ప్రధాన మంత్రి కార్యాలయం

ఇంటర్ నేశనల్కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (ఐసిడిఆర్ఐ)  యొక్క ఆరో సంచిక లో ప్రధాన మంత్రి వీడియో సందేశం యొక్క పాఠం

Posted On: 24 APR 2024 9:54AM by PIB Hyderabad

శ్రేష్ఠులు మరియు మిత్రులారా,

 

నమస్కారం,, మీ అందరికీ భారతదేశం లో ఇదే నేను స్నేహపూర్ణమైన స్వాగత వచనాలను పలుకుతున్నాను. ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (ఐసిడిఆర్ఐ) యొక్క ఆరో సంచిక కు మీరు తరలిరావడం ఘనమైంది గా ఉంది. ఈ సమావేశం లో మీరు పాలుపంచుకోవడం ఈ ముఖ్యమైన అంశం పై ప్రపంచవ్యాప్తం గా కార్యాచరణ ను మరియు నిర్ణయాల ను పటిష్టపరుస్తుంది.

 

మిత్రులారా,

గడచిన కొన్ని సంవత్సరాల లో కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) యొక్క వికాసం ఆకర్షణీయం గా ఉంది. సిడిఆర్ఐ ని 2019 వ సంవత్సరం లో ఆరంభించినప్పటి నుండి మనం చాలా దూరం వచ్చేశాం. ప్రస్తుతం ఇది 39 దేశాల మరియు 7 సంస్థ ల సంకీర్ణం గా ఉంది. భవిష్యత్తు పరం గా ఇది ఒక శుభ సంకేతం గా ఉంది.

 

 

మిత్రులారా,

మనం అందరం గమనించిన విధం గా, ప్రాకృతిక విపత్తులు మరింత తరచుగాను మరియు మరింత తీవ్రం గాను సంభవిస్తున్నాయి. అవి కలిగించే నష్టాన్ని సాధారణం గా డాలర్ లలో చెబుతుంటారు. అయితే, ప్రజల పైన, కుటుంబాల పైన, ఇంకా సముదాయాల పైన వాటి తాలూకు వాస్తవిక ప్రభావం సంఖ్యల కు మించింది గా ఉంది. భూకంపాలు ఇళ్ళ ను నేలమట్టం చేసి, వేల కొద్దీ ప్రజలు ఆశ్రయం కోల్పోయేటట్లు చేస్తున్నాయి. ప్రాకృతిక విపత్తులు నీటిసరఫరా వ్యవస్థల ను మరియు మురుగు వ్యవస్థ ను ధ్వంసం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని అపాయం లో పడవేస్తున్నాయి. కొన్ని విపత్తులు శక్తి ఉత్పాదన నిలయాల పైన ప్రభావాన్ని చూపెట్టి, అపాయకరమైన స్థితుల కు దారి తీస్తున్నాయి. ఇటువంటివి అన్నీ కూడాను మానవుల ను నష్ట పరుస్తున్నాయి.

 

మిత్రులారా,

మనం మెరుగైనటువంటి రేపటి రోజు కోసం, ప్రకృతి విపత్తుల ను తట్టుకొని నిలబడగలిగేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన లో నిధుల ను ఈ రోజు నే తప్పక పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. విపత్తుల ను ఎదుర్కోవడం కోసం సరిక్రొత్త మౌలిక సదుపాయాల ను కల్పించాలి. దీనికి అదనం గా, విపత్తుల అనంతర కాలం లో చేపట్టవలసిన పునర్ నిర్మాణ పనులు కూడా ముఖ్యం. విపత్తులు సంభవించిన అనంతరం, తక్షణం శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. విపత్తులు వాటిల్లాక, ఉపశమన కారక చర్యలు మరియు పునరావాసం కల్పించడం పైన స్వాభావికం గానే శ్రద్ధ వహిస్తాం. మొదట గా తీసుకోవలసిన ప్రతిస్పందన పూర్వక చర్యల ను తీసుకొన్న తరువాత, మౌలిక సదుపాయాల పటిష్టీకరణ పైన సైతం మనం శ్రద్ధ వహించాలి.

