ప్రధాన మంత్రి కార్యాలయం

జూన్18వ మరియు 19వ తేదీల లో ఉత్తర్ ప్రదేశ్ ను మరియు బిహార్ ను సందర్శించనున్న ప్రధానమంత్రి


ఉత్తర్ప్రదేశ్ లో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో పాలుపంచుకోనున్న  ప్రధాన మంత్రి

20,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పిఎమ్ కిసాన్ యొక్క 17వ కిస్తు ను విడుదల చేయనున్న ప్రధాన మంత్రి

30,000మంది కి పైగా స్వయం సహాయ సమూహాల కు చెందిన మహిళల కు కృషి సఖిలు గా సర్టిఫికెట్ లనుఇవ్వనున్న ప్రధాన మంత్రి

బిహార్ లో నాలందా విశ్వవిద్యాలయం కేంపసు ను ప్రారంభించనున్నప్రధానమంత్రి 

Posted On: 17 JUN 2024 9:52AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2024వ సంవత్సరం జూన్ 18వ తేదీ మరియు జూన్ 19వ తేదీ లలో ఉత్తర్ ప్రదేశ్, ఇంకా బిహార్ లను సందర్శించనున్నారు.

 

జూన్ 18వ తేదీ నాడు సాయంత్రం పూట 5 గంటల ప్రాంతం లో ప్రధాన మంత్రి ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో పిఎమ్ కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో పాలుపంచుకోనున్నారు. రాత్రి పూట దాదాపు గా 7 గంటల వేళ లో, దశాశ్వమేధ్ ఘాట్ లో గంగ ఆరతి కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి చూస్తారు. రాత్రి సుమారు 8 గంటల వేళ లో ఆయన కాశీ విశ్వనాథ్ ఆలయం లో జరిగే పూజ మరియు దైవ దర్శనం కార్యక్రమాల లో పాలుపంచుకొంటారు.

 

జూన్ పంతొమ్మిదో తేదీ న ఉదయం పూట దాదాపు గా 9 గంటల 45 నిముషాల వేళ లో, ప్రధాన మంత్రి నాలందా లో శిథిలాల ను సందర్శించనున్నారు. ఉదయం పదిన్నర గంటల వేళ లో బిహార్ లోని రాజ్ గీర్ లో గల నాలందా విశ్వవిద్యాలయం కేంపసు ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.

 

 

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాన మంత్రి పదవి ప్రమాణాన్ని స్వీకారించిన తరువాత అన్నిటి కంటే ముందు రైతు ల సంక్షేమం పట్ల ప్రభుత్వం వచనబద్ధత ను దృష్టి లో పెట్టుకొని ‘పిఎమ్ కిసాన్ నిధి’ యొక్క 17వ కిస్తు ను విడుదల చేసే ఫైల్ పైన సంతకం చేశారు. ఈ వచనబద్ధత కు కొనసాగింపు గా, ఇంచుమించు 9.26 కోట్ల మంది లబ్ధిదారు రైతులకు ప్రత్యక్ష ప్రయోజన బదలీ ద్వారా 20,000 కోట్ల రూపాయల కు పైచిలుకు మొత్తం తో కూడినటువంటి 17వ కిస్తు నిధుల ను ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పిఎమ్-కిసాన్) లో భాగం గా ప్రధాన మంత్రి విడుదల చేస్తారు. ఇంత వరకు, అర్హత కలిగిన 11 కోట్ల మంది కి పైగా కర్షక కుటుంబాలు 3.04 లక్షల కోట్ల రూపాయల కు పైచిలుకు ప్రయోజనాల ను ‘పిఎమ్ కిసాన్’ లో భాగం గా అందుకొన్నాయి.

 

ఇదే కార్యక్రమం లో, స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి స్)కు చెందిన 30,000 మంది కి పైగా మహిళల కు కృషి సఖిల సర్టిఫికెట్ లను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేయనున్నారు.

