జల శక్తి మంత్రిత్వ శాఖ

కేంద్ర జల శక్తి మంత్రిగా సీఆర్ పాటిల్ బాధ్యతలు తీసుకున్నారు.


నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, నిర్వహణలో మంత్రిత్వ శాఖ కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని నిర్ణయించింది: సీఆర్ పాటిల్.

Posted On: 11 JUN 2024 6:39PM by PIB Hyderabad

కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ బాధ్యతలను చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ ఇవాళ న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు.  మంత్రిత్వ శాఖ బాధ్యతనిస్తూ తనపై నమ్మకం ఉంచిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌లోని నవ్‌సారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈయన పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, నిర్వహణలో మంత్రిత్వ శాఖ కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “ఈ దిశగా సమిష్టి ప్రయత్నాలను ప్రోత్సహిస్తాం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీటి వనరులకు సంరక్షిస్తాం” అని తెలిపారు.


దేశంలోని జన వనరుల స్థితిగతులతో పాటు మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల పనితీరులను గురించి సీనియర్ అధికారులు ఆయనతో పాటు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రులు వి. సోమన్న , రాజ్ భూషణ్ చౌదరిలకు వివరించారు. 

తాగునీరు, పారిశుద్ధ్యం విభాగం సెక్రటరీ విని మహాజన్… జలవనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీనవ విభాగం సెక్రటరీ దేబాశ్రీ ముఖర్జీతో పాటు మంత్రిత్వ శాఖలోని ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 2024537) Visitor Counter : 25