 

 

మిత్రులారా,

ప్రకృతి కి మరియు విపత్తుల కు సరిహద్దులు అనేవి ఏవీ ఉండవు. ఒక దేశం తో మరొక దేశం పరస్పరం బాగా ఎక్కువ గా సంధానం అయి ఉన్నటువంటి ప్రస్తుత కాలం లో విపత్తు లు మరియు విచ్ఛిన్నాలు కలిగించే ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రపంచం లో ప్రతి ఒక్క దేశం తన వంతు గా ప్రతిఘాత స్వభావాన్ని ఏర్పరచుకొన్నప్పుడు, అది జరిగినప్పుడు మాత్రమే యావత్తు ప్రపంచం ఉమ్మడి గా విపత్తుల ను ఎదుర్కొనే సత్తా ను సంపాదించుకోగలుగుతుంది. నష్ట భయాలు అనేవి ఉమ్మడి గా ఉంటున్న కారణం గా ప్రకృతి ఆటు పోటులకు తట్టుకొని నిలచే ప్రణాళిక ను కూడా ఉమ్మడి గా ఆచరించడం ముఖ్యం. ఈ విధమైనటువంటి సమష్టి ఆశయ సాధన లో సిడిఆర్ఐ మరియు ఈ సమావేశం మనకు సహాయకారి గా ఉంటాయి.

 

 

మిత్రులారా,

ఉమ్మడి ప్రతిఘాత శక్తి ని సంపాదించుకోవడాని కి మనం అత్యంత బలహీనమైన వర్గాల కు సమర్థన ను అందించే తీరాలి. ఉదాహరణ కు తీసుకొంటే, అభివృద్ధి చెందుతున్నటువంటి చిన్న ద్వీప దేశాలు తీవ్రమైన విపత్తుల సంబంధి నష్ట భయాన్ని కలిగి ఉన్నాయి. ఆ కోవ కు చెందిన 13 దేశాల కు ఆర్థిక సహాయాన్ని అందించే ప్రాజెక్టుల తో కూడిన ఒక కార్యక్రమాన్ని సిడిఆర్ఐ సిద్ధం చేసింది. డొమినికా లో ప్రకృతి విపత్తుల ను తట్టుకొని నిలబడేటటువంటి ఇళ్ళ నిర్మాణం, పాపువా న్యూ గినీ లో ఇదే తరహా రవాణా సంబంధఇ నెట్ వర్క్ ల కల్పన మరియు డొమినికన్ రిపబ్లిక్ లోను, ఫిజీ లోను అధిక సామర్థ్యం కలిగిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు లను ఈ దిశ లో కొన్ని ఉదాహరణలు గా చెప్పుకోవచ్చును. వికాస శీల (గ్లోబల్ సౌథ్) దేశాల పట్ల సైతం సిడిఆర్ఐ దృష్టి ని కేంద్రీకరించడం బాగుంది.

 

మిత్రులారా,

  1. సభ్యత్వ దేశాల కు అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం నిర్వహించిన కాలం లో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడమైంది. ఒక క్రొత్త డిజాస్టర్ రిస్క్ రిడక్శన్ వర్కింగ్ గ్రూపు ను దానికి అవసరమైన ఆర్థిక సహాయం పైన కీలక చర్చ ను జరిపి మరీ ఏర్పాటు చేయడమైంది. సిడిఆర్ఐ యొక్క వృద్ధి తో పాటే తీసుకొన్న ఆ తరహా చర్యలు ప్రపంచాన్ని ఒక భద్రమైన భవిత వైపునకు తీసుకొని పోగలవు. రాగల రెండు రోజుల పాటు ఐసిడిఆర్ఐ లో ఫలప్రదమైన చర్చోపచర్చ లు తప్పక చోటుచేసుకొంటాయనుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు. మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.

 

 

***

 

 



(Release ID: 2018701) Visitor Counter : 76