ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డెబ్భై ఏడోవరల్డ్ హెల్థ్ అసెంబ్లీ యొక్క సర్వ సభ్య సదస్సు  లో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి


1,60,000కు పైచిలుకుఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ను నిర్వహించడం ద్వారా సార్వత్రిక స్వాస్థ్య రక్షణ నుప్రోత్సహించడాని కి ఆయుష్మాన్ భారత్ ను ఇండియా ప్రవేశపెట్టింది;  ఆయుష్మాన్ భారత్ అనే మాటల కు ‘భారతదేశం వర్థిల్లాలి’ అని భావం: కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి

‘‘గడచిన దశాబ్దాలలో ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎమ్ఎమ్ఆర్) లో మరియు శిశు మరణాల రేటు (ఐఎమ్ఆర్) లోగణనీయమైన క్షీణత ను నమోదు చేస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ను సాధించే బాట లో భారతదేశం ముందుకు పోతోంది.  ప్రస్తుతం, భారతదేశం విసెరల్ లిశ్‌మేనియాసిస్ వ్యాధి ని నిర్మూలించడం లో తుది దశ కుచేరుకొంటోంది; అంతేకాకుండా, క్షయ వ్యాధి వ్యాప్తి మరియు మరణాల ను కూడ తగ్గించగలిగింది’’

‘‘డిజిటల్ పబ్లిక్గూడ్స్ రంగం లో ప్రపంచ దేశాల తో భాగస్వామ్యాలను ఏర్పరచడం లో భారతదేశం ఒక దీపస్తంభదేశం గా ఉంది’’

‘‘అందరికీ ఉన్నతమైననాణ్యత తో కూడిన వైద్య చికిత్స ఉత్పాదనల ను త్వరిత గతి న అందుబాటు లోకి తెచ్చేందుకుపూచీ పడడానికి ఔషధ నియంత్రణ వ్యవస్థ ను డబ్ల్యుహెచ్ఒ సహకారం తో పటిష్ట పరచాలనికోరుకొంటున్న భారతదేశం’’

‘‘గ్లోబల్ హెల్థ్ ఆర్కిటెక్చర్ ఫ్రేంవర్క్ కు బాట ను పరచడం మర

Posted On: 29 MAY 2024 2:22PM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఆధ్వర్యం లో 77 వ వరల్డ్ హెల్థ్ అసెంబ్లీ యొక్క సర్వ సభ్య సదస్సు జెనెవా లో ఈ రోజున జరుగగా లో భారతదేశం ప్రతినిధి వర్గాని కి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర నాయకత్వం వహించి, ఆ సదస్సు లో ప్రసంగించారు.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తన ప్రసంగాన్ని ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం అయినటువంటి ‘‘ఆల్ ఫార్ హెల్థ్, హెల్థ్ ఫార్ ఆల్’’ కు భారతదేశ ప్రాచీన సంప్రదాయమైన వసుధైవ కుటుంబకమ్(ఈ మాటల కు ‘‘ప్రపంచం ఒక పరివారం’’ అని భావం) తో పోలిక లు ఉన్న విషయాన్ని ప్రముఖం గా ప్రకటించారు. ఇదే ఇతివృత్తం లో భాగం గా ‘‘భారతదేశం 1,60,000 కు పైచిలుకు హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్స్ (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) ను నడుపుతూ సార్వత్రిక స్వాస్థ్య సంరక్షణ ను ప్రచారం చేయడం కోసమని ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశపెట్టింది’’ అని తెలిపారు. (‘‘ఆయుష్మాన్ భారత్ అనే మాటల కు ‘‘భారతదేశం దీర్ఘకాలం పాటు వర్థిల్లాలి’’ ’’ అని అర్థం వస్తుంది.)

 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఎస్‌పిఎఆర్ లో ఏ ఆరోగ్య సంబంధి అత్యవసర పరిస్థితుల కు అయినా సరే ప్రతిస్పందించడం మరియు అటువంటి స్థితుల ను పసిగట్టడం, మదింపు చేయడం, నివేదిక ను వెలువరించడం వంటి అంశాల లో భారతదేశం యొక్క కీలక సామర్థ్య సంబంధి స్కోరు 86 శాతం గా ఉందని, అది ఆగ్నేయ ఆసియా ప్రాంతం మరియు ప్రపంచ సగటు ల కంటే అధికం అని శ్రీ అపూర్వ చంద్ర వివరించారు. ‘‘ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎమ్ఎమ్ఆర్) మరియు శిశు మరణాల రేటు (ఐఎమ్ఆర్) లు గడచిన దశాబ్దాల లో చెప్పుకోదగిన రీతి లో క్షీణించడాన్ని పట్టి చూస్తే భారతదేశం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ను అందుకొనే మార్గం లో పయనిస్తూ ఉంది. ప్రస్తుతం భారతదేశం విసెరల్ లిశ్‌మేనియాసిస్ (విఎల్) అనే వ్యాధి ని నిర్మూలించే దశ కు చేరుకొంది? అంతేకాకుండా, క్షయ వ్యాధి వ్యాప్తి ని మరియు తత్సంబంధి మరణాల సంఖ్యల ను కూడా తగ్గించింది’’ అని ఆయన వెల్లడించారు.

