ప్రధాన మంత్రి కార్యాలయం

మహావీర్ జయంతి సందర్భం లో భగవాన్ మహావీరుని 2550 వ నిర్వాణ్ మహోత్సవ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

స్మారక తపాలాబిళ్ళ ను మరియు నాణేన్ని ఆయన ఆవిష్కరించారు

 ‘‘భగవాన్ మహావీరుని  ప్రబోధాల పట్ల యువత లో నిబద్ధత దేశం సరి అయినదిశ లో ముందుకు సాగిపోతోంది అనడానికి ఒక సంకేతం గా ఉంది’’

 ‘మనం 2500 సంవత్సరాల తరువాత సైతం భగవాన్ మహావీరుని నిర్వాణ్ దివస్ను జరుపుకొంటున్నాం; మరి దేశ ప్రజలు రాబోయే వేల సంవత్సరాల పాటు భగవాన్ మహావీరునిఆదర్శాల ను ఒక  ఉత్సవం వలె తప్పక జరుపుకొంటారన్ననమ్మకం నాలో ఉంది’’

 ‘‘ప్రపంచం లో అనేకయుద్ధాలు జరుగుతూ ఉన్నటువంటి కాలం లో మన తీర్థంకరుల బోధన లు మరింత ప్రాముఖ్యాన్నిసంతరించుకొన్నాయి’’


 ‘‘విరోధాలతో చీలిపోయినటువంటిప్రపంచం లో ‘విశ్వ బంధు’ వలె భారతదేశం తనదైనటువంటి స్థానాన్ని సృష్టించుకొంటోంది’’


 ‘‘భారతదేశం యొక్క  స్వాభిమానమే భారతదేశాని కి ఒక గుర్తింపు గాఉంది అని నవ తరం విశ్వసిస్తున్నది. ఆత్మ గౌరవం జాగృతం అయినప్పుడు ఏ దేశాన్ని అయినా ఆపడం అసాధ్యంఅయిపోతుంది ’’


‘‘భారతదేశం దృష్టిలో, ఆధునికత్వం అనేది ఆ దేశం యొక్క దేహం గాను మరియుఆధ్యాత్మికత్వం అనేది ఆ దేశాని కి ఆత్మ గాను ఉన్నది’’

Posted On: 21 APR 2024 12:04PM by PIB Hyderabad

మహావీర్ జయంతి శుభ సందర్భం లో భగవాన్ మహావీరుని 2550 వ నిర్వాణ్ మహోత్సవ్ ను ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. భగవాన్ మహావీరుని ప్రతిమ కు శ్రీ నరేంద్ర మోదీ బియ్యాన్ని మరియు పూల రేకుల ను సమర్పించి శ్రద్ధాంజలి ని ఘటించారు. ‘‘వర్తమాన్ మేఁ వర్థమాన్’’ అనే పేరు తో భగవాన్ మహావీర్ స్వామి ని గురించినటువంటి ఒక నృత్య నాటిక ను పాఠశాల విద్యార్థులు ప్రదర్శించగా, ఆ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి చూశారు. ఇదే సందర్భం లో ఒక స్మారక తపాలా బిళ్ళ ను మరియు నాణేన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.

 

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న భగవాన్ మహావీర్ 2550 వ నిర్వాణ్ మహోత్సవ్ కు సాక్షి గా భవ్యమైన భారత్ మండపమ్ నిలచిందంటూ అభివర్ణించారు. ‘వర్తమాన్ మేఁ వర్థమాన్’’ పేరిట పాఠశాల విద్యార్థులు భగవాన్ మహావీర్ స్వామి ని గురించిన ఒక నృత్య నాటిక ను ప్రదర్శించడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భగవాన్ మహావీర్ యొక్క ఆదర్శాల పట్ల యువత లో ఉన్న సమర్పణ భావం మరియు నిబద్ధత లు దేశం సరి అయిన దిశ లో ముందుకు సాగుతోంది అని తెలియజేసే సంకేతాలు గా ఉన్నాయి అన్నారు. ఒక స్మారక తపాలా బిళ్ళ ను మరియు నాణేన్ని ఈ సందర్భం లో ఆవిష్కరించడాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించి, జైన సముదాయం అందించిన ఆశీస్సుల కు మరియు మార్గదర్శకత్వాని కి ధన్యవాదాల ను తెలియ జేశారు. జైన సముదాయాని కి చెందిన సాధువుల కు శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు. పవిత్రమైనటువంటి మహావీర్ జయంతి సందర్భం లో పౌరులు అందరికి ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని అర్పించి, ఆచార్యుల తో ఇటీవల తాను జరిపిన భేటీ ని గుర్తు కు తెచ్చుకొన్నారు. వారి ఆశీర్వాదం ఇప్పటికీ మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది అన్నారు.

