ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగత్ ప్రకాశ్ నడ్డా
Posted On:
11 JUN 2024 3:12PM by PIB Hyderabad
జగత్ ప్రకాశ్ నడ్డా ఈ రోజు కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సహాయ మంత్రులు ప్రతాప్ రావ్ జాదవ్, అనుప్రియా పటేల్(ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జేపీ నడ్డా 1975లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1989 లోక్ సభ ఎన్నికల్లలో బీజేపీ యువ విభాగానికి ఎన్నికల ఇన్‌చార్జిగా ప్రధాన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఆ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. నవంబర్ 2014 నుంచి మే 2019 వరకు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేశారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో జె.పి. నడ్డా సంభాషించారు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి వారు వివరించారు.
ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, అదనపు కార్యదర్శి రోలీ సింగ్ తో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.
***
(Release ID: 2024462)
Visitor Counter : 103
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam