నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన శ్రీ ప్రహ్లాద్ జోషి


సహాయ మంత్రిగా శ్రీ శ్రీపాద్ యస్సో నాయక్ కూడా బాధ్యతలు స్వీకరణ

Posted On: 11 JUN 2024 2:54PM by PIB Hyderabad

శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు అటల్ అక్షయ ఊర్జా భవన్ లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పోర్ట్‌ఫోలియోతో పాటు నూతన, పునరుత్పాదక ఇంధనం కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

 

నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భూపిందర్ సింగ్ భల్లాతో పాటు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు మంత్రులకు స్వాగతం పలికారు.

 

కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశ ఇంధన భద్రతను నిర్ధారించడానికి పునరుత్పాదక ఇంధన రంగానికి కీలకమైన ప్రాముఖ్యత ఉందని చెప్పారు. ఈ రంగంలో వృద్ధికి గల విస్తారమైన అవకాశాలను వివరించారు. దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్లు, పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడానికి పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఆయన అన్నారు.

అనంతరం కేంద్ర మంత్రితో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు సమావేశమయ్యారు.

***



(Release ID: 2024514) Visitor Counter : 56