 

 

భగవాన్ మహావీరుని యొక్క 2550 వ నిర్వాణ్ మహోత్సవ్ కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, దేశం స్వాతంత్య్రం తాలూకు సువర్ణ శతాబ్ది ని ఆవిష్కరించే దిశ లో కృషి చేస్తున్న వేళ అమృత్ కాల్ తాలూకు ప్రారంభిక దశ మొదలు కావడం వంటి అనేక సంతోషదాయకం అయిన యాదృచ్ఛిక ఘటనల ను గురించి ప్రస్తావించారు. రాజ్యాంగాని కి 75 వ సంవత్సరం రావడం మరియు దేశ భావి గతి ని నిర్ణయించేటటువంటి ప్రజాస్వామ్య ఉత్సవాన్ని గురించి కూడా ఆయన తన ప్రసంగం లో ప్రస్తావించారు.

 

 

అమృత్ కాలం అనే ఆలోచన ఒక సంకల్పం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రేరణ అని, అది మనకు అమరత్వాని కి మరియు అనంత కాలం వరకు జీవించేందుకు అనుమతి ని ఇస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మనం 2500 సంవత్సరాలు అయిన తరువాత సైతం భగవాన్ మహావీరుని నిర్వాణ్ దివస్ ను జరుపుకొంటున్నాం; మరి దేశం రాబోయే వేల సంవత్సరాల పాటు భగవాన్ మహావీరుని యొక్క ఆదర్శాల ను ఒక ఉత్సవం మాదిరి గా తప్పక జరుపుకొంటూనే ఉంటుందన్న నమ్మకం నాలో ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రాబోయే వందల సంవత్సరాల ను గురించి న ఆలోచనల ను చేయడం అనేది భారతదేశం యొక్క శక్తి గా ఉంది, మరి భారతదేశాని కి ఉన్న దూరదృష్టి ఈ దేశాన్ని ఈ ధరణి మీద అన్నింటి కంటే దీర్ఘ కాలం వరకు మనుగడ సాగించేటటువంటి ఒక నాగరకత గా తీర్చిదిద్ది, ఇవాళ మానవాళికి ఒక భద్రమైన ప్రదేశం గా మార్చివేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఒక్కరి ని గురించి కాకుండా అందరి ని గురించి ఆలోచించేటటువంటి, మరి అందరి అస్తిత్వాన్ని నమ్మేటటువంటిది భారతదేశం. సంప్రదాయాల ను గురించి మాత్రమే కాకుండా, విధానాల ను గురించి కూడా భారతదేశం మాట్లాడుతుంది. శరీరం లో ప్రపంచం ఉంది, ప్రపంచం లో బ్రహ్మం ఉంది, జీవి లో శివతత్త్వం ఉంది అని చెప్పేది ఒక్క భారతదేశమే.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

ఒకచోటే ఆగిపోతే ఆలోచన లు బేధాభిప్రాయాలు గా మారవచ్చును. ఏమైనా, చర్చించడం అనేది జరిగినప్పుడు సరిక్రొత్త ఆలోచన లు మొగ్గ తొడగడానికి చర్చ అనేది ఒక కారణం గా కావడం తో పాటు గా, వినాశాని కి కూడా ఒక కారణం గా చర్చ మారవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన 75 సంవత్సరాల మథనం నుండి ఈ యొక్క అమృత కాలం లో అమృతం వెలికి రావాలి అని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రపంచం లో అనేక యుద్ధాలు చెలరేగుతూ ఉన్నటువంటి కాలం లో మన తీర్థంకరుల బోధన లు మరింత మహత్వపూర్ణం గా మారిపోయాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘అనేకాంతవాదం మరియు స్యాద్ వాదం వంటి తత్త్వాల ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొంటూ, అవి మనకు మనకు ఒక విషయానికి ఉన్నటువంటి అనేక పార్శ్వాల ను అర్థం చేసుకొనేటటువంటి మరియు ఇతరుల దృష్టికోణాన్ని కూడా చూడడం మరి వాటి ని స్వీకరించడం అనే ఉదారత్వాన్ని అలవరచుకోవడాన్ని గురించి బోధిస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

ప్రస్తుతం సంఘర్షణల లో చిక్కుకొనిపోయి ఉన్నటువంటి ప్రపంచం భారతదేశం నుండి శాంతి ని కోరుకొంటోంది అని ప్రధాన మంత్రి అన్నారు. న్యూ ఇండియా యొక్క ఈ నూతన భూమిక యొక్క ఖ్యాతి మన పెరుగుతున్న సామర్థ్యాని కి మరియు విదేశీ విధానానికి ఇవ్వడం జరుగుతోందన్నారు. అయితే దీనిలో మన సాంస్కృతిక ముద్ర యొక్క తోడ్పాటు ఎంతగానో ఉందన్నారు. ‘ప్రస్తుతం మనం సత్యం మరియు అహింస ల సిద్ధాంతాల ను ప్రపంచ వేదికల లో పూర్తి విశ్వాసం తో వినిపిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. ‘‘ప్రపంచం లో ఎదురవుతున్న సమస్యల కు ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాల లో ఒక పరిష్కారం ఉంది అని ప్రపంచాని కి మనం చాటుతున్నాం. ఈ కారణం గానే, చీలిక లు వాలికలు అయిన ఒక ప్రపంచం లో ఓ ‘విశ్వ బంధు’ గా భారతదేశం తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొంటోంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. బజలవాయు పరివర్తన తో తలపడడం కోసం మిశన్ లైఫ్, మరి అలాగే వన్ అర్థ్, వన్ ఫేమిలీ ఎండ్ వన్ ఫ్యూచర్ అనే దార్శనికత, ఇంకా వన్ వరల్డ్, వన్ సన్, వన్ గ్రిడ్ వంటి మార్గసూచీ అనే కార్యక్రమాల ను గురించి ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. భారతదేశం ప్రస్తుతం ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ వంటి భవిష్యత్తు కాలాని కి అనుకూలమైన ఒక ప్రపంచ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోతోంది అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలు ప్రపంచం లో ఆశ ను చిగురింప చేయడం ఒక్కటే కాకుండా మన సంస్కృతి పట్ల, మన సంప్రదాయాల పట్ల ప్రపంచం యొక్క దృక్పథం లో మార్పు ను తీసుకు వచ్చాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

జైన ధర్మం యొక్క అర్థాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అది ‘జిన్’ యొక్క పథం, మరో మాట లో చెప్పాలి అంటే గెలిచిన వారు అనుసరించినటువంటి మార్గం అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ఎన్నడూ మరొక దేశాన్ని జయించాలి అనే లక్ష్యం తో దాడి జరపనే లేదు, దీని కంటే తన ను తాను సంస్కరించుకొని తన లోటు పాటు ల మీద విజయాన్ని సాధించడానికి పాటు పడింది అని చెప్పాలి అని ఆయన నొక్కి పలికారు. మహా సాధువులు మరియు మునులు భారతదేశాని కి చీకటి కాలాల్లో దారిని చూపించారు, దీనితో గొప్ప గొప్ప నాగరకత లు నష్టపోయినప్పటికీ దేశాని కి తనదైనటువంటి దారి ని వెదకడం లో సాయం అందింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

పది సంవత్సరాల లో చోటు చేసుకొన్న అనేక సమావేశాల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, మన జైన ఆచార్యులు నన్ను ఆహ్వానించినపప్పుడల్లా ఆ యా కార్యక్రమాల లో తప్పక పాలుపంచుకోవాలనేదే నా యొక్క ప్రయాస గా ఉండిది అన్నారు. ‘‘పార్లమెంటు యొక్క క్రొత్త భవనం లోపల కు ప్రవేశించే ముందు, నేను నా యొక్క ఆదర్శాల ను గుర్తు కు తెచ్చుకోవడం కోసం ‘మిచ్ఛామీ దుక్కడమ్’ అనే పదాల ను ఉచ్చరించిన సంగతి నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదే విధం గా వారసత్వ కట్టడాల ను మెరుగు పరచుకోవడం గురించి, యోగ ను గురించి మరియు ఆయుర్వేద ను గురించి కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. భారతదేశం యొక్క గుర్తింపు అనేది ఆ దేశం స్వాభిమానం లోనే ఉంది అనే అంశం లో నవ తరాని కి నమ్మకం ఏర్పడింది అని ఆయన అన్నారు. ఎప్పుడయితే స్వాభిమానం అనే భావన దేశం లో జాగృతం అవుతుందో, ఆ దేశాన్ని ఆపడం అసాధ్యం అయిపోతుంది, భారతదేశం యొక్క ప్రగతి యే దీనికి ప్రమాణం గా ఉంది అని ఆయన అన్నారు.

