రక్షణ మంత్రిత్వ శాఖ
600 కోట్ల రూపాయల విలువైన 86 కిలోగ్రాముల మత్తుపదార్థాల ను జప్తు చేసుకోవడం తో పాటు పాకిస్తానీ నౌక లో నుండి 14 మందిని అరెస్టు చేసిన ఐసిజి
Posted On:
28 APR 2024 9:09PM by PIB Hyderabad
ఉగ్రవాద వ్యతిరేక దళం (ఎటిఎస్) మరియు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ల సహకారం తో భారతీయ కోస్తా రక్షక దళం (ఐసిజి) 2024 ఏప్రిల్ 28 వ తేదీ నాడు సముద్రం లో మత్తు పదార్థాల వ్యతిరేక కార్యనిర్వహణ లో భాగం గా 600 కోట్ల రూపాయల విలువైన 86 కిలోల మత్తు పదార్థాల ను స్వాధీనం చేసుకోవడం తో పాటుగా అప్రమత్తత తో కూడినటువంటి పథకరచన చేసి పాకిస్తానీ నౌక లో నుండి 14 మంది ని పట్టుకొంది.
ఎటిఎస్ మరియు ఎన్‌సిబి అధికారుల తో కూడిన ఐసిజి నౌక రాజ్ రతన్ గుర్తింపు బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలను చేసినప్పటికీ కూడాను అనుమానిత నౌక ను పసిగట్టింది. ఏక కాలం లో చేపట్టిన నౌకలు మరియు విమానాల శ్రేణి సాయం తో రాజ్ రతన్ నౌక సత్వర ప్రతిస్పందన కు ఉరికి మత్తు పదార్థాల తో నిండిన నౌక ను చుట్టుముట్టి ఆ నౌక తప్పించుకోవడానికి ఎటువంటి తావు ను ఇవ్వలేదు. రాజ్ రతన్ కు చెందిన నిపుణుల బృందం అనుమానిత నౌక లోకి ప్రవేశించి, పక్కా తనిఖీ చేసిన అనంతరం పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల ఉనికి ని రూఢి పరచింది. తదుపరి దర్యాప్తు మరియు చట్టపరమైన కార్యకలాపాల కు గాను నౌక సిబ్బంది ని మరియు నౌక ను ప్రస్తుతం పోర్‌బందర్ కు తీసుకొని రావడం జరుగుతున్నది.
ఐసిజి మరియు ఎటిఎస్ ల సంయుక్త కార్యకలాపాలు ఈ తరహాలో కలిసికట్టుగా పనిచేసినందువల్ల గడచిన మూడు సంవత్సరాల లో ఈ విధమైనటువంటి పదకొండు సఫలమైన చర్య లు జరిగాయి. ఇవి జాతీయ లక్ష్యాల సాధన కు గాను సంయుక్త విన్యాసాల ను చేపట్టబలసిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి.
****
(Release ID: 2019117)