ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఇండియన్ కస్టమ్స్ పేరుతో జరుగుతున్న మోసాలపై సీబీఐసీ అవగాహన కార్యక్రమం


మోసగాళ్ల వ్యవహార శైలిని గుర్తించాలని, వారి సమాచారాన్ని దాచాలని, కాల్ చేసిన వారి పూర్వాపరాలను తెలుసుకుని, అప్రమత్తంగా ఉండటం ద్వారా మోసపూరిత చర్యలను ప్రజలు నివేదించాలని కోరిన సిబిఐసి

Posted On: 16 JUN 2024 12:15PM by PIB Hyderabad

ఇండియన్ కస్టమ్స్ అధికారులుగా నటిస్తూ మోసపూరిత వ్యక్తులు ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దేశవ్యాప్తంగా మోసం చేస్తున్న వివిధ సంఘటనలు న్యూస్ పోర్టల్స్/ సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ మోసాలను ప్రధానంగా ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ వంటి డిజిటల్ పద్దతులను ఉపయోగించి చేస్తున్నారు.  ప్రజల్లో భయాన్ని నింపడం అనే తక్షణ చర్యల ద్వారా మోసపూరిత వ్యక్తులు డబ్బు రాబడుతున్నారు.

 

ఈ తరహా మోసాలను ప్రజలు ఎదుర్కునేందుకుకేంద్ర పరోక్ష పన్నులుకస్టమ్స్ బోర్డు (సిబిఐసి) బహుళ-నమూనా అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులో కింద పేర్కొన్న ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి:

 

  • వార్తాపత్రిక ప్రకటనలు
  • సాధారణ పౌరులకు ఎస్‌ఎంఎస్/ఇమెయిల్‌లు
  • సామాజిక మాధ్యమాల్లో క్యాంపెయిన్‌లు

 

ఈ అంశంపై అవగాహన కల్పించడానికి స్థానిక సంస్థలువాణిజ్య సంస్థల సమన్వయంతో దేశవ్యాప్తంగా సిబిఐసి ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.

 

ప్రజలు ఈ తరహా మోసాలకు గురికాకుండా తమను తాము రక్షించుకునేందుకు ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సిబిఐసి ప్రజలకు సలహాలు ఇస్తోంది:

 

పరిశీలన: భారత కస్టమ్స్ అధికారులు ప్రైవేట్ ఖాతాల్లో పన్ను చెల్లింపు కోసం సాధారణ ప్రజలను ఫోన్ కాల్ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా సంప్రదించరు. మీరు మోసాన్ని గుర్తించినట్లయితే లేదా ఏదైనా అవకతవకలను ఎదుర్కొన్నట్లయితే కాల్ లకు స్పందించకండి. ఎస్‌ఎంఎస్ సందేశాలకు ఎప్పుడూ ప్రతిస్పందించవద్దు.

సంరక్షణ: వ్యక్తిగత సమాచారాన్ని (పాస్‌వర్డ్‌లుసివివిఆధార్ నంబర్.. మొదలైనవి) ఎవరితోనూ పంచుకోవద్దుబహిర్గతం చేయవద్దు లేదా వారి గుర్తింపునుచట్ట సమ్మతిని ధృవీకరించకుండా తెలియని వ్యక్తులు లేదా సంస్థలకు డబ్బు పంపవద్దు.

ధ్రువపరుచు: భారతీయ కస్టమ్స్ నుండి వచ్చే అన్ని ప్రసారాలను డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబరు (డిఐఎన్) కలిగి ఉంటాయిదీనిని సిబిఐసి వెబ్‌సైట్‌లో ధృవీకరించవచ్చు:

https://esanchar.cbic.gov.in/DIN/DINSearch   

 

నివేదిక: మోసపూరిత సమాచారాన్ని తక్షణమే ఈ సైట్ ద్వారా నివేదించండి: www.cybercrime.gov.in లేదా 1930 హెల్ప్‌లైన్ నంబర్ కి కాల్ చేసి నివేదించండి.

 

మోసగాళ్లు ఉపయోగించే పలు సాధారణ పద్ధతులు:

ఫేక్ కాల్స్/ ఎస్ఎంఎస్: మోసపూరిత వ్యక్తులు కొరియర్ అధికారులు లేదా సిబ్బందిగా నటిస్తూకస్టమ్స్ నుంచి ఒక ప్యాకేజీ లేదా పార్శిల్ కలిగి ఉన్నట్లుగా...దానిని విడుదల చేసేందుకు కస్టమ్స్ సుంకాలు లేదా పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కాల్స్ఎస్‌ఎంఎస్ సందేశాలు లేదా ఇమెయిల్స్ ద్వారా సంప్రదిస్తారు.

ఒత్తిడి పెట్టించే వ్యూహాలు: కస్టమ్స్ / పోలీస్ / సిబిఐ అధికారుల వేషధారణలో మోసగాళ్లు విదేశాల నుండి పొందిన ప్యాకేజీలకు కస్టమ్స్ క్లియరెన్స్ అవసరమని/ బహుమతులకు కస్టమ్స్ సుంకం / క్లియరెన్స్ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఇలా ఎంపిక చేయబడిన వ్యక్తులను తమ వస్తువుల విడుదల కోసం చెల్లింపులు చేయాల్సిందిగా అడుగుతారు.

డబ్బు డిమాండ్: చట్టవిరుద్ధమైన వస్తువులు (మాదకద్రవ్యాలు / విదేశీ కరెన్సీ / నకిలీ పాస్‌పోర్ట్ / నిషేధిత వస్తువులు వంటివి) లేదా కస్టమ్స్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఎంపిక చేయబడ్డ వ్యక్తులకు వారి ప్యాకేజీని కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందిస్తారు. మోసగాళ్లు చట్టపరమైన చర్యలు లేదా జరిమానాలు విధిస్తామని బెదిరిస్తారు. సమస్యను పరిష్కరించడానికి డబ్బులను డిమాండ్ చేస్తారు.

***

 


(Release ID: 2025833) Visitor Counter : 50