మంత్రిమండలి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద 3 కోట్ల గ్రామీణ-పట్టణ గృహాల నిర్మాణానికి ప్రభుత్వ సహాయం
Posted On:
10 JUN 2024 7:50PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ (పిఎంఎవై)ను 2015-16 నుంచి అమలు చేస్తోంది. దీనికింద అర్హులైన గ్రామీణ-పట్టణ కుటుంబాలకు మౌలిక సదుపాయాలతో కూడిన గృహాల నిర్మాణానికి తోడ్పాటునిస్తోంది. ఈ మేరకు ‘పిఎంఎవై’ కింద గడచిన పదేళ్లలో గృహనిర్మాణ పథకాల కింద అర్హులైన పేద కుటుంబాల కోసం 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
ఇప్పటిదాకా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పథకాల కింద నిర్మితమైన అన్ని గృహాలకూ మరుగుదొడ్లు, వంటగ్యాస్/ విద్యుత్, ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు వంటి ప్రాథమిక సౌకర్యాలన్నీ కల్పించబడ్డాయి.
ఈ నేపథ్యంలో అర్హతగల కుటుంబాల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా వారి గృహావసరం తీర్చేలా దేశంలోని గ్రామీణ-పట్టణ కుటుంబాలకు అదనంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం కోసం చేయూతనివ్వాలని నేటి తొలి మంత్రిమండలి సమావేశం తీర్మానించింది.
****
(Release ID: 2023861)
Visitor Counter : 225
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam