కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కమ్యూనికేషన్ల మంత్రిగా శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా బాధ్యతల స్వీకారం

Posted On: 11 JUN 2024 5:06PM by PIB Hyderabad

కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిగా శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా నేడు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశం యావత్తు నిడివిలోను, వైశాల్యంలోను అనుసంధానం అవుతున్న నేటి యుగంలో టెలీ కమ్యూనికేషన్ల శాఖ (డాట్), ఇండియా పోస్ట్  ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో నాకు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ కేటాయించడం ప్రత్యేక గౌరవం. గత పదేళ్ల కాలంలో మా ప్రభుత్వం ఈ రంగాన్ని ఎంతో పరివర్తన చేసింది. భారతదేశాన్ని కస్టమర్ ప్రాధాన్యత ఇచ్చే సుస్థిరమైన, పోటీ సామర్థ్యం గల టెలీకమ్యూనికేషన్లు, పోస్టల్ మార్కెట్ గా తీర్చి దిద్దుతానని నేను పటిష్ఠమైన కట్టుబాటు ప్రకటిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

టెలీ కమ్యూనికేషన్ల రంగంలో విప్లవం తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీదేనంటూ 140 కోట్ల మంది భారత పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా టెలీ కమ్యూనికేషన్ సేవలందించేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని శ్రీ సింధియా ప్రతిన చేశారు.

మంత్రిత్వ శాఖ అధికారులు శ్రీ సింధియాకు సాదరపూర్వక స్వాగతం పలకడంతో పాటు మంత్రిత్వ శాఖ నిర్దేశిత లక్ష్యాలు సాధించేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయనకు గల విస్తృత అనుభవం, డైనమిక్ నాయకత్వంలో కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సరికొత్త దృక్ప‌థం, నవ ఉత్తేజంతో పని చేస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ లింక్ :

https://twitter.com/JM_Scindia/status/1800433070413152579?t=lSd2E36lAoARrmhijo1zkA&s=19

మరిన్ని ఫొటోలు, వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

https://drive.google.com/drive/folders/1nP-n5_cv21jSF7TjJnFvoHOCBJZ3JC_o

-----



(Release ID: 2024541) Visitor Counter : 33