రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కేరళ లో సముద్రం లో తీవ్ర అస్వస్థత బారిన పడ్డమత్స్యకారుడిని కాపాడిన ఐసిజి

Posted On: 08 MAY 2024 11:37AM by PIB Hyderabad

కేరళ లోని బేపోర్ నుండి దాదాపు గా 40 నాటికల్ మైళ్ళ ఆవల చేపలు పట్టే భారతీయ పడవ (ఐఎఫ్‌బి) జజీరా నుండి సముద్రం లో తీవ్ర అస్వస్థత కు లోనైన మత్స్యకారుడి ని భారతదేశ కోస్తా తీర రక్షక దళం (ఐసిజి) 2024 మే నెల 7 వ తేదీ నాడు రక్షించింది. సముద్రం లోకి పడిపోవడం తో జాలరి కి తాను సముద్ర జలాల్లో మునిగిపోతున్నట్టు అనిపించింది. ఆయన ను ఐఎఫ్‌బి కాపాడింది; అయితే, మత్స్యకారుని ఊపిరితిత్తుల లో అదనపు నీరు నిండిపోయిన కారణం గా ఆయన స్థితి క్షీణించింది.

 

పడవ లోని ఇతర నావికులు వైద్య చికిత్స అవసరమంటూ ఒక సందేశాన్ని పంపించగా ఐసిజి ప్రతిస్పందించింది. కోచి కి చెందిన వైద్య చికిత్స బృందం తో పాటు గా ఆర్యమాన్ మరియు సి-404 నౌకలతో కలసి తన అడ్వాన్స్‌ డ్ లైట్ హెలికాప్టర్ ను రంగం లోకి దింపింది. ఐసిజి తన ఉన్నత ఉపకరణాల మాధ్యం ద్వారా ఐఎఫ్‌బి జాడ ను గుర్తించి, రోగి ని విమారం లొ కోచి కి తీసుకు పోయింది. తరువాత అతడి ని దగ్గర లోని ఒక ఆసుపత్రి లో చేర్పించడమైంది.

 

ఐసిజి శీఘ్ర గతి న సరైన కాలం లో సమన్వయాన్ని నెలకొల్పుకొని తన ధ్యేయ వాక్యం అయిన ‘వయమ్ రక్షామ్’ (మేం రక్షిస్తాం) అనుగుణం గా సముద్రం లో మరొకరి ప్రాణాన్ని రక్షించింది.

 

***



(Release ID: 2020027) Visitor Counter : 94