ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి గా మూడో పదవీకాలానికి గాను ప్రమాణాన్నిస్వీకరించిన శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
09 JUN 2024 11:55PM by PIB Hyderabad
భారతదేశాని కి ప్రధాన మంత్రి గా శ్రీ నరేంద్ర మోదీ వరుసగా తన మూడో పదవీకాలాని కి సంబంధించి రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన ఒక కార్యక్రమం లో పదవీప్రమాణాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రధాన మంత్రి చేత మరియు ఆయన మంత్రివర్గ సహచరుల చేత ప్రమాణ పాఠాన్ని చదివించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు న సాయంత్రం పూట జరిగిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించాను. 140 కోట్ల మంది భారతీయుల కు సేవ చేయాలని మరియు భారతదేశాన్ని ప్రగతి తాలూకు క్రొత్త ఎత్తులకు తీసుకు పోవడం కోసం మంత్రిమండలి తో కలసి పని చేయాలని నేను ఆశ పడుతున్నాను.
ఈ రోజు న పదవీప్రమాణాన్ని స్వీకరించిన వారు అందరికి ఇవే అభినందన లు. ఈ మంత్రుల జట్టు యువ ఉత్సాహం మరియు అనుభవం ల యొక్క ఘనమైనటువంటి మిశ్రణాన్ని కలిగి ఉన్నది; మరి మేము ప్రజల జీవనాన్ని మెరుగు పరచడం లో శాయశక్తుల కృషి చేస్తాము.
ప్రమాణ స్వీకార కార్యక్రమాని కి హాజరైనటువంటి విదేశీ ప్రముఖులు అందరికి నేను కృతజ్ఞుడిని అయి ఉంటాను. మానవ పురోగతి కోసం కృషి చేయడం లో భారతదేశం తన యొక్క విలువైన భాగస్వాముల తో కలసి భారతదేశం ఎల్లప్పుడూ సన్నిహితం గా మెలగుతూ, పాటు పడుతుంది.’’
‘‘రాష్ట్రపతి భవన్ యొక్క ప్రాంగణం లో ఈ రోజు న సాయంత్రం పూట జరిగిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి పదవి తాలూకు ప్రమాణాన్ని నేను స్వీకరించాను. 140 కోట్ల మంది దేశవాసుల కు సేవ చేయడానికి మరియు దేశం యొక్క ప్రగతి ని క్రొత్త ఎత్తుల కు తీసుకుపోవడానికి నేను మరియు మంత్రిమండలి లోని నా సహచరులం కంకణం కట్టుకొన్నాం.
ఎన్ డిఎ ప్రభుత్వం లో మంత్రి గా ప్రమాణాన్ని తీసుకొనే అందరు సహచరులకు చాలా చాలా అభినందన లు మరియు శుభాకాంక్షలూ ను. మంత్రుల బృందం లో యువ ఉత్సాహం తో పాటు గా అనుభవం తాలూకు అద్భుతమైనటువంటి సంగమం నెలకొని ఉంది. దేశ ప్రజలందరి జీవనాన్ని మెరుగుపరచడం లో మేము శాయశక్తుల పాటు పడుతాము.
పదవీప్రమాణ కార్యక్రమానికి హాజరు కావడం కోసం ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసిన ప్రముఖ అతిథుల కు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను. మానవ జాాతి యొక్క హితం కోసం భారతదేశం సదా విశ్వ బంధు గా తన సమీప భాగస్వాముల తో కలసి పని చేస్తూనే ఉంటుంది.’’
(Release ID: 2023776)
Visitor Counter : 110
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam