హోం మంత్రిత్వ శాఖ
లాహౌల్ & స్పీతి లో ఒక రక్షణ కార్యకలాపాన్ని నిర్వహించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుకు చెందిన మౌంటెన్ రెస్క్యూ టీము ను ప్రశంసించి న దేశీయ వ్యవహారాలు మరియు సహకారంశాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్
మన సాహసికులైన హిమవీరుల ను చూస్తే గర్వం గా ఉంది: హోం మంత్రి
పారాగ్లయిడింగ్ లో పాల్గొని ప్రమాదవశాత్తు ప్రాణాల నుకోల్పోయిన అమెరికా పౌరుని పార్థివ శరీరాన్ని తిరిగి వెనుక కు తీసుకు రావాలన్న ఒక మానవీయఆశయం తో, 14,800 అడుగుల ఎత్తయినప్రాంతాని కి చేరుకోవడానికి ప్రాణాల ను పణం గా పెట్టిన ఐటిబిపి జట్టు సభ్యులు
మానవత పట్ల ఐటిబిపి ప్రదర్శించిన సమర్పణ భావంప్రశంసనీయమైంది గా ఉంది:శ్రీ అమిత్ శాహ్
Posted On:
18 JUN 2024 1:32PM by PIB Hyderabad
లాహౌల్ & స్పీతి లో ఒక రక్షక కార్యక్రమం లో పాలుపంచుకొన్న ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటిబిపి) యొక్క పర్వత ప్రాంత రక్షక బృందం సఫలం అయినందుకు దేశీయ వ్యవహారాలు మరియు సహకార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ ప్రశంసల ను వ్యక్తం చేశారు.
శ్రీ అమిత్ శాహ్ ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘మన సాహసికులైన హిమవీరుల ను చూస్తే గర్వంగా ఉంది. ఐటిబిపి పర్వత ప్రాంత రక్షక బృందం సవాలు తో కూడినటువంటి ఒక శోధన కార్యకలాపాన్ని ఇటీవల లాహౌల్ & స్పీతి లోని ఉన్నత పర్వత శిఖరాల లో చేపట్టింది. పారాగ్లయిడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాల ను కోల్పోయిన అమెరికన్ భౌతిక కాయాన్ని వెనుక కు తీసుకు రావడం కోసం వారు శ్రమించారు. స్థానిక పాలన యంత్రాంగం అభ్యర్థించిన మీదట ఐటిబిపి జట్టు సభ్యులు వారి ప్రాణాల నైనా లెక్క చేయకుండా వారి లోపలి మానవీయ పక్షాన్ని చాటుకొంటూ ముందడుగు ను వేసి పర్వత ప్రాంతాల లో 14,800 అడుగుల ఎత్తు కు చేరుకొని మృతుని పార్థీవ శరీరాన్ని అక్కడ కనుగొని తిరిగి వెనుకకు తీసుకు వచ్చారు. మానవ జాతి పట్ల వారు ప్రదర్శించిన సమర్పణ భావం ప్రశంసనీయం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2026213)
Visitor Counter : 77