ప్రధాన మంత్రి కార్యాలయం

జి7 సమిట్ సందర్భం లో ఫ్రాన్స్ అధ్యక్షుని తోసమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 14 JUN 2024 4:28PM by PIB Hyderabad

ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రెంచ్ రిపబ్లిక్ యొక్క అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి వరుసగా మూడోసారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షల ను అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ తెలియజేసినందుకు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

ఇద్దరు నేత లు హరైజన్ 2047’ మార్గసూచీ మరియు ఇండో-పసిఫిక్ మార్గసూచీ లపై ప్రత్యేకం గా దృష్టి ని కేంద్రీకరిస్తూ, భారతదేశం-ఫ్రాన్స్ ల మధ్య పరస్పర సంబంధాల ను సమీక్షించారు. ఈ చర్చల లో రక్షణ, పరమాణు, అంతరిక్షం, విద్య, జలవాయు సంబంధి కార్యాచరణ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ లతో పాటు నేశనల్ మ్యూజియమ్ విషయం లో భాగస్వామ్యం వంటి సాంస్కృతిక కార్యక్రమం మరియు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల ను వృద్ధి చెందింప చేయడం లో సహకారం వంటి అంశాలు చోటు చేసుకొన్నాయి. వారు మేక్ ఇన్ ఇండియాపై మరింత శ్రద్ధ ను తీసుకోవడం తో పాటు వ్యూహాత్మక రక్షణ సంబంధి సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు సమ్మతించారు.

 

ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), కీలకమైన మరియు క్రొత్తగా ఉనికి లోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలు, శక్తి మరియు క్రీడల రంగం లో సహకారాన్ని విస్తరించుకోవాలని కూడా వారు అంగీకరించారు. 2025 వ సంవత్సరం లో ఫ్రాన్స్ లో జరుగనున్న ఎఐ సమిట్ ను మరియు యునైటెడ్ నేశన్స్ ఓశన్స్ కాన్ఫరెన్స్ ను దృష్టి లో పెట్టుకొని కలసి పని చేయాలని సమ్మతించారు.

 

కీలకమైన ప్రపంచ అంశాలను గురించి మరియు ప్రాంతీయ అంశాల ను గురించి కూడా నేతలు ఇద్దరు వారి అభిప్రాయాల ను ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు. భారతదేశాని కి మరియు ఫ్రాన్స్ కు మధ్య ఒక బలమైన మరియు విశ్వసనీయమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవడం స్థిరమైనటువంటి మరియు సమృద్ధమైనటువంటి గ్లోబల్ ఆర్డర్ కోసం కీలకం అని వారు స్పష్టం చేస్తూ, మరి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాల కు చేర్చడం కోసం కలిసికట్టుగా పనిచేద్దామని సమ్మతిని వ్యక్తం చేశారు.

 

త్వరలో జరుగనున్న పేరిస్ ఒలింపిక్ మరియు పారాలింపిక్ గేమ్స్ కు గాను అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

***



(Release ID: 2025415) Visitor Counter : 39