ప్రధాన మంత్రి కార్యాలయం

యోగ ను అందరూ వారి జీవనం లో ఒక అంతర్భాగం గా చేసుకోవాలనివిజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి


యోగ కు చెందిన వివిధ ఆసనాలను మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలిపే కొన్ని వీడియోల ను కూడా శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 11 JUN 2024 11:03AM by PIB Hyderabad

యోగ ను ప్రజలు వారి జీవనం లో ఒక విడదీయలేనటువంటి భాగం గా మలచుకోవాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. యోగ మనస్సు కు నెమ్మది ని ఇస్తుంది, మరి మన జీవనం లోని సవాళ్ళ ను మనం ప్రశాంతి తో, ధీరోదాత్తత తో దాటి ముందుకు పోయేందుకు యోగ వీలు ను కల్పిస్తుంది అని కూడా ఆయన అన్నారు.

 

త్వరలోనే యోగ దినం రానుండడాన్ని దృష్టి లో పెట్టుకొని, వేరు వేరు యోగ ఆసనాల ను గురించి మరియు వాటి వల్ల లభించే ప్రయోజనాల ను గురించి వివరించే కొన్ని వీడియోల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :

‘‘మరో పది రోజుల లో, ప్రపంచం యోగ యొక్క పదో అంతర్జాతీయ దినాన్ని జరుపుకోనున్నది. చిరకాలం పాటించదగినటువంటి ఒక అభ్యాసమే యోగ; మరి ఇది ఏకాత్మకత ను మరియు సద్భావన ను చాటి చెప్పేది కూడాను. సాంస్కృతికమైన ఎల్లల ను మరియు భౌగోళికమైన ఎల్లల ను మించిపోయినటువంటి యోగ సంపూర్ణ శ్రేయం కోసం సాగే అన్వేషణ లో ప్రపంచవ్యాప్తం గా లక్షల మంది ప్రజల ను ఏకం చేస్తున్నది.’’

 

‘‘ఈ సంవత్సరం లో యోగ దినం వైపునకు మనం పయనిస్తున్న క్రమం లో, యోగ ను మన జీవనాల లో ఒక విడదీయలేని అటువంటి భాగం గా మలచుకోవాలన్న మన వచన బద్ధత ను పునరుద్ఘాటించడం మరియు ఇతరుల ను కూడా యోగ ను వారి యొక్క జీవనం లో ఒక భాగం గా చేసుకొనేందుకు ప్రోత్సహించడం అత్యవసరం. యోగ నెమ్మది ని ప్రసాదించడం ద్వారా జీవనం లోని సవాళ్ళ ను ప్రశాంతి తో మరియు ధీరోదాత్తత తో ఎదుర్కొనేందుకు వీలు కలుగజేస్తుంది.’’

 

‘‘యోగ దినం త్వరలో రానుండగా, ఈ సందర్భం లో వేరు వేరు యోగ ఆసనాలు మరియు అవి అందజేసే ప్రయోజనాలు ఎటువంటివి అనే అంశాల లో దారి ని చూపేటటువంటి కొన్ని వీడియోల ను నేను శేర్ చేస్తున్నాను. ఇవి మీరు అందరు క్రమం తప్పక యోగ ను అభ్యసించేందుకు ప్రేరణ ను అందిస్తాయని నేను ఆశిస్తున్నాను.’’

 

 

***

DS/ST



(Release ID: 2023981) Visitor Counter : 86