 

పల్లె ప్రాంతాల మహిళల కు శిక్షణ ను ఇవ్వడం ద్వారాను మరియు కృషి సఖి అనే సర్టిఫికెట్టు ను వారికి ఇవ్వడం ద్వారాను వారిని పేరా ఎక్స్ టెన్శన్ వర్కర్ లు గా మలచి సాధికారిత ను కల్పించి గ్రామీణ భారతదేశం లో పరివర్తన ను తీసుకు రావాలనేది కృషి సఖి కన్వర్ జెన్స్ ప్రోగ్రామ్ (కెఎస్ సిపి) లక్ష్యం గా ఉంది. ఈ సర్టిఫికేశన్ కోర్సు ‘లఖ్ పతి దీదీ’ (లక్షాధికారి సోదరీమణి) కార్యక్రమం లో ఒక భాగం గాను మరియు పూరకం గాను ఉంది కూడాను.

 

బిహార్ లో ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి తన బిహార్ సందర్శన లో భాగం గా రాజ్ గీర్ లో నాలందా విశ్వవిద్యాలయం యొక్క క్రొత్త పరిసరాల ను ప్రారంభించనున్నారు.

 

భారతదేశం మరియు ఈస్ట్ ఏశియా సమిట్ (ఇఎఎస్) దేశాల మధ్య సంయుక్త సహకార కార్యక్రమాల లో ఒక కార్యక్రమం గా ఈ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని సంకల్పించడమైంది. ఈ విశ్వవిద్యాలయం ప్రారంభ కార్యక్రమానికి 17 దేశాల ప్రముఖులు సహా అనేక మంది విశిష్ట వ్యక్తులు పాలుపంచుకోనున్నారు.

 

కేంపస్ లో నలభై తరగతి గదుల తో రెండు అకాడమిక్ బ్లాకుల ను ఏర్పాటు చేయడమైంది. వీటి మొత్తం సీటింగ్ సామర్థ్యం ఇంచుమించు 1900 గా ఉంది. కేంపస్ లో ఒక్కొక్కటి 300 సీట్ల సామర్థ్యం కలిగిన రెండు సభాభవనాలు ఉన్నాయి.

 

దీనిలో దాదాపు 550 మంది విద్యార్థుల కు సరిపడే ఒక వసతి గృహం కూడా ఉంది. ఇక్కడ ఒక ఇంటర్ నేశనల్ సెంటర్, 2000 మంది వరకు కూర్చొనగలిగినటువంటి ఎంఫీథియేటర్ వ్యవస్థ, ఫేకల్టి క్లబ్ మరియు క్రీడా భవన సముదాయం వంటి వాటితో కూడిన సదుపాయాలు అనేకం కూడా ఇక్కడ ఉన్నాయి.

 

ఈ కేంపసు ను ‘నెట్ జీరో’ గ్రీన్ కేంపస్ గా దిద్దితీర్చడమైంది. సోలర్ ప్లాంటు, గృహ సంబంధి మరియు త్రాగునీటి శుద్ధి ప్లాంటు, వ్యర్థ జలాల ను ప్రక్షాళన చేయడం ద్వారా ఆ నీటి ని తిరిగి వినియోగించుకొనేందుకు తోడ్పడే ఒక వాటర్ రీసైకిలింగ్ ప్లాంటు, వంద ఎకరాల విస్తీర్ణం లో జలాశయాలు, ఇంకా బోలెడన్ని ఇతర పర్యావరణ మిత్రపూర్వకమైన సదుపాయాల ను ఇక్కడ నెలకొల్పడమైంది.

 

చరిత్ర తో గాఢమైన అనుబంధం ఈ విశ్వవిద్యాలయానికి ఉన్నది. దాదాపు గా 1600 సంవత్సరాల క్రిందట స్థాపించినటువంటి సిసలు నాలందా విశ్వవిద్యాలయం ప్రపంచంలో ప్రథమ ఆవాస సహిత విశ్వవిద్యాలయాలలో ఒకటి గా ఉండింది.

నాలందా యొక్క శిథిలాల ను ఐక్య రాజ్య సమితి వారసత్వ స్థలాల లో ఒకటి గా 2016 వ సంవత్సరం లో ప్రకటించడమైంది.

 

 

***

 



(Release ID: 2025876) Visitor Counter : 34