ప్రధాన మంత్రి కార్యాలయం
జి7 సమిట్ సందర్భం లో జపాన్ యొక్క ప్రధాని తోసమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
14 JUN 2024 11:55PM by PIB Hyderabad
ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ యొక్క ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.
ప్రధాన మంత్రి చరిత్రాత్మకమైన రీతి లో వరుసగా మూడో సారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు అభినందనయుక్త శుభాకాంక్షల ను తెలిపిన జపాన్ యొక్క ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా కు ప్రధాన మంత్రి ధన్యవాదాలను పలికారు. జపాన్ తో ద్వైపాక్షిక సంబంధాలు తన మూడో పదవీకాలం లోనూ ప్రాధాన్యాన్ని అందుకొంటూనే ఉంటాయి అని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం-జపాన్ విశిష్ట వ్యూహాత్మక మరియు ప్రపంచ స్థాయి భాగస్వామ్యం పదో సంవత్సరం లో ఉందని ఇద్దరు నేతలు గమనించడం తో పాటు ఈ సంబంధాలలో చోటు చేసుకొన్న పురోగతి కి సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారు సరిక్రొత్త రంగాలతో పాటు క్రొత్తగా ఉనికి లోకి వస్తున్నటువంటి రంగాల ను జతపరచుకోవడం మరియు బి2బి, ఇంకా పి2పి సంబంధి సహకారాన్ని పటిష్టపరచుకోవడం సహా సహకారాన్ని విస్తృతపరచుకొనే పద్ధతుల ను గురించి చర్చ జరిపారు.
భారతదేశం మరియు జపాన్ అనేక ముఖ్య రంగాల లో సహకరించుకొంటున్నాయి. ఆ రంగాల లో ప్రతిష్ఠాత్మకమైన ముంబయి-అహమదాబాదు హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టు భారతదేశం లో తదుపరి దశ గతిశీలత ను ప్రవేశపెట్టనున్నది. 2022-2027 మధ్య కాలం లో భారతదేశం లో 5 ట్రిలియన్ యెన్ (జపాన్ కరెన్సీ) విలువైన జపాన్ పెట్టుబడులు తరలి రానున్నాయి. భారతదేశం-జపాన్ ఇండస్ట్రియల్ కాంపిటీటివ్ నెస్ పార్ట్ నర్ శిప్ యొక్క ధ్యేయం మన తయారీ సహకారం రూపురేఖల లో పెను మార్పులను తీసుకు రావడం గా ఉంది. ప్రధానులిద్దరి మధ్య జరిగిన ఈ సమావేశం సహకారానికి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కార్యాలలో కొన్నిటిని సమీక్షించే అవకాశాన్ని ప్రసాదించింది.
ఇరువురు నేతలు వారి యొక్క చర్చ ను భారతదేశం, జపాన్ ల మధ్య తదుపరి వార్షిక శిఖర సమ్మేళనం సందర్భం లో కొనసాగించాలన్న ఉత్సుకత ను వ్యక్తం చేశారు.
**
(Release ID: 2025800)
Visitor Counter : 77
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam