ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024 వ సంవత్సరాని కి గాను నెల్సన్ మండేలా అవార్డ్ ఫార్హెల్థ్ ప్రమోశన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా దక్కించుకొన్న నిమ్‌హాన్స్


నిమ్‌హాన్స్ కు అభినందన లు తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయా ‘‘ఇది సమ్మిళిత ఆరోగ్య సంరక్షణ లో భారతదేశం యొక్క ప్రయాసల కు ఒక గుర్తింపు’’ అని ఆయన పేర్కొన్నారు

నెల్సన్ మండేలా అవార్డ్ ఫార్ హెల్థ్ ప్రమోశన్ నుడబ్ల్యుహెచ్ఒ 2019 లో నెలకొల్పింది, ఈ పురస్కారంఆరోగ్య ప్రోత్సాహం లో ప్రశంసనీయమైన తోడ్పాటుల ను అందించిన వ్యక్తులు, సంస్థలు మరియు  ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వేతర సంస్థ కుగుర్తింపు ను ఇస్తుంది

ఈ పురస్కారం మానసిక స్వస్థత మరియు శ్రేయం లప్రోత్సాహాని కి గాను అసాధారణమైన తోడ్పాటును, సమర్పణ భావాన్ని చాటుకొన్న నిమ్‌హాన్స్ కు ఒకధ్రువీకరణ గా ఉంది

మానసిక స్వస్థత మరియు నాడీమండల సంబంధి విజ్ఞానశాస్త్రాల రంగం లో నిమ్‌హాన్స్ అగ్రస్థానాన నిలుస్తూ, పరిశోధన, విద్య ఇంకా రోగిసంరక్షణ అంశాల లో క్రొత్త క్రొత్త విధానాల ను ఆచరణ లోకి తెస్తున్నది



Posted On: 31 MAY 2024 4:22PM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఒ) ఇస్తున్నటువంటి నెల్సన్ మండేలా అవార్డ్ ఫార్ హెల్థ్ ప్రమోశన్ను 2024 వ సంవత్సరం లో భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం ల మంత్రిత్వ శాఖ లో జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థ అయిన బెంగళూరు లోని నేశనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్థ్ & న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎమ్‌హెచ్‌ఎఎన్ఎస్.. నిమ్‌హాన్స్) దక్కించుకొన్నది.

 

 

ఈ అవార్డు ను డబ్ల్యుహెచ్ఒ 2019 వ సంవత్సరం లో ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం ఆరోగ్య ప్రోత్సహం కోసం అసాధారణమైన తోడ్పాటుల ను అందించినటువంటి వ్యక్తులు, సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వేతర సంస్థల యొక్క కృషి ని గుర్తిస్తున్నది.

 

 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయా ఈ అవార్డు ను దక్కించుకొన్న నిమ్‌హాన్స్ కు అభినందనల ను తెలియ జేశారు. ‘‘అన్ని వర్గాల వారి కి స్వాస్థ్య సంరక్షణ కై భారతదేశం చేస్తున్న ప్రయాసల కు ఇది ఒక గుర్తింపు గా ఉంది’’ అని ఆయన అన్నారు.

 

 

భారతదేశం ప్రయాసల కు గుర్తింపు మరియు మానసిక స్వస్థత రంగం లో మార్గదర్శకమైన కృషి లకు గుర్తింపు లభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ కార్యసాధన కు గాను నిమ్‌హాన్స్ ను అభినందించారు.

 

 

‘‘మా సంస్థ యొక్క ప్రస్థానం లో ఈ దశ లో ప్రతిష్టాత్మకమైన నెల్సన్ మండేలా అవార్డు ఫార్ హెల్థ్ ప్రమోశన్ ను అందుకోవడం మాకు ఎనలేని అతిశయాన్ని కలిగిస్తోంది’’ అని నిమ్‌హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమ మూర్తి గారు అన్నారు. ‘‘ఈ అవార్డు మా గత కాలపు కార్యసాధన లు మరియు వర్తమాన కార్యసాధనల కు ఒక గుర్తింపు మాత్రమే కాకుండా, నిమ్‌హాన్స్ ఆరంభం అయినప్పటి నుండి మార్గదర్శనం చేస్తూ వస్తున్న దార్శనికత మరియు చిరకాలిక వారసత్వాని కి ఒక ప్రమాణం గా కూడా ఉంది. ఇది మానసిక స్వస్థత ను వ్యాప్తి చేయాలన్న మా మిశన్ ను ఇక ముందు కూడా కొనసాగించాలన్న మా సంకల్పాన్ని బలపరుస్తున్నది. అలాగే, మేము సేవల ను అందిస్తున్న వ్యక్తుల జీవనం లో ఒక స్పష్టమైన మార్పును తీసుకు వస్తున్నది’’ అని ఆమె అన్నారు.

 

 

ఈ అవార్డు నిమ్‌హాన్స్ యొక్క సమర్పణ భావాని కి మరియు మానసిక ఆరోగ్యం, ఇంకా శ్రేయస్సు ల ప్రోత్సాహం కోసం చేస్తున్న విశిష్ట కృషి ల కు ఒక ప్రమాణం గా ఉంది. నిమ్‌హాన్స్ మానసిక ఆరోగ్యం మరియు నాడీమండల విజ్ఞాన శాస్త్రాల లో అగ్రభాగాన నిలుస్తోంది. పరిశోధన, విద్య, మరియు రోగి సంరక్షణ ల పట్ల క్రొత్త క్రొత్త విధానాల ను ఆవిష్కరిస్తున్నది. మానసిక ఆరోగ్య సంబంధి కార్యక్రమాల ను గొప్ప స్థాయి లో ఆరంభించి, ఆచరణ లోకి తీసుకు రావడం లో నిమ్‌హాన్స్ ముందంజ వేస్తున్నది. మానసిక స్వస్థత సేవల ను సాధారణ ఆరోగ్య సంరక్షణ లో ఒక భాగం గా మార్చడం, సాముదాయిక ప్రధానమైనటువంటి వ్యూహాల ను అభివృద్ధి పరచడం, డిజిటల్ హెల్థ్ సంబంధి కార్యక్రమాల కు నాంది పలకడం వంటి యత్నాల కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది.

 

 

ఈ ప్రశంస మరీ ముఖ్యం గా నిమ్‌హాన్స్ కు ఒక మహత్తరమైనటువంటి కాలం లో దక్కింది. సంస్థ ఏర్పాటు అయిన అనంతరం 50 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకొంటున్నది; అంతేకాకుండా, ఈ సంస్థ కంటే ముందు స్థాపన జరిగిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్థ్ (ఎఐఐఎమ్‌హెచ్) యొక్క 70 వ వార్షికోత్సవం కూడా వచ్చింది. నిమ్‌హాన్స్ ఈ రెండు మైలు రాళ్ళ ను చేరుకొన్న తరుణం లో ఈ పురస్కారం ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యం కలిగినటువంటిదిగా ఉంది. మానసిక స్వస్థత మరియు నాడీ విజ్ఞాన శాస్త్రం రంగం లో సంస్థ యొక్క సంపన్న వారసత్వాన్ని మరియు నిరంతర పరిణామ గతిని ఈ అవార్డు ప్రముఖం గా ప్రకటిస్తున్నది.

 

 

ఇటీవలి కాలాల్లో మానసిక స్వస్థత రంగం లో భారతదేశం ఘన విజయాల ను నమోదు చేసింది. నేశనల్ హెల్థ్ మిశన్ ద్వారా ప్రస్తుతం దేశం లో దాదాపు గా అన్ని జిల్లాల లో మానసిక స్వస్థత యూనిట్ లను బలపరచడం జరుగుతున్నది. భారతదేశం లో జాతీయ స్థాయి లో టెలి మెంటల్ హెల్థ్ హెల్ప్ లైన్, ‘‘టెలి మానస్’’ (Tele MANAS) ను 2022 వ సంవత్సంరం అక్టోబరు 10 వ తేదీ నాడు ప్రారంభించ గా, ఇటీవలె ఇది 10 లక్షల కాల్స్ ను పరిష్కరించి, ఒక ప్రతిష్టాత్మకమైన మైలురాయి కి చేరుకొన్నది.

 

 

ఈ సందర్భంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అడిశనల్ సెక్రట్రి హెకాలీ ఝిమోమీ గారు మరియు మంత్రిత్వ శాఖ లో ఇతర సీనియర్ అధికారులు పాలుపంచుకొన్నారు.

 

****


(Release ID: 2022574) Visitor Counter : 104