హోం మంత్రిత్వ శాఖ

అమర్‌నాథ్ యాత్ర భద్రత, లాజిస్టిక్స్ ఏర్పాట్లపై కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం


యాత్ర కోసం భద్రతా సిబ్బందిని తగినంతగా మోహరించి, అప్రమత్తంగా ఉండాలని భద్రతా సంస్థలను ఆదేశించిన కేంద్ర హోం మంత్రి


సుస్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ రెస్పాన్స్ మెకానిజంతో సహా సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్ల కోసం ఇంటర్-ఏజెన్సీ సమన్యయం పూర్తిగా ఉండాలని హోం మంత్రి నొక్కి చెప్పారు


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో… భక్తులకు సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని అనుభూతిని అందించడానికి, అమర్‌నాథ్ యాత్ర నిర్వహణలో పర్యావరణ అనుకూలమైన విధానాలను అనుసరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిష్ షా అన్నారు.


అమర్‌నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమౌతుంది. యాత్రను సజావుగా నిర్వహించేందుకు జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.


అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు సులభంగా పవిత్ర దర్శనం చేసుకునేలా చూడటం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత.

Posted On: 16 JUN 2024 8:21PM by PIB Hyderabad

అమర్‌నాథ్ యాత్రకు భద్రత, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమీక్షించడానికి కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో సహా సీనియర్ ఆర్మీ అధికారులు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (నియమించిన) లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సీఏపీఎఫ్స్ డైరెక్టర్ జనరల్… జమ్మూకశ్మీర్ ఛీఫ్ సెక్రటరీ,డీజీపీ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

 

C:\Users\admin\Desktop\HM\16.06.2024\1.JPG



అమర్ నాథ్ యాత్ర విషయంలో భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, తగినంత భద్రతా సిబ్బందిని మోహరించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్ల కోసం సుస్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ రెస్పాన్స్ మెకానిజంతో సహా సంపూర్ణ ఇంటర్ ఏజెన్సీ సమన్వయం కలిగి ఉండాలని ఆయన ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని అనుభూతిని కల్పించేందుకు  ప్ర‌ధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని… అమర్‌నాథ్ యాత్ర నిర్వహణలో పర్యావరణ అనుకూల విధానాలను అవలంభించాలని అమిత్ షా తెలిపారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పవిత్ర దర్శనం కల్పించడం మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతని ఆయన అన్నారు.

C:\Users\admin\Desktop\HM\16.06.2024\2.JPG



కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా, భక్తులకు సౌకర్యవంతంగా చేయడానికి గణనీయ కార్యక్రమాలను చేపట్టింది. గతేడాది 4.5 లక్షల మందికి పైగా భక్తులు ఈ పవిత్ర యాత్ర చేపట్టారు. ఈ ఏడాది జూన్ 29న యాత్ర ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్, వాహనాల కదలిక, క్యాంపింగ్ సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేయడం.. విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ ఫోన్ కనెక్టివిటీతో పాటు యాత్రను సజావుగా నిర్వహించడానికి జమ్ముకశ్మీర్ పరిపాలనా యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.

***



(Release ID: 2025834) Visitor Counter : 33