,39,77,877 మందికి వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లను నిర్వ‌హించి ఆ వివ‌రాల‌ను పోర్ట‌ల్ లో అప్‌లోడ్ చేయ‌డం జ‌రిగింది. 1,12,01,612 మందికి సికిల్ సెల్ స్టాట‌స్ ఐడీ కార్డులను పంపిణీ చేయ‌డం జ‌రిగింది. 
జాతీయ సికిల్ సెల్ అనీమియా అవ‌గాహ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా 17 రాష్ట్రాల‌లోను, 343 జిల్లాల్లోను 44, 751 కార్య‌క్ర‌మాలను ఎన్ ఎస్ సి ఏ ఇఎం ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సికిల్ సెల్ వ్యాధి నిర్ధార‌ణ కోసం 6, 15, 806 మందికి ప‌రీక్ష‌లు చేశారు. 2, 59, 193మందికి సికిల్ సెల్ స్టాట‌స్ ఐడీ కార్డులను పంపిణీ చేయ‌డం జ‌రిగింది. 
సికిల్ సెల్ వ్యాధిని నివారించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వానికి వున్న చిత్త‌శుద్ధిని ప్ర‌ధాని శ్రీన‌రేంద్ర‌మోదీ మ‌రొక‌సారి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ వ్యాధిపై ప్ర‌జ‌ల్లో త‌గిన అవ‌గాహ‌న పెంచుతున్నామ‌ని, సార్వ‌త్రిక రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను చేస్తున్నామ‌ని అన్నారు. ప్రారంభ‌ద‌శ‌లోనే గుర్తించ‌డం, స‌రైన చికిత్స‌లు చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. వీటిపైన ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని అన్నారు. ఈ రంగంలో సాంకేతిక‌త సామ‌ర్థ్యాన్ని ఉప‌యోగించ‌డంపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింద‌ని అన్నారు. 

సికిల్ సెల్ వ్యాధిపై పోరాటంలో ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి జెపి న‌డ్డా వివ‌రించారు. ప్ర‌గ‌తి సాధించ‌డంద్వారా ఆశాభావాన్ని క‌లిగించ‌డం, ప్ర‌పంచ సికిల్ సెల్ భ‌ద్ర‌త‌, చికిత్స‌ల్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంఅనే విధానం ద్వారా ప్ర‌భుత్వం ముందుకు పోతోంద‌ని అన్నారు. ప్రారంభ‌ద‌శ‌లోనే వ్యాధి నిర్ధార‌ణ‌, చికిత్స‌ల అందుబాటు, చికిత్స‌ల నాణ్య‌త త‌దిత‌ర అంశాల్లో ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. 
సికిల్ సెల్ వ్యాధి తీవ్ర‌త వున్న 17 రాష్ట్రాలకు చెందిన 343 జిల్లాల్లో జులై 3వ‌ర‌కూ అంటే 15 రోజుల‌పాటు అవ‌గామ‌న కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతాయ‌ని అధికారులు తెలిపార‌రు. రాబోయే 15 రోజుల్లో ప‌దిల‌క్ష‌ల మందికి వ్యాధినిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయాల‌ని 3 ల‌క్ష‌ల మందికి సికిల్ సెల్ స్టాట‌స్ ఐడీ కార్డుల‌ను పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. 
.....
బిహార్ సివాన్, మ‌హారాజ్ గంజ్ స‌బ్ డివిజ‌న్ ఆసుప‌త్రిలో  స్థానికుల‌కు సికిల్ సెల్ వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి క్యాంపుల్ని నిర్వ‌హించారు

జిల్లా స్థాయి కార్య‌క్ర‌మాల‌ద్వారా గ‌రిష్ట స్థాయిలో రోగుల‌కు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్ర‌జావ‌గాహ‌న కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తున్నారు. వీటితోపాటు నాణ్య‌మైన చికిత్స‌లు, ఫాలో అప్‌ల‌పైన ప్ర‌త్యేకంగా కృషి చేస్తున్నారు. 
గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ చేప‌ట్టిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌కు స‌హ‌కారం అందించ‌డం ఈ కార్య‌క్ర‌మాల కీల‌క‌మైన ల‌క్ష్యాల్లో ఒక‌టి. 
పైన తెలియ‌జేసిన ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికిగాను కింద తెలియ‌జేసిన రాష్ట్ర‌స్థాయి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌:   దిందోరి జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి , గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 11వేల మంది త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. 

