ప్రధాన మంత్రి కార్యాలయం
చరిత్రాత్మకమైనటువంటి మూడో పదవీ కాలాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిలబెట్టుకొన్నందుకు గాను ఆయన కు ఫోన్ ద్వారా అభినందనలను తెలియ జేసిన నేపాల్ యొక్క ప్రధాని
క్రిందటి ఏడాది లో నేపాల్ ప్రధాని జరిపిన ఫలప్రద యాత్రను గుర్తుకు తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
భారతదేశం అవలంబిస్తున్న ‘నేబర్‌హుడ్ ఫస్ట్’ పాలిసీ లో ఒక విశిష్ట భాగస్వామి గా నేపాల్ ఉంది
प्रविष्टि तिथि:
05 JUN 2024 10:16PM by PIB Hyderabad
నేపాల్ యొక్క ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా సంభాషించారు. భారతదేశం లో ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల లో మూడో పర్యాయం చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అందుకొన్నందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల ను ప్రధాని శ్రీ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ తెలియ జేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క నాయకత్వం లో భారతదేశం-నేపాల్ సంబంధాలు మరింత గా దృఢం అవుతాయన్న విశ్వాసాన్ని ప్రధాని శ్రీ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ వ్యక్తం చేశారు.
ప్రధాని శ్రీ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ కు ఆయన వ్యక్తం చేసిన శుభాకాంక్షల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను పలికారు. క్రిందటి సంవత్సరం లో నేపాల్ ప్రధాని భారతదేశాని కి వచ్చిన సంగతి ని శ్రీ నరేంద్ర మోదీ ఆప్యాయం గా గుర్తు కు తీసుకు వస్తూ, ఆ కాలం లో ఇరు దేశాల మధ్య సాంప్రదాయక, మైత్రీపూర్వక మరియు బహుళ పార్శ్విక భాగస్వామ్యాన్ని మరింత దృఢం గా మలచడం కోసం అనేక కార్యక్రమాల ను తీసుకొన్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
భారతదేశం తో నేపాల్ కు విస్తృతమైనటువంటి, సాంస్కృతికపరమైన సంబంధాలు మరియు నాగరకతపరమైన సంబంధాలు నెలకొని ఉన్నాయి. మరి భారతదేశం అవలంబిస్తున్న ‘నేబర్‌హుడ్ ఫస్ట్’ పాలిసీ లో నేపాల్ ఒక విశిష్ట భాగస్తురాలుగా ఉంటున్నది. ప్రస్తుతం చోటు చేసుకొన్న టెలిఫోన్ సంభాషణ రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయం యొక్క కొనసాగింపు ను సూచిస్తున్నది.
***
(रिलीज़ आईडी: 2023127)
आगंतुक पटल : 115
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam