హోం మంత్రిత్వ శాఖ

పద్మ అవార్డులు 2025 కోసం మొదలైన నామినేశన్ లు

Posted On: 01 MAY 2024 5:20PM by PIB Hyderabad

రాబోయే 2025 వ సంవత్సరం లో గణతంత్ర దినం సందర్భం లో ప్రకటించవలసి ఉన్నటువంటి పద్మ పురస్కారాలు 2025 కోసం ఆన్ లైన్ మాధ్యం లో నామినేశన్ లు/సిఫారసుల కార్యక్రమం ఈ రోజు న ఆరంభం అయింది. పద్మ పురస్కారాల కోసం నామినేశన్ లకు చివరి తేదీ 2024 సెప్టెంబర్ 15 వ తేదీ గా ఉంది. పద్మ అవార్డులకై నామినేశన్ లు/రికమండేశన్లను జాతీయ పురస్కార పోర్టల్ https://awards.gov.in లో ఆన్ లైన్ మాధ్యం ద్వారా స్వీకరించడం జరుగుతుంది.

 

 

పద్మ పురస్కారాలు, అనగా ‘పద్మ విభూషణ్’, ‘పద్మ భూషణ్’, మరియు ‘పద్మ శ్రీ’ అవార్డులు దేశం లో అత్యున్నత పౌర పురస్కారాలు గా ఉన్నాయి. 1954 వ సంవత్సరం లో స్థాపించిన ఈ అవార్డుల ను ప్రతి ఏటా గణతంత్ర దినం సందర్భం లో ప్రకటిస్తుంటారు. ఈ అవార్డు లు ‘విశిష్ట కృషి’ కి గుర్తింపు ను ప్రసాదిస్తాయి. అన్ని రంగాల లో మరియు విభాగాల లో అంటే కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక కృషి, సైన్స్ ఎండ్ ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, పౌర సేవ, వ్యాపారం మరియు పరిశ్రమ మున్నగు వాటిలో విశిష్టమైన, అసాధారణమైన మరియు మార్గదర్శకప్రాయమైన కార్యసాధనల కు/సేవ లకు గాను ఇస్తూ వస్తున్నారు. జాతి, వృత్తి, పదవి లేదా మహిళలు/పురుషులు అనే భేదాల కు అతీతం గా అందరు వ్యక్తులు ఈ పురస్కారాల కు అర్హులు. ప్రభుత్వ రంగ సంస్థల లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు మరియు శాస్త్రవేత్తలు మినహా, పద్మ పురస్కారాల కు అర్హులు కారు.

 

 

పద్మ పురస్కారాల ను ‘‘ప్రజా పద్మాలు’’ గా మార్చాలి అని ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. ఈ కారణం గా పౌరులు స్వీయ నామినేశన్ సహా వారి వారి నామినేశన్ లను, సిఫారసుల ను అందించవలసిందిగా అభ్యర్థించడమైంది. మహిళలు, సమాజం లోని బలహీన వర్గాలవారు, ఎస్‌సి లు ఎస్‌టిలు, దివ్యాంగ జనులు, మరి అలాగే సమాజాని కి స్వార్థరహితం గా సేవ చేస్తున్న అటువంటి వారు వారి వారి ఉత్కృష్టత, ఇంకా కార్యసాధనల పరం గా ప్రతిభావంతులు అయిన వారిని అచ్చం గా అర్హులను గుర్తించడం కోసం ఏకోన్ముఖ ప్రయాస ను చేపట్టవచ్చును.

 

 

పైన ప్రస్తావించిన పోర్టల్ లో లభ్యమయ్యే నిర్దిష్ట నమూనా లో అన్ని ప్రాసంగిక వివరాల ను గరిష్టం గా 800 పదాల కు మించకుండా ఒక ప్రస్తావన పత్రం సహా నామినేశన్ / సిఫారసు లలో పొందుపరచాలి. ఈ వివరాలు సిఫారసు ను ఉద్దేశించినటువంటి వ్యక్తి (అతడు లేదా ఆమె) కి సంబంధించిన కార్యక్షేత్రం లో / రంగం లో సిఫారసు కు ఏ విధం గా అర్హులో స్పష్టం గా తెలియజేసేవై ఉండాలి.

 

 

ఈ విషయం లో మరిన్ని వివరాల ను దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క వెబ్ సైట్ (https://mha.gov.in) లో అవార్డ్ స్ ఎండ్ మెడల్స్శీర్షిక న అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, పద్మ అవార్డుల కు ప్రత్యేకం గా ఉద్దేశించిన పోర్టల్ (https://padmaawards.gov.in) లో కూడా వివరాలు లభ్యం అవుతాయి. ఈ పురస్కారాల కు సంబంధించిన విధి విధానాలు మరియు నియమాలు

https://padmaawards.gov.in/AboutAwards.aspx లింకు లో దొరుకుతాయి.

 

 

 

**



(Release ID: 2019460) Visitor Counter : 113