ఛ‌త్తీస్ గ‌ఢ్ :   రాయ‌పూర్ జిల్లాలోని బీమ్‌రావ్ అంబేద్క‌ర్ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాలలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాన్ని ఛ‌త్తీస్ గ‌ఢ్ ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి, గిరిజ‌న‌శాఖ మంత్రి పాల్గొన్నారు. 

రాయ‌పూర్ లో ప్ర‌పంచ సికిల్ సెల్ అవ‌గాహ‌న దినోత్స కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఛ‌త్తీస్ గ‌ఢ్ ముఖ్య‌మంత్రి

క‌ర్నాట‌క :   మైసూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్ర‌పంచ సికిల్ సెల్ అవ‌గాహ‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన కర్నాట‌క ఆరోగ్య‌శాఖ మంత్రి 

జార్ఖండ్ :  రాంఛీ జిల్లాలో ప్ర‌పంచ సికిల్ సెల్ అవ‌గాహ‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను  ప్రారంభించిన ఆరోగ్య‌శాఖ మంత్రి 

జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సికిల్ సెల్ అనీమియా వ్యాధి నిర్ధార‌ణ క్యాంప్‌

ఇంకా ఇత‌ర రాష్ట్రాల‌లో ప‌లువురు మంత్రులు, ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. 

గుజ‌రాత్లో ప్ర‌పంచ సికిల్ సెల్ అవ‌గాహ‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. 

ఉత్త‌రాఖండ్‌లో సికిల్ సెల్ అనీమియా వ్యాధి నిర్ధార‌ణ ఆరోగ్య శిబిరాన్ని నిర్వ‌హించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తిరుప‌తి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఎన్ ఆర్ ఇజిఎస్ కూలీల‌కు సికిల్ సెల్ వ్యాధి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. 

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో సికిల్ సెల్ అవ‌గాహ‌న శిబిరాన్ని నిర్వ‌హించారు. 

నేప‌థ్యం : 
 సికిల్ సెల్ వ్యాధి అనేది జ‌న్యుప‌రంగా సంక్ర‌మించే ర‌క్త‌సంబంధిత‌ వ్యాధి. ర‌క్తంలో అసాధార‌ణ రీతిలో ఎర్ర‌ర‌క్త క‌ణాలు త‌యార‌వ్వ‌డం జ‌రుగుతుంది. ఇవి కొడ‌వ‌లి ఆకారంలోనో లేదా నెల‌వంక ఆకారంలోనో వుంటాయి. ఇలాంటి ర‌క్త‌క‌ణాలు ర‌క్త‌నాళాల్లో ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగా జ‌ర‌గ‌కుండా అడ్డంకులుగా త‌యార‌వుతాయి. త‌ద్వారా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది ఈ వ్యాధి బారిన ప‌డ్డారు. ఇండియాలో గిరిజ‌న ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఎక్కువ‌గా ఈ వ్యాధి వ‌స్తోంది. 

ఈ వ్యాధిపై పోరాటంలో భాగంగా గ‌త ఏడాది జులై 1న జాతీయ సికిల్ సెల్ అనీమియా నివార‌ణ కార్య‌క్రమాన్ని ( ఎన్ ఎస్ సి ఏ ఇ ఎం) మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని షాదోల్ లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. 2047 నాటికి సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా లేకుండా చేయాల‌నే సంక‌ల్పంతో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్రమంద్వారా వ్యాధిగ్ర‌స్తుల‌కు నాణ్య‌మైన చికిత్స‌ల‌ను, అందుబాటు ధ‌ర‌ల్లో అందిస్తున్నారు. చికిత్స‌ల‌ను అంద‌రికీ అందుబాటులోకి తెస్తున్నారు. దేశంలో సికిల్ సెల్ వ్యాధి తీవ్రత అధికంగా వున్న రాష్ట్రాలు 17 వున్నాయ‌ని గుర్తించారు. అవి గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, రాజస్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిషా, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, అస్సాం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌, బిహార్‌, ఉత్త‌రాఖండ్‌. 
ఈ కార్య‌క్ర‌మంద్వారా 40 సంవ‌త్స‌రాల‌లోపువారికి వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఈ వ్యాధి ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డానికి, ఆయా కుటుంబాల‌ను ఆదుకోవ‌డానికి ఈ కార్యక్ర‌మంద్వారా కృషి చేస్తున్నారు. ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం క‌లిసి స‌హ‌కరించుకోవ‌డంద్వారా ఈ వ్యాధిని నివారిస్తున్నారు. 

***



(Release ID: 2027328) Visitor Counter : 30