 

 

‘‘భారతదేశం దృష్టి లో, ఆధునికత అంటే భారతదేశం యొక్క దేహం, ఆధ్యాత్మికత్వం ఏమో భారతదేశాని కి ఆత్మ గా ఉంది. ఒకవేళ ఆధునికత్వం లో నుండి ఆధ్యాత్మికత ను తీసివేశామా అంటే అరాజకవాదం తల ఎత్తుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భగవాన్ మహావీరుని బోధనల ను ఆచరించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఈ మూల్యాల ను పునర్జీవింప చేయడం అనేది ఇవాళ్టి కాలం కోరుకొంటున్న అంశం అని ఆయన అన్నారు.

 

 

భారతదేశం లో 25 కోట్ల మంది కి పైగా ప్రజలు పేదరికం వలయం లో నుండి బయటకు వచ్చారు అంటే భ్రష్టాచారం, ఇంకా నిరాశ ల తో కూడిన కాలం నుండి భారతదేశం వెలుపల కు వస్తోంది అన్న మాట అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ క్షణం యొక్క ప్రయోజనాన్ని అందుకోండంటూ పౌరుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేస్తూ అందరు ‘అస్తేయం (దొంగతనం జోలికి వెళ్లక పోవడం),మరియు అహింస’ ల దారి లో నడవాలంటూ సూచించారు. దేశం యొక్క భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని పనిచేస్తూ ఉండాలి అన్నదే తన నిబద్ధత అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సాధువులు ప్రేరణాత్మకమైన మాటల ను పలికినందుకు గాను వారి కి ధన్యవాదాల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.

 

 

ఈ కార్యక్రమం లో జైన సముదాయాని కి చెందిన సాధువులు మరియు ఇతర ప్రముఖ వ్యక్తుల తో పాటు చట్టం- న్యాయం ల శాఖ కేంద్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) మరియు పార్లమెంటరీ వ్యవహారాలు & సంస్కృతి శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ పాల్గొన్నారు.

 

పూర్వరంగం

అహింస, సత్యం, అస్తేయం (దొంగతనం జోలికి వెళ్లక పోవడం), బ్రహ్మచర్యం, ఇంకా అపరిగ్రహ (అనాసక్తి) ల వంటి జైన సిద్ధాంతాల మాధ్యం ద్వారా శాంతిపూర్ణ సహ అస్తిత్వం మరియు సార్వజనిక సోదర భావం ల బాట ను 24 వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ ప్రకాశవంతం చేసి వేశారు.

 

 

జైన్ మహావీర్ స్వామి జీ సహా ప్రతి ఒక్క తీర్థంకరుని యొక్క అయిదు కల్యాణక్ (ప్రముఖ కార్యక్రమం)ల ను జైనులు జరుపుకొంటూ ఉంటారు: వాటిలో చ్యవన్ / గర్భ కల్యాణక్ (గర్భాదానం) ; జన్మ కల్యాణక్; దీక్ష కల్యాణక్, కేవల్ జ్ఞాన కల్యాణక్ లతో పాటు నిర్వాణ కల్యాణక్ అనే కార్యక్రమాలు భాగం గా ఉంటాయి. 2024 వ సంవత్సరం లో ఏప్రిల్ 21 వ తేదీ న భగవాన్ శ్రీ మహావీర్ స్వామి యొక్క జన్మ కల్యాణ తిథి కాగా ఈ సందర్భం లో జైన సముదాయం తో ప్రభుత్వం కలసి భారత్ మండపమ్ లో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఉత్సవాన్ని నిర్వహించింది. జైన సముదాయం యొక్క సాధువులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొని, వారి యొక్క ఆశీర్వాదాల ను సభికుల కు అందజేశారు.

 

 

***

DS/TS



(Release ID: 2018458) Visitor Counter : 100