 

 

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎమ్-జెఎవై) 343 మిలియన్ మంది లబ్ధిదారుల కు ఒక్కొక్క కుటుంబాని కి సంవత్సరాని కి 6000 డాలర్ మేరకు స్వాస్థ్య సంరక్షణ ను సమకూర్చే ఆరోగ్య హామీ పథకాన్ని గురించి కూడా ఆయన నొక్కిపలికారు. ద్వితీయ స్థాయి మరియు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సంబంధి ఆసుపత్రి చికిత్స ఖర్చుల ను దృష్టి లో పెట్టుకొని బాధితులు వారి సొంత డబ్బు ను ఖర్చు చేయడాన్ని తగ్గించేందుకు తోడ్పడేదే ఈ పథకం. స్వాస్థ్య సంరక్షణ లో డిజిటల్ కార్యక్రమాల ను అమలుపరచి, ‘‘భారతదేశం ఈ తరహా డిజిటల్ పబ్లిక్ గూడ్స్ వినియోగాని కి ప్రపంచ స్థాయి సహకార ప్రధానమైన ప్రయాసల లో ఒక మార్గదర్శక దేశం గా రూపుదిద్దుకొన్నది’’ అని ఆయన వివరించారు.

 

 

‘‘ఏదైనా ఆపద ఎదురైనప్పుడు వ్యక్తి కి వైద్య చికిత్స పరం గా తీసుకొనే జాగ్రత చర్య లు అనేవి అందరికి సమానమైన స్థాయి లో ప్రాప్తించాలి అనేది ప్రతి ఒక్కరి కి ప్రాథమిక హక్కు గా ఉండాలి’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల లో వినియోగాని కి వీలుగా సరఫరా అయిన టీకా మందుల లో 60 శాతం భారతదేశమే సమకూర్చింది అని ఆయన స్పష్టంచేశారు. ‘‘డబ్ల్యుహెచ్ఒ యొక్క సహకారం తో భారతదేశం ఔషధ నియంత్రణ వ్యవస్థ ను మరింత గా బలపరచి, అధిక నాణ్యత తో కూడిన వైద్య ఉత్పాదనల ను అందరి కోసం శీఘ్ర గతి న అందుబాటు లోకి తీసుకు రావాలని కోరుకొంటున్నది’’ అని ఆయన అన్నారు. ఆరోగ్య రంగం లో అత్యున్నత శిక్షణ ను పొందిన మరియు అనుభవజ్ఞులైన శ్రమికుల సంఖ్య భారతదేశం లో ఉన్నట్లు ఆయన చెప్పారు. తద్ద్వారా ఒక భారతదేశం లోనే కాకుండా ప్రపంచం అంతటా మెడికల్ వేల్యూ టూరిజమ్ పరం గా చూసుకొన్నప్పుడు కీలకమైన దేశాల లో ఒక దేశం గా భారతదేశం పేరు తెచ్చుకొంటోంది అని ఆయన అన్నారు. ఆయుష్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో భాగం గా ఇటీవలె ఒక సరిక్రొత్త వీజా రెఝీమ్ అయినటువంటి ఆయుష్ వీజా ను జారీ చేయడమైందని, ఇది భారతదేశం లో మెడికల్ టూరిజమ్ కు దన్ను గా నిలవనుందన్నారు.

 

 

‘‘ప్రపంచం లో ఆరోగ్య సంబంధి నిర్మాణాల రూపకల్పన విషయం లో సర్వ సమ్మతి సాధన కై ఇంటర్ గవర్నమెంటల్ నెగోశియేటింగ్ బాడీ (ఐఎన్‌బి) మరియు ఇంటర్‌ నేశనల్ హెల్థ్ రెగ్యులేశన్స్ (ఐహెచ్ఆర్) ప్రక్రియల లో భారతదేశం నిర్మాణాత్మకమైన రీతి లో పాలుపంచుకొంటోంది. దీనివల్ల రాబోయే కాలాల్లో మహమ్మారుల తో ఉమ్మడి గా తలపడే శక్తి మనకు లభిస్తుంది’’ అని శ్రీ అపూర్వ చంద్ర అన్నారు.

 

 

సుస్థిర అభివృద్ధి సాధన లో ఒక కీలకమైన మూలస్తంభం గా ఆరోగ్యం మరియు శ్రేయస్సుల ను ప్రోత్సహించడానికి సమష్టి నిబద్ధత ను వ్యక్తం చేయాలి అని సభ్యత్వ దేశాలు అన్నిటికి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘మనం అందరం కలిసికట్టుగా అందరి కోసం ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు ను నిర్మించాలి’’ అని ఆయన అన్నారు.

 

 

కేంద్ర ఆరోగ్య శాఖ యొక్క అడిశనల్ సెక్రట్రి హెకాలీ ఝిమోమీ గారు మరియు మంత్రిత్వ శాఖ కు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

***


(Release ID: 2022064) Visitor